news18-telugu
Updated: November 11, 2019, 7:27 PM IST
Instagram/nidhhiagerwal
సినిమా ఇండస్ట్రీలో అదృష్టం అనే మాట చాలా ఎక్కువగా వినిపిస్తుంది. హిట్ కావాలన్నా, హీరోయిన్లకు మళ్లీ మళ్లీ అవకాశాలు రావాలన్నా కూడా ఈ లక్ అనే పదం బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆ లక్.. నిధి అగర్వాల్‌కు భారీ అదృష్టాన్నే తెచ్చిపెడుతున్నట్టు తెలుస్తోంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ సక్సెస్‌ను అందుకున్న నిధి.. తన తర్వాత సినిమాకు రెమ్యునరేషన్ అమాంతం పెంచేసింది. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు, మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమాలో నిధి అగర్వాల్‌నే హీరోయిన్గా తీసుకున్నారు. ఈ సినిమాకు నిధి పెద్ద ఎత్తున రెమ్యునరేషన్ అందుకున్నట్టు సమాచారం. సుమారు రూ.కోటి వరకు వసూలు చేసినట్టు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని భావిస్తున్న ఈ భామ.. క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనుకుంటున్నట్టుంది. రాబోయే రోజుల్లో తను నటించే సినిమాకు రెమ్యునరేషన్ మరింత పెంచే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
November 11, 2019, 7:20 PM IST