ఇదేం పని?...బాలీవుడ్ నటిని ట్రోల్స్‌తో దంచేస్తున్న నెటిజన్స్

తన లేటెస్ట్ సినిమా ప్రమోషన్‌లో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ బిజీగా ఉంది. ప్రమోషన్‌లో భాగంగా శ్రద్ధా ధరించిన డ్రెస్ డిజైన్‌పై నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.

news18-telugu
Updated: January 19, 2020, 8:19 AM IST
ఇదేం పని?...బాలీవుడ్ నటిని ట్రోల్స్‌తో దంచేస్తున్న నెటిజన్స్
బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్‌పై ట్రోల్స్
  • Share this:
నేటి సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీలు తెలిసీ తెలియక ఏ తప్పు చేసినా ట్రోలింగ్స్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ట్రోల్స్ బాధితుల జాబితాలో చేరిపోయారు. డ్రెస్ డిజైన్‌ను శ్రద్ధా కాపీకొట్టిందని నెటిజన్స్ ట్రోల్స్‌తో దంచిపారేస్తున్నారు. తన లేటెస్ట్ మూవీ ‘స్ట్రీట్ డ్యాన్సర్ 3డీ’ ప్రమోషన్‌లో శ్రద్ధా బిజీగా ఉంది. ప్రమోషన్‌లో భాగంగా శ్రద్ధా వెరైటీ డ్రెస్ డిజైన్‌లో చాలా క్యూట్‌గా ఉంది. అయితే శ్రద్ధా, ఆమె స్టైలిస్ట్ తన్యా గౌరీ డ్రస్ డిజైన్‌ను కాపీ చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే రకమైన డ్రెస్‌లో ఓ మోడల్ క్యాట్‌వాక్ చేస్తున్న వీడియోను బాలీవుడ్ డైటీషియన్ సబ్యా పోస్ట్ చేశారు. దీంతో ఇదేం పని అంటూ శ్రద్ధా, ఆమె స్టైలిస్ట్ తన్యా గౌరీలను నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. 

Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి
 

@tanghavri what was the reason? 😂😂😂 . @shraddhakapoor in a #Gandi @zimmermann copy by @lovexlabels . #dietsabya #copy #lol #🤢


Diet Sabya (@dietsabya) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది


గతంలో శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ కూడా ఇలాగే ట్రోల్స్ ఎదుర్కొంది. దబూ రత్నానీ క్యాలెండర్ ఫోటోషూట్ కోసం జాన్వీ కపూర్ డ్రెస్ డిజైన్‌ను కాపీకొట్టిందంటూ గతంలోనూ డైటీషియన్ సబ్యా ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీంతో జాన్వీ కపూర్‌ని కాపీ క్యాట్ అంటూ నెటిజన్స్ ట్రోల్స్‌తో ఉతికి ఆరేశారు. 
Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి
 

And I oop ... . . . Left: @mihanomomosa bridal 2017; right: @houseofexc 2019 #dietsabya #gandi #copy


Diet Sabya (@dietsabya) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది
First published: January 19, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు