Home /News /movies /

SHRADDHA KAPOOR BROTHER SIDDHANTH KAPOOR RELEASED ON BAIL IN DRUGS CASE SB

Drugs Case:శ్రద్ధకపూర్ సోదరుడికి బెయిల్.. వైరల్ అవుతున్న పార్టీ వీడియో..!

శ్రద్ధకపూర్ సోదరుడు అరెస్ట్

శ్రద్ధకపూర్ సోదరుడు అరెస్ట్

ఆదివారం రాత్రి ఓ హోటల్ పై దాడి చేసిన పోలీసులు శ్రద్ధకపూర్ సోదరుడితో పాటు.. మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు.తాజాగా వీరికి బెయిల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

    బాలీవుడ్‌ను డ్రగ్స్ వీడటం లేదు. తాజాగా మరో డ్రగ్స్ కేసు బాలీవుడ్ ప్రముఖులకు షాక్ ఇచ్చింది. స్టార్ హీరోయిన్ శ్రద్ధకపూర్(Shraddah Kapoor) సోదరుడు సిద్ధాంత్ కపూర్(Siddhanth Kapoor) డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాడు. బెంగుళూరు పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. హోటల్‌లో పార్టీ చేసుకుంటున్న సిద్ధాంత్ కపూర్‌ను డ్రగ్స్ వినియోగించాడన్న ఆరోపణలపై పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలసిందే. అయితే  తాజాగా సిద్ధాంత్ కపూర్‌కు బెయిల్ వచ్చింది.

    డ్రగ్స్ కేసులో(Drugs case) అరెస్ట్ అయిన అతడు తాజాగా బెయిల్ పై రిలీజ్ అయ్యాడు. సిద్దాంత్ కు సోమవారం ఆలస్యంగా బెయిల్‌ వచ్చింది. అరెస్టయిన మిగతా నలుగురు కూడా బెయిల్‌పై విడుదలయ్యారని పోలీసులు తెలిపారు. సిద్ధాంత్ కపూర్ తో పాటు మరో నలుగురు పోలీసుల ముందు హాజరు కావాల్సి ఉంటుందని తూర్పు బెంగళూరు(Bengalore) డిప్యూటీ కమిషనర్ భీమా శంకర్ గుల్లెద్ తెలిపారు. ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 35 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.



    మరోవైపు సిద్దాంత్ హాజరైన పార్టీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సిద్ధాంత్‌ అరెస్ట్‌ అయిన కొద్ది గంటల తర్వాత ఈ వీడియో హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియోలో సిద్ధాంత్‌ డీజే ప్లే చేస్తూ కనిపించాడు. అతను ప్లే చేస్తున్న మ్యూజిక్‌కి పార్టీలోని మిగతా వారంతా డ్యాన్స్‌ చేస్తున్నారు.ఇప్పుడు ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

    ఆదివారం (జూన్‌ 12) రాత్రి బెంగళూరులో పార్టీ జరుగుతున్న హోటల్‌పై పోలీసులు దాడి చేయగా పలువురు డ్రగ్స్‌ సేవించినట్లు నిర్ధారించారు. వారిలో సిద్ధాంత్‌ కపూర్‌ కూడా ఉన్నట్లు ధృవీకరించారు. సిద్ధాంత్‌తోపాటు మరో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆరుగురు డ్రగ్స్‌ తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వీరిని ఉల్సూరు పోలీస్‌ స్టేషన్‌కు తరిలించినట్లు వెల్లడించారు. అయితే షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ డ్రగ్స్‌ కేసు మరవకముందే బాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్‌ కేసు నమోదు కావడం ఇప్పుడు  సంచలనం సృష్టిస్తోంది.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Bollywood drugs case, Shradda kapoor

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు