Shraddha Kapoor Dabboo Ratanani Photo Shoot | శ్రద్ధా కపూర్.. బాలీవుడ్ విలన్ శక్తి కపూర్ నట వారసురాలిగా అడుగుపెట్టి హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మొదటగా అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన ‘తీన్‌పత్తి’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘లవ్ కా ది ఎండ్’ సినిమాలో నటించిన రానీ గుర్తింపు .. ’ఆషికీ 2’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయింది. ఇక ఈ భామ గతేడాది ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సాహో’ సినిమాలో కథానాయిగా నటించింది. ఈ సినిమాలో ఇటూ గ్లామర్ గాను, అటూ యాక్షన్ సీన్స్‌లో కూడ అదరగొట్టింది. అది అలా ఉంటే శ్రద్ధా ఎప్పటికపుడు తన లేటెస్ట్ ఫోటోస్‌ను, తాను నటిస్తున్న సినిమాల గురించి విశేషాలను సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ.. అభిమానులతో టచ్‌లో ఉంటుంది. తాజాగా ఈ భామ బ్యాక్‌లెస్‌తో దిగిన ఓ ఫోటోను డబూ రత్నానీ.. తన సోషల్ మీడియా వేదికైన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు.
డబూ రత్నానీ బాలీవుడ్లో నెంబర్ వన్ ఫోటో గ్రాఫర్‌గా 25 ఏళ్లు కంప్లీట్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా అతను గతంలో తీసిన ఫోటోస్‌ను ఈ సందర్భంగా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు. అందులో భాగంగా శ్రద్ధా కపూర్‌తో పాటు సన్ని లియోన్, షారుఖ్ ఖాన్లకు సంబంధించి డబూ రత్నానీ షూట్ చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసాడు. బాలీవుడ్లో ఎంత పెద్ద సెలబ్రిటీలైన డబూ రత్నానీ ఫోటో షూట్ కోసం పడికాపులు కాయాల్సిందే. ఇప్పటికే కియారా అద్వానీ ఆకు చాటున ఉన్న ఫోటోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు తెలుగు హీరోలైన ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబుకు సంబంధించి డబూ రత్నానీ తీసిన ఫోటో షూట్స్ ఎంతో పాపులర్ అయ్యాయి.
ఇక శ్రద్ధా కపూర్ విషయానికొస్తే.. ఈ యేడాది శ్రద్ధా కపూర్.. స్ట్రీట్ డాన్సర్ సినిమాతో పాటు బాఘీ 3 సినిమాలతో పలకరించింది. ఈ సినిమాలు ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేసాయి.మరోవైపు అలనాటి అందాల తార శ్రీదేవి నటించిన ‘నగీనా’ సినిమా రీమేక్‌లో నటిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood, Dabboo Ratnani Calender, Shraddha Kapoor, Tollywood