SHOCKING NEWS KANGANA RANAUT TO GET HUGE REMUNERATION FOR JAYALALITHAA BIOPIC THALAIVI TA
జయలలిత బయోపిక్ కోసం కంగనా షాకింగ్ పారితోషకం..
జయ లలిత, కంగనా రనౌత్
ఓ సినీ తారగా, ఓ పార్టీ అధినేత్రిగా, ఓ ముఖ్యమంత్రిగా, ఓ ఐరన్ లేడీగా... జయలలిత చరిత్రను ఎంత చెప్పుకున్నా తక్కువే కదా.తాజాగా ఈ సినిమా కోసం కంగనాకు కళ్లు తిరిగే పారితోషం ఇస్తున్నారట.
ఓ సినీ తారగా, ఓ పార్టీ అధినేత్రిగా, ఓ ముఖ్యమంత్రిగా, ఓ ఐరన్ లేడీగా... జయలలిత చరిత్రను ఎంత చెప్పుకున్నా తక్కువే కదా. ఆమె జీవితంలో రక్తికట్టించే మలుపులకు, అనూహ్య సంఘటనలకు లెక్కలేదు. అందుకే దర్శక నిర్మాతలకు ఇప్పుడామె పెద్ద అసెట్ అవుతున్నారు. మరెవరూ లేనట్లు పురచ్చితలైవి జీవితాన్నే కథాంశంగా ఎంచుకుని మూడు బయోపిక్‌లు రెడీ అవుతున్నాయి. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో 140 పైగా సినిమాల్లో కథానాయికగా విభిన్న పాత్రలు పోషించారు జయలలిత. తాజాగా కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో విజయ్ దర్శకత్వంలో జయలలిత బయోపిక్ తెరకెక్కుతోంది. ఈ సినిమాను ‘తలైవి’ అనే పేరు ఖరారు చేశారు. అంతేకాదు దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ‘మణికర్ణిక’ వంటి హిస్టారికల్ మూవీ తర్వాత రనౌత్ నటిస్తోన్న బయోపిక్ ఇదే. ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ సహకారం అందిస్తున్నారు. ఈ సినిమాను విబ్రీ మీడియా పతాకంపై విష్ణు వర్థన్ ఇందూరి నిర్మిస్తున్నారు.
తలైవి ఫస్ట్ లుక్
తమిళ, హిందీ, తెలుగు భాషల్లో ఈ సినిమా రూపుదిద్దుకోబోతోంది. తమిళంలో ‘తలైవి’గా, హిందీలో ‘జయ’గా సినిమా విడుదల కాబోతోంది.జయలలిత బయోపిక్కు సంబంధించిన పలు ఆసక్తికరమైన అంశాలపై మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ చిత్రంలో జయలలిత పాత్రను పోషించేందుకు కంగనా రనౌత్ తమిళ్ నేర్చుకోబోతుంది. ఈ సినిమా కోసం తమిళ ట్యూటర్‌ను కూడా పెట్టుకున్నట్టు సమాచారం.
జయలలిత బయోపిక్
ఈ సినిమా షూటింగ్‌ను సెప్టెంబరు నుంచి ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది. అప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అవుతుంది. మూడో భాషల్లో తెరకెక్కుతోన్న ఈ బయోపిక్ కోసం కంగనా రూ.24 కోట్లు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది.
కంగనా రనౌత్
ఇప్పటి వరకు మన దేశంలో ఒక సినిమాకు ఇంత భారీ మొత్తంలో పారితోషకం అందుకోబోతున్న నటిగా కంగనా రికార్డులకు ఎక్కబోతుంది. దక్షిణాదిలో సన్ని లియోన్ ‘వీర మహాదేవి’ తర్వాత ఒక బాలీవుడ్ హీరోయిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కించనున్నసినిమా ఇదే కావడం విశేషం.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.