• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • SHOCKING FACTS REVEALED ABOUT MAHESH BABU TRIVIKRAM MOVIE AND SOURCES SAYS THEY DOING ATHADU SEQUEL PK

Mahesh Babu - Trivikram: షాకింగ్.. మహేష్ బాబు, త్రివిక్రమ్ ‘అతడు’ సీక్వెల్ చేస్తున్నారా.. టైటిల్ కూడా అదే..!

Mahesh Babu - Trivikram: షాకింగ్.. మహేష్ బాబు, త్రివిక్రమ్ ‘అతడు’ సీక్వెల్ చేస్తున్నారా.. టైటిల్ కూడా అదే..!

మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ (Mahesh Babu Trivikram)

Mahesh Babu - Trivikram: కొన్ని కాంబినేషన్స్‌కు ఇండస్ట్రీలో సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అలాంటి కాంబినేషన్ త్రివిక్రమ్, మహేష్ బాబు(Mahesh Babu Trivikram). ఈ జోడీ ఇప్పుడు మూడో సినిమా చేయబోతున్నారు. అయితే దీనిపై షాకింగ్ న్యూస్ బయటికి వస్తుంది. అతడు సినిమాకు సీక్వెల్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

  • Share this:
కొన్ని కాంబినేషన్స్‌కు ఇండస్ట్రీలో సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అలాంటి కాంబినేషన్ త్రివిక్రమ్, మహేష్ బాబు. ఈ జంట కలిసి సినిమా చేస్తే చూడాలని చాలా కాలంగా అభిమానులు వేచి చూస్తున్నారు. 2005లో అతడు, 2010లో ఖలేజా లాంటి సినిమాలు చేసిన తర్వాత ఈ కాంబినేషన్‌లో మూడో సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు ఫ్యాన్స్. ఇలాంటి సమయంలో వాళ్ల ఆశలు నెరవేరుస్తూ మూడో సినిమాను ప్రకటించారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో మహేష్, త్రివిక్రమ్ సినిమా వస్తుంది. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ కూడా మొదలు కానుంది. సమ్మర్ 2022 టార్గెట్ పెట్టుకుని వచ్చేస్తున్నారు ఈ జోడీ. ఇదిలా ఉంటే ఖలేజా సినిమా తర్వాత మహేష్, త్రివిక్రమ్ మధ్య ఏదో విషయంలో గొడవ జరిగింది. అంతేకాదు.. ఇద్దరి మధ్య మనస్పర్థల కారణంగా కొన్నేళ్లుగా కనీసం కలవలేదనే వార్తలు కూడా ఇండస్ట్రీలో ఉన్నాయి. ఇక ఎప్పటికీ కలిసి పని చేయకూడదని ఒకరినొకరు నిర్ణయించుకున్నారని.. సోషల్ మీడియాలోనూ వార్తలొచ్చాయి. అన్నట్లుగానే పదేళ్లకు పైగానే అయింది కదా ఈ ఇద్దరి మధ్య సినిమాలు వచ్చి.

ఇక చేయరేమో అనుకుంటున్న సమయంలో ఇన్నాళ్లకు మళ్లీ సినిమా అనౌన్స్ చేసారు. అయితే మహేష్, త్రివిక్రమ్ కలిసి పని చేయడం వెనక ఓ రాయబారి ఉన్నారు. ఆమె లేకపోతే ఈ కాంబినేషన్ కలిసేది కాదు. ఆమెవరో ఈ పాటికే అర్థమైపోయుంటుంది. మీ ఊహ నిజమే.. మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్. ఈమె లేకపోతే ఈ రోజు త్రివిక్రమ్, మహేష్ బాబు కలిసి పని చేసేవాళ్లు కాదేమో..?

mahesh babu,mahesh babu twitter,mahesh babu instagram,mahesh babu trivikram movie athadu sequel,mahesh babu trivikram movie title parthu,mahesh babu trivikram movie,mahesh babu trivikram movie namrata shirodkar,telugu cinema,మహేష్ బాబు,త్రివిక్రమ్,మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా అతడు సీక్వెల్,మహేష్ త్రివిక్రమ్ టైటిల్ పార్థు
మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ (Mahesh Babu Trivikram)


ఇద్దరి మధ్య మనస్పర్థల కారణంగా దూరం అయిపోతున్న తరుణంలో చాలా తెలివిగా మహేష్ బాబును త్రివిక్రమ్‌తో కలిసి పని చేసేలా చేసారు. ఈ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగేలా యాడ్స్ చేయించారు నమ్రత. ఈ పదేళ్లలో మహేష్, త్రివిక్రమ్ కలిసి సినిమాలు చేయకపోయినా కూడా యాడ్స్ చేసారు. దాంతో మనస్పర్థలు కాస్తా తొలగిపోయాయి. ఆ స్నేహంతోనే ఇప్పుడు మళ్లీ కలిసి పని చేస్తున్నారని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. ఈ విషయం పక్కనబెడితే ఇప్పుడు త్రివిక్రమ్, మహేష్ చేయబోయేది అతడు సీక్వెల్ అనే ప్రచారం జరుగుతుంది.

mahesh babu,mahesh babu twitter,mahesh babu instagram,mahesh babu trivikram movie athadu sequel,mahesh babu trivikram movie title parthu,mahesh babu trivikram movie,mahesh babu trivikram movie namrata shirodkar,telugu cinema,మహేష్ బాబు,త్రివిక్రమ్,మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా అతడు సీక్వెల్,మహేష్ త్రివిక్రమ్ టైటిల్ పార్థు
మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ అతడు (Mahesh Babu Trivikram)


2005లో వచ్చిన ఈ చిత్రం కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకు కొనసాగింపు చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. కథ కూడా దాదాపు అలాగే ఉంటుందని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాకు టైటిల్ కూడా ‘పార్థు’ అని పెడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. అతడులో మహేష్ పేరు అదే. నందు అనే పాత్ర కూడా చేసినా ఎక్కువగా పార్థు పాత్రలోనే కనిపిస్తాడు మహేష్. ఒకవేళ అన్నీ కుదిరి అతడు సీక్వెల్ అయితే మాత్రం అంచనాలు మామూలుగా ఉండవు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published: