నయనతారను యాంకర్‌గా ఉన్నప్పుడు చూస్తే... అమ్మో అనాల్సిందే

సినిమాల్లోకి రాకముందు నయన్ యాంకరింగ్ చేసింది. ఓ మళయాళ న్యూస్ ఛానెల్‌లో ఆమె యాంకర్‌గా పనిచేసేది.

news18-telugu
Updated: November 26, 2019, 8:38 AM IST
నయనతారను యాంకర్‌గా ఉన్నప్పుడు చూస్తే... అమ్మో అనాల్సిందే
నయనతార
  • Share this:
నయనతార... ప్రస్తుతం సౌతిండియాలోనే లేడీ సూపర్ స్టార్. తెలుగు తమిళ్ మలయాళ సినిపరిశ్రమను ఏలుతున్న రారాణి. ప్రముఖ అగ్ర హీరోలందరితో దాదాపుగా నటించిందీ ఈ ముద్దుగుమ్మ. 16 ఏళ్లక్రితమే సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది నయన్. 2003లో 'మనస్సినక్కరే' అనే మలయాళం చిత్రంతో చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టింది. చంద్రముఖి సినిమాలో రజని సరసన నటించిన ఈ భామ సూపర్ హిట్ టాక్ అందుకుంది. ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతూ సౌత్ ఇండస్ట్రీలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ నయన్ రికార్డులకెక్కింది. తాజాగా సైరా నరసింహ రెడ్డి, విజిల్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నయనతార ప్రస్తుతం బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్‌తో ప్రేమలో ఉంది ఈ భామ.

తాజాగా నయనతారకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సినిమాల్లోకి రాకముందు నయన్ యాంకరింగ్ చేసింది. ఓ మళయాళ న్యూస్ ఛానెల్‌లో ఆమె యాంకర్‌గా పనిచేసేది. ప్రస్తుతం ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని చూసిన వారెవరూ ఆమె నయనతార అని అస్సలు అనుకోరు. అంతేకాదు అదులో ఆమె గొంతు కూడా వేరేగానే ఉంది. 'నా పేరు డయానా మరియం కురియన్' అంటూ తన గురించి తాను చెప్తూ నయనతారకనిపించింది.

First published: November 26, 2019, 8:38 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading