Saaho: ‘సాహో’ సినిమాకు శ్రద్ధా కపూర్ తీసుకున్న పారితోషకం తెలిస్తే షాక్ అవుతారు..

రాజమౌళి  ప్రభాస్ హీరోగా నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సాహో’. బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో కథానాయికగా నటించేందకు శ్రద్ధాకు బాగానే ముట్టచెప్పినట్టు సమాచారం.

news18-telugu
Updated: August 14, 2019, 12:45 PM IST
Saaho: ‘సాహో’ సినిమాకు శ్రద్ధా కపూర్ తీసుకున్న పారితోషకం తెలిస్తే షాక్ అవుతారు..
శ్రద్ధా కపూర్ (ఫైల్ ఫోటోస్)
news18-telugu
Updated: August 14, 2019, 12:45 PM IST
రాజమౌళి  ప్రభాస్ హీరోగా నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సాహో’. బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా కోసం ఇటు ప్రభాస్ అభిమానులతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో యాక్షన్ థ్రిల్లర్‌లో  ప్రభాస్‌ సరసన హీరోయిన్‌గా నటించింది శ్రద్ధాకపూర్. ఈ సినిమాతో శ్రద్ధా కపూర్.. సౌత్ ఇండస్ట్రీలో అడుగుపెడుతోంది. ఐతే.. శ్రద్ధాకపూర్‌ బాలీవుడ్‌లో పేరున్న కథానాయిక అయినా..   రెమ్యునరేషన్‌ మాత్రం ఎప్పుడూ  రూ. మూడు కోట్లు దాటలేదు. సాహూ లో నటించమని అడగగానే ఏకంగా రూ. 7కోట్ల రూపాయలు డిమాండ్‌ చేసిందట శ్రద్ధ. దానికి తోడు ఈ సినిమా చేస్తున్నంత కాలం మరే హిందీ సినిమా చేయనని కూడా రాసిచ్చిందట. అలా రాసిచ్చినందుకే ఏడు కోట్లు సమర్పించుకున్నారు ‘సాహో’ చిత్ర నిర్మాతలు.ఆమె రెమ్యునరేషన్‌ చూసి కొందరు కళ్ళు తేలేస్తున్నారు. ఆమె తమ సినిమాలో నటించడం ప్లస్‌ పాయింటవుతుందని అందుకే అంత మొత్తం చెల్లించామని నిర్మాతలు చెప్పుకొస్తున్నారు.  మొత్తానికి ‘సాహో’ మంచి విజయం సాధిస్తే శ్రద్ధ తన రెమ్యునరేషన్‌ ఏ పదికోట్లో పెంచేస్తుందంటున్నారు సినీ జనాలు.

First published: August 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...