ఎన్టీఆర్, త్రివిక్రమ్‌పై సంచలన అప్‌డేట్.. ఫ్యాన్స్‌కు పండగే..

Trivikram NTR: జూనియర్ ఎన్టీఆర్‌తో ఇప్పటికే అరవింద సమేత లాంటి హిట్ సినిమా తీసిన త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఈ ఏడాది మొదట్లోనే అల్లు అర్జున్‌తో అల వైకుంఠపురములో..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 30, 2020, 9:01 PM IST
ఎన్టీఆర్, త్రివిక్రమ్‌పై సంచలన అప్‌డేట్.. ఫ్యాన్స్‌కు పండగే..
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ (Jr NTR Trivikram)
  • Share this:
జూనియర్ ఎన్టీఆర్‌తో ఇప్పటికే అరవింద సమేత లాంటి హిట్ సినిమా తీసిన త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఈ ఏడాది మొదట్లోనే అల్లు అర్జున్‌తో అల వైకుంఠపురములో అంటూ ఇండస్ట్రీ హిట్ కొట్టేసాడు. దాంతో ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో తారక్ కోసం కథ సిద్ధం చేస్తున్నాడు మాటల మాంత్రికుడు. లాక్‌డౌన్ పూర్తైన తర్వాత ఈ షూటింగ్ మొదలు కానుంది. ఇప్పటికే జూన్ మొదటి వారం నుంచి పట్టాలెక్కించుకోవచ్చని ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది. అయితే ముందు రాజమౌళి సినిమాను పూర్తి చేసిన తర్వాత త్రివిక్రమ్ సినిమాపై ఫోకస్ చేయబోతున్నాడు ఎన్టీఆర్. దాంతో కథను మరింత పకడ్బందీగా సిద్ధం చేస్తున్నాడు త్రివిక్రమ్.

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ (Jr NTR Trivikram)
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ (Jr NTR Trivikram)


ఈ చిత్రంపై అంచనాలు కూడా ఆకాశంలోనే ఉన్నాయి. పైగా రాజమౌళి లాంటి దర్శకుడితో చేసిన తర్వాత ఆ హీరో మళ్లీ వెంటనే హిట్ కొట్టడం అనేది చరిత్రలో లేదు. అందుకే దాన్ని మార్చి చూపించాలని చూస్తున్నాడు త్రివిక్రమ్. తారక్ కోసం అదిరిపోయే కథ సిద్ధం చేస్తున్నాడు ఈయన. ఇప్పుడు ఈ సినిమా గురించి మరో షాకింగ్ అప్‌డేట్ బయటికి వచ్చింది. ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని తెలుస్తుంది. అయితే సినిమా అంతా తారక్ డబుల్ రోల్‌లో కనిపిస్తాడా లేదంటే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందా అనేది మాత్రం సస్పెన్స్.

ఎన్టీఆర్, సమంత (NTR Samantha Akkineni)
ఎన్టీఆర్, సమంత (NTR Samantha Akkineni)


ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారు. అందులో ఒకరు సమంత అని ప్రచారం జరుగుతుంది. మరొరు బాలీవుడ్ నుంచి రానున్నారు. హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అయినను పోయి రావలె హస్తినకు అనే టైటిల్ పరిశీలనలో ఉంది. రాజకీయ నేపథ్యంలో సినిమా రానుందని తెలుస్తుంది. వీలైనంత త్వరగా పూర్తి చేసి 2021 సమ్మర్‌లో ఈ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నాడు మాటల మాంత్రికుడు.
Published by: Praveen Kumar Vadla
First published: May 30, 2020, 9:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading