SHOCKING REVELATION ABOUT PRIYAMANI ALIAS PAIDAMMA IN KARTHIKA DEEPAM SERIAL TODAYS EPISODE NR
Karthika Deepam: మోనిత గురించి చెప్పేసిన ప్రియమణి.. కొత్తగా పైడమ్మ, మలుపు తిరగనున్న వంటలక్క జీవితం?
karthika deepam
Karthika Deepam: కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం మరింత ఆసక్తిగా మారింది. ఇక కథ కూడా కాస్త ముందుకు జరిగింది. ప్రేక్షకులు కూడా ఈ సీరియల్ ను అసలు మిస్ అవ్వట్లేదు. దీప.. మోనిత దగ్గరికి వెళ్లి దుర్గ, అంజి పేర్లు తీయడంతో మోనిత ఫ్యూస్ లు
Karthika Deepam: కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం మరింత ఆసక్తిగా మారింది. ఇక కథ కూడా కాస్త ముందుకు జరిగింది. ప్రేక్షకులు కూడా ఈ సీరియల్ ను అసలు మిస్ అవ్వట్లేదు. దీప.. మోనిత దగ్గరికి వెళ్లి దుర్గ, అంజి పేర్లు తీయడంతో మోనిత ఫ్యూస్ లు ఎగిరిపోయాయి. ఇక ఆనందరావు కోసం ఇంట్లోవాళ్ళు ఎదురుచూస్తుంటారు. ఆనంద్ రావు ఇంటికి రాగానే కాసేపు సరదాగా గడుస్తుంది. ఇక కార్తీక్ నవ్వుల్లో జీవం లేదంటూ, ఎందుకు లోపించిందన్నట్లు ఆనందరావు ప్రశ్నించగా కార్తీక్ ఏదో చెబుతూ మాట మారుస్తాడు. ఇక పోలీస్ స్టేషన్ లో ప్రియమణిని సీసీ కెమెరా రూమ్ లోకి రోషిణి పంపించిన సంగతి తెలిసిందే.మళ్లీ రోషిణి ప్రియమణిని పిలిచి నీ పేరేంటని ప్రశ్నిస్తుంది. ప్రియమణి అని పదే పదే చెప్పటంతో.. మళ్ళీ గట్టిగా అడుగుతుంది రోషిణి. వెంటనే 'పైడమ్మా' అని అసలు పేరు చెబుతుంది. ఇక దానితో కాస్త కామెడీ సీన్ పండుతుంది. సరే పైడీ అంటూ రోషిణి కొన్ని ప్రశ్నలు వేస్తుంది.
నీకు చాలా నిజాలు తెలుసని, బయట పెడితే మోనిత నిన్ను చంపేస్తుంది అని నాకు అర్థం అవుతుందని అనడంతో.. తనకు ఏమి తెలియదని వణుకుతుంది పైడమ్మ. ఇక లోపల మీ అమ్మగారికి ఫోన్ చేద్దామని తీసి మళ్లీ ఎందుకు చేయలేదని ప్రశ్నించడంతో.. ఫోన్ చేయలేదని అబద్ధం చెప్తుంది. సీసీ రికార్డు చూపించేసరికి ప్రియమైన షాక్ అవుతుంది. ఇలాంటివి సినిమా లాగా సెటప్ చేసి ఉంటారనే చేయలేదని సమాధానం ఇస్తుంది.
ఇక కార్తీక్.. మోనిత దగ్గరకు వస్తుంటాడా అని ప్రియమణిని అలియాస్ పైడమ్మని ప్రశ్నిస్తుంది. వస్తాడు అంటూ సమాధానం చెబుతూ.. వచ్చాక ఏం చేస్తారని ప్రశ్నిస్తుంది రోషిణి. వెంటనే ప్రియమణి మాట్లాడుకుంటూ ఉంటారు అని అనడంతో ఆ తర్వాత ఏం చేస్తారు అని రోషిణి అడగటంతో మాట్లాడుకుంటూనే ఉంటారు అని విరక్తి తెచ్చే సమాధానం చెప్పడంతో రోషిణి కి కోపం వస్తూ.. మాట్లాడుకుంటూనే ఉంటే మీ మోనితమ్మ తల్లి ఎలా అయింది అని ప్రశ్నిస్తుంది. ఇక ఇద్దరిలో ఎవరు ఎక్కువ ప్రేమిస్తున్నారన్న విషయం కూడా చెబుతుంది ప్రియమణి.
కార్తీక్ తక్కువగా ప్రేమిస్తాడు అని చెప్పడంతో.. తక్కువ ప్రేమించిన కూడా తప్పు ఎలా జరిగిపోయింది అంటావ్ అని ప్రశ్నిస్తుంది రోషిణి. ఆ ప్రశ్నతో కార్తీకే కారణం అంటూ చెప్పి గతంలో వీళ్ళ పెళ్లి పెళ్లిపీటల దాకా వచ్చి ఆగిపోయిందని చెప్పేసరికి ఆలోచనలో పడుతుంది రోషిణి. ప్రియమణిని అక్కడి నుంచి పంపించి ఆలోచిస్తుంది రోషిణి.
karthika deepam
జరిగిన విషయాన్ని మోనిత చెప్పకూడదని రోషిణి అన్నా కూడా జరిగిందంతా మోనితతో చెప్పేస్తుంది. ఇక మోనిత మళ్లీ ఆలోచనలో పడుతూ ఏదో ఒక ప్లాన్ ను సంపాదించుకుంటుంది. ఆనందరావు రావడంతో అందరూ కూర్చొని భోజనం చేస్తుంటారు. కార్తీక్ భోజనం చేయకుండా కంచంలో గీతలు గీస్తూ ఉండగా ఆనందరావు ప్రశ్నిస్తాడు. పిల్లలు డాడీ ఇంట్లో కూడా గోడల మీద గీస్తున్నాడు అంటూ చెప్పడంతో దీప, కార్తీక్ షాక్ అవుతారు. కానీ ఆ విషయం ఆనందరావుకి అర్థం కాదు.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.