ఈ మధ్య బాలీవుడ్ హీరోయిన్లు వరసగా పెళ్లి పీటలెక్కుతున్నారు. దాంతో ఇదే కోవలో సాహో హీరోయిన్ శ్రద్ధా కపూర్ కూడా పెళ్లి చేసుకుంటుంది అంటూ ఈ మధ్య వార్తలు బాగానే పుట్టుకొచ్చాయి. ఆమె ఓ రోహన్ శ్రేష్ట అనే ఫోటోగ్రఫర్ ప్రేమలో ఉందని ప్రచారం జరుగుతుంది. 2020లో ఈ ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి. దాంతో ఇప్పుడు ఈ వార్తలపై శ్రద్ధా కపూర్ తండ్రి, సీనియర్ నటుడు శక్తి కపూర్ స్పందించాడు. అసలు తన కూతురు పెళ్లి చేసుకుంటుందని ఎవరు చెప్పారంటూ ఈయన ఫైర్ అయ్యాడు.
అలాంటి వార్తల్లో అసలు నిజం లేదు.. తన కూతురు చెప్పుకుండా పెళ్లి చేసుకునేంత మూర్ఖురాలు కాదంటూ వెనకేసుకొచ్చాడు ఈయన. మీడియాలో శ్రద్ధా కపూర్ పెళ్లి గురించి వచ్చినవన్నీ చెత్త వార్తలే.. అందులో ఒక్కటి కూడా నిజం లేదు.. శ్రద్ధా కపూర్‌కు మరో ఐదేళ్ల వరకు పెళ్లి చేసుకునే ఉద్ధేశ్యమే లేదని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని ఆమె తండ్రి తేల్చేసాడు. ప్రస్తుతం శ్రద్ధా కపూర్ వరస సినిమాలు చేస్తుందని.. ఇప్పుడు పెళ్లి గురించి ఆలోచించే సమయం కూడా ఆమె దగ్గర లేదంటూ చెప్పాడు శక్తి కపూర్.
కొన్నేళ్లుగా శ్రద్ధా కపూర్ ఆమెను ప్రేమిస్తుందనే వాదనలో కూడా నిజం లేదని క్లారిటీ ఇచ్చాడు శక్తి. ఇక్కడ చాలా మంది ఎవరికి నచ్చింది వాళ్లు మాట్లాడుతుంటారు.. అవన్నీ పట్టించుకుంటే ఇక్కడ పనులు జరగవు అంటూ రూమర్లను తీసి పారేస్తున్నాడు శక్తి కపూర్. పైగా రోహన్ శ్రేష్ట తండ్రి రాకేష్ తనకు మంచి స్నేహితుడు అని.. పిల్లలు ప్రేమించుకుంటే ముందు తమకు చెప్తారని చెప్పాడు శక్తి. ఇక శ్రద్ధా కపూర్ కూడా ఇప్పుడు సినిమాలు తప్ప పెళ్లిపై ధ్యాస లేదని చెప్పింది. దాంతో ప్రస్తుతానికి ప్రభాస్ హీరోయిన్ పెళ్లిపై టాపిక్ ముగిసినట్లే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Prabhas, Saaho, Shradda kapoor, Shraddha Kapoor, Telugu Cinema, Tollywood