ప్రభాస్ సాహోతో తెలుగు తెరకు పరిచయమైన స్టార్ కిడ్ శ్రద్ధా కపూర్ ఓ క్రేజీ రికార్డ్‌ను నెలకొల్పింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా ఫాలో అవుతున్న భారతీయ ప్రముఖులలో శ్రద్ధా కపూర్ మూడవ స్థానంలో నిలిచింది. ఇక్కడ విషయం ఏమంటే.. శ్రద్ధా కపూర్.. దీపికా పదుకొనేను దాటి ఈ రికార్డ్‌ను నెలకొల్పింది. శ్రద్ధాకు ఇన్ స్టాగ్రామ్‌లో ప్రస్తుతం 56.5 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇక గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా 58 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ను కలిగి ఉండి కొద్దిగా ముందంజలో ఉంది. దీపికకు 52 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. రెండవ స్థానంలో ప్రియాంక ఉండగా.. మొదటి స్థానం క్రికెటర్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. కోహ్లీని 82 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఇన్నాళ్లూ టాప్-3లో ఉన్న దీపిక ఇప్పుడు 52.3మిలియన్ల ఫాలోవర్స్‌తో నాలుగో స్థానానికి పడిపోయింది. శ్రద్ధాకపూర్ ఇన్‌స్టాను అనుసరించే వారి సంఖ్య గతేడాది నుంచి భారీగా పెరిగింది. దీనికి కారణం లేకపోలేదు.
శ్రద్ధా తన సినిమాలకు సంబందించిన విశేషాలతో పాటు గ్లామరస్ ఫొటోలు, ప్రకటనలు, ప్రమోషనల్ వీడియోలు, స్నేహితులు, కుటుంబ సభ్యులకు బర్త్‌డే విషెస్ చెప్పడం చేస్తుంది. ఇలా అభిమానులకు అందుబాటులో ఉండటంతో శ్రద్ధాను అనుసరించే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యధికమంది ఇన్‌స్టా ఫాలోవర్లు కలిగిన వ్యక్తిగా క్రిస్టియానో రొనాల్డో 241 మిలియన్ ఫాలోవర్స్‌తో మొదటి స్థానంలో నిలిచారు. ఆ తర్వాత అమెరికన్ పాప్ సింగర్ అరియానా గ్రాండే 205 మిలియన్లతో రెండవ స్థానంలో ఉన్నారు. మరో అమెరికన్ నటుడు డ్వేన్ జాన్సన్.. 202 మిలియన్లతో మూడో స్థానంలో ఉన్నారు.
ఇక శ్రద్ధా సినిమాల విషయానికి వస్తే.. ఆమె తెలుగులో ప్రభాస్ సరసన సాహోలో మెరిసింది. ఆ తర్వాత ఏ తెలుగు సినిమాలోను నటించలేదు. ఇక దీపికా విషయానికి వస్తే.. ఆమె ప్రస్తుతం 83 అనే సినిమాలో తన భర్త రణ్ వీర్ సింగ్ సరసన చేస్తోంది. ఈ సినిమాతో పాటు ఆమె ప్రభాస్ సరసన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనుంది. ఈ సినిమాను అశ్వినీ దత్ నిర్మిస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ప్రభాస్ రాధేశ్యామ్ షూటింగ్ పూర్తైన తర్వాత ఈ సినిమా మొదలుకానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.