వంటలక్కకు కరోనా...? శనివారం ఎపిసోడ్ మాయం...ఆందోళనలో ఫ్యాన్స్...

వంటలక్కకు కరోనా కారణంగా ఈ సీరియల్ షూటింగ్ కు కొన్ని వారాల పాటు దూరం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే ఇంటింటి గృహ లక్ష్మి సీరియల్ లోని ఆర్టిస్టులకు కూడా కరోనా సోకడంతో ఆ సీరియల్ కూడా కొన్ని ఎపిసోడ్ల పాటు ఆపేశారు.

news18-telugu
Updated: July 11, 2020, 8:02 PM IST
వంటలక్కకు కరోనా...? శనివారం ఎపిసోడ్ మాయం...ఆందోళనలో ఫ్యాన్స్...
కార్తీక దీపం వంటలక్క ప్రేమి విశ్వనాథ్ (Hot Star/Photo)
  • Share this:
కరోనా అనంతరం ప్రసారం ప్రారంభమైన కార్తీక దీపం సీరియల్. మరోసారి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోన్న సీరియల్ గా పేరు తెచ్చుకుంది. అయితే ఇంతలోనే షాక్ లాంటి వార్త వంటలక్క ఫ్యాన్స్ ను కలవరానికి గురిచేస్తోంది. వంటలక్క దీప అలియాస్ ప్రేమి విశ్వనాథ్ కు కరోనా సోకిందని, ఆమె క్వారంటైన్ లోకి వెళ్లిపోయారనే వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తలకు బలం చేకూర్చేలా శనివారం రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ప్రసారం కావాల్సిన కార్తీక దీపం సీరియల్ నిలిపివేశారు. దీంతో వంటలక్కకు కరోనా సోకిందనే వార్త వైరల్ గామారింది. మరోవైపు ట్విట్టర్ లో వంటలక్కకు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలంటూ ఆమె ఫ్యాన్స్ ట్రెండింగ్ చేస్తున్నారు. వంటలక్కగా ప్రేమి విశ్వనాథ్ తన నటనతో, అభినయంతో కట్టపడేసింది. కార్తీకదీపం అంటేనే వంటలక్క సీరియల్ గా ప్రేమి విశ్వనాథ్ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.

అయితే కరోనా కారణంగా ఆమె ఈ సీరియల్ షూటింగ్ కు కొన్ని వారాల పాటు దూరం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే ఇంటింటి గృహ లక్ష్మి సీరియల్ లోని ఆర్టిస్టులకు కూడా కరోనా సోకడంతో ఆ సీరియల్ కూడా కొన్ని ఎపిసోడ్ల పాటు ఆపేశారు. అయితే ఈ వార్తల్లో ఎంత నిజం ఉందనేది త్వరలో తేలాల్సి ఉంది. అయితే మరోవైపు వంటలక్క తాజాగా ఓ ఆసక్తికర వీడియోను షేర్ చేసింది . తాను కార్తీకదీపం టీంకు బైబై చెపుతున్నాడు. కేరళకు వెళుతున్నట్టుగా వీడియో పోస్ట్ చేసింది. దీంతో ఆమె షూటింగ్ షెడ్యూల్ పూర్తి అయ్యిందని, అందుకే తిరిగి తన స్వస్థలం కేరళకు వెళ్లినట్లు కొందరు చెబుతున్నారు. అయితే షూటింగ్ షెడ్యూల్ పూర్తి అయితే ప్రసారం ఎందుకు నిలిపివేస్తారని మరికొందరు నెటిజన్లు వాదిస్తున్నారు. ఏ సంగతి త్వరలోనే తెలియాల్సి ఉంది.
Published by: Krishna Adithya
First published: July 11, 2020, 8:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading