మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) పై అనేక రకాల అనుమానాలు వస్తున్నాయి. పిల్లా నువ్వు లేని జీవితం అంటూ.. తెలుగు తెరపై ప్రత్యక్షమయ్యాడు సాయి ధరమ్ తేజ్. ఆ తర్వాత తన స్టైల్లో కొన్ని సినిమాలు తీసుకుంటూ ముందుకు వెళ్లాడు. అయితే ప్రతీ రోజూ పండగ సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) కెరియర్ మలుపు తిరిగింది. కరోనా వేవ్‌తో లాక్ డౌన్ వల్ల ఆయన చేయాల్సిన చాలా సినిమాలు ఆగిపోయాయి. ఆ తర్వాత కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చినా కూడా తేజ్‌కు జరిగిన యాక్సిడెంట్ అతడి కెరియర్ని టెన్షన్లో పడేసింది.
2021లో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) బైక్ ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే నెలరోజుల పాటు ఆసుపత్రి బెడ్ కే పరిమితమయ్యారు. సాయి ధరమ్ కోలుకోవడానికి నెలల సమయం పట్టింది. పూర్తిగా రికవరీ అయ్యే వరకు సాయి ధరమ్ మీడియా కంటికి కూడా కనిపించలేదు. కొద్ది నెలల తర్వాత మెగా హీరోలు అందరూ కలిసి సాయి ధరమ్ కి వెల్కమ్ చెప్పారు. కుటుంబ సభ్యులు అందరూ ఆయన చేత కేక్ కట్ చేయించి, లోకానికి పరిచయం చేశారు. తర్వాత కూడా తేజ్ బయట పెద్దగా ఎక్కడా కూడా కనిపించలేదు. షూటింగ్స్ కూడా లేకపోవడంతో ఇంటికే పరిమితం అవుతున్నారు.
అయితే తేజ్ ప్రస్తుతం సుకుమార్(Sukumar) శిష్యుడు దండు కార్తీక్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. హరర్ మూవీగా వస్తున్న ఈ సినిమాకు సుకుమార్ స్వయంగా స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. దీంతో ఈ మూవీపై అంచనాలు కూడా పెరిగాయి. రుద్రవనం అన్న టైటిల్‌తో సినిమా నిర్మాణం జరుపుకుంటుంది. రుద్రవనం అనే ఊరిలో ఊహించని విధంగా హత్యలు, ఆత్మహత్యలు జరుగుతూ ఉంటాయి. ఈ విషయాలపై పరిశోధన చేయడానికి వచ్చిన సీబీఐ ఆఫీసర్‌గా తేజ్ నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కొంతవరకు జరిగింది. అయితే మళ్లీ ఈ సినిమాను రీషూట్ చేస్తున్నారు. దీనికి కారణం తేజ్ నటించిన కొన్ని సీన్స్ సరిగ్గా రాలేదంట. దీంతో అతడు గతంలోలాగా యాక్టివ్‌గా షూటింగ్ సమయంలో ఉండటం లేదని తెలుస్తోంది. అంతేకాదు ఫైట్స్ చేసే సమయంలో కూడా అలసిపోతున్నాడని టాక్ వినిపిస్తోంది.
View this post on Instagram
మరోవైపు సాయి ధరమ్ తేజ్ తాజాగా చిరంజీవి పార్టీలో ప్రత్యక్షమయ్యాడు. విక్రమ్ (Vikram) మూవీ సక్సెస్ నేపథ్యంలో చిరంజీవి(Chiranjeevi) కమల్ హాసన్, దర్శకుడు లోకేష్ కనకరాజ్ కు చిరు ఆయన నివాసంలో పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి సల్మాన్ కూడా రావడం జరిగింది. విక్రమ్ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసిన నితిన్, మెగా హీరోలు వరుణ్ తేజ్ కూడా పాల్గొన్నారు. చిరు ఇంట్లో జరుగుతున్న ప్రముఖుల పార్టీ కావడంతో సాయి ధరమ్ తేజ్ కూడా హాజరయ్యారు.
అయితే ఈ పార్టీకి సంబంధించిన వీడియో చిరంజీవి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. సాయి ధరమ్ లేటెస్ట్ లుక్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఆయన చాలా సన్నగా మారిపోయారు. ఒకప్పటి గ్లామర్ ఆయనలో లేదు. క్యాప్ ధరించి డీగ్లామర్ గా కనిపించాడు. సాయి ధరమ్ లేటెస్ట్ లుక్ హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో ఆయనకు ఏమైంది? తేజ్ పూర్తిగా కోలుకోలేదా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sai Dharam Tej, Sai dharam tej accident, Sai dharam tej health