కేసీఆర్ బయోపిక్‌కు థియేటర్లు లేవా.. ‘ఉద్యమ సింహం’కు ఏంటి పరిస్థితి..?

తెలుగు ఇండ‌స్ట్రీలో ఇప్పుడు బ‌యోపిక్స్ ట్రెండ్ న‌డుస్తుంది. ఇప్ప‌టికే సావిత్రి, ఎన్టీఆర్, వైఎస్ఆర్ లాంటి బ‌యోపిక్స్ విడుద‌ల‌య్యాయి. ఇప్పుడు కేసీఆర్ బ‌యోపిక్ కూడా వ‌చ్చింది. అదే ఉద్యమ సింహం. ఇలాంటి ఓ సినిమా వ‌చ్చిన‌ట్లు కూడా చాలా మందికి తెలియ‌దు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 5, 2019, 8:16 PM IST
కేసీఆర్ బయోపిక్‌కు థియేటర్లు లేవా.. ‘ఉద్యమ సింహం’కు ఏంటి పరిస్థితి..?
కేసీఆర్ బయోపిక్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 5, 2019, 8:16 PM IST
తెలుగు ఇండ‌స్ట్రీలో ఇప్పుడు బ‌యోపిక్స్ ట్రెండ్ న‌డుస్తుంది. ఇప్ప‌టికే సావిత్రి, ఎన్టీఆర్, వైఎస్ఆర్ లాంటి బ‌యోపిక్స్ విడుద‌ల‌య్యాయి. ఇప్పుడు కేసీఆర్ బ‌యోపిక్ కూడా వ‌చ్చింది. అదే ఉద్యమ సింహం. ఇలాంటి ఓ సినిమా వ‌చ్చిన‌ట్లు కూడా చాలా మందికి తెలియ‌దు. సినిమాను మార్చ్ 29న విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేసుకున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. అందుకే పోస్ట‌ర్స్ కూడా విడుద‌ల చేసారు. ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేసారు. కానీ తీరా విడుద‌ల చేయాల్సిన స‌మ‌యంలో ఇది బ‌య‌టికి రాలేదు. కార‌ణాలు తెలియ‌దు కానీ ఇప్పుడు ఈ చిత్రం యూ ట్యూబ్లో విడుద‌లైంది.

Shocking.. No theatres for KCR biopic.. Udyama Simham movie released directly in Youtube pk.. తెలుగు ఇండ‌స్ట్రీలో ఇప్పుడు బ‌యోపిక్స్ ట్రెండ్ న‌డుస్తుంది. ఇప్ప‌టికే సావిత్రి, ఎన్టీఆర్, వైఎస్ఆర్ లాంటి బ‌యోపిక్స్ విడుద‌ల‌య్యాయి. ఇప్పుడు కేసీఆర్ బ‌యోపిక్ కూడా వ‌చ్చింది. అదే ఉద్యమ సింహం. ఇలాంటి ఓ సినిమా వ‌చ్చిన‌ట్లు కూడా చాలా మందికి తెలియ‌దు. kcr biopic,kcr udyama simham,udyama simham full movie online,udyama simham youtube,udyama simham movie online watch,udyama simham kcr biopic,no theatres for kcr biopic,udyama simham released in youtube,udyama simham movie review,telugu cinema,telangana cm kcr,తెలంగాణ సిఎం కేసీఆర్,ఉద్యమ సింహం సినిమా,యూ ట్యూబ్‌లో విడుదలైన ఉద్యమ సింహం,కేసీఆర్ బయోపిక్ ఉద్యమ సింహం,తెలుగు సినిమా,కేసీఆర్ బయోపిక్‌కు థియేటర్స్ కరువు
కేసీఆర్ బయోపిక్

దాంతో తెలంగాణ‌లో కేసీఆర్ అభిమానులతో పాటు సాధార‌ణ ప్రేక్ష‌కులు కూడా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. రాజు త‌లుచుకుంటే దెబ్బ‌ల‌కు కొద‌వా.. కేసీఆర్ త‌లుచుకుంటే థియేట‌ర్ల‌కు క‌రువా అన్న‌ట్లు.. ఇప్పుడు ఈ చిత్రాన్ని నేరుగా యూ ట్యూబ్లో విడుద‌ల చేయ‌డం ఏంటో అని అంతా షాక్ అవుతున్నారు. ఈ సినిమా విడుద‌ల కాకుండా కొందరు సినిమా అవాంత‌రాలు సృష్టించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో సినిమా విడుద‌ల చేస్తే అది ఓట‌ర్ల‌పై ప్ర‌భావం చూపిస్తుంద‌ని వారించారు.

Shocking.. No theatres for KCR biopic.. Udyama Simham movie released directly in Youtube pk.. తెలుగు ఇండ‌స్ట్రీలో ఇప్పుడు బ‌యోపిక్స్ ట్రెండ్ న‌డుస్తుంది. ఇప్ప‌టికే సావిత్రి, ఎన్టీఆర్, వైఎస్ఆర్ లాంటి బ‌యోపిక్స్ విడుద‌ల‌య్యాయి. ఇప్పుడు కేసీఆర్ బ‌యోపిక్ కూడా వ‌చ్చింది. అదే ఉద్యమ సింహం. ఇలాంటి ఓ సినిమా వ‌చ్చిన‌ట్లు కూడా చాలా మందికి తెలియ‌దు. kcr biopic,kcr udyama simham,udyama simham full movie online,udyama simham youtube,udyama simham movie online watch,udyama simham kcr biopic,no theatres for kcr biopic,udyama simham released in youtube,udyama simham movie review,telugu cinema,telangana cm kcr,తెలంగాణ సిఎం కేసీఆర్,ఉద్యమ సింహం సినిమా,యూ ట్యూబ్‌లో విడుదలైన ఉద్యమ సింహం,కేసీఆర్ బయోపిక్ ఉద్యమ సింహం,తెలుగు సినిమా,కేసీఆర్ బయోపిక్‌కు థియేటర్స్ కరువు
కేసీఆర్ బయోపిక్
అంతే కాకుండా సినిమా కొంటే తిప్ప‌లు త‌ప్ప‌వంటూ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిట‌ర్ల‌ను కూడా బెదిరించేస‌రికి వాళ్లు కూడా వెన‌క‌డుగు వేసారు. దాంతో కేసీఆర్ సాక్షాత్తు బయోపిక్‌కు సైతం థియేట‌ర్లు దొర‌క‌లేదు. ఇది న‌మ్మ‌డానికి కాస్త క‌ష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఈ సినిమాకు థియేట‌ర్లు లేక‌పోవ‌డంతో నిర్మాత కల్వకుంట్ల నాగేశ్వర రావు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. థియేట‌ర్ల‌తో ప‌ని లేకుండా నేరుగా సినిమాను యూట్యూబ్‍‌లో విడుద‌ల చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. అంతేకాదు.. త‌మ సినిమాను ఛానెల్స్ వాళ్లు కూడా ఫ్రీగా ప్ర‌సారం చేసుకోవ‌చ్చ‌ని బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు చిత్ర‌యూనిట్.

ఎలాంటి కాపీ రైట్స్ లేకుండా మా సినిమాను ఎవ‌రైనా అప్ లోడ్ చేసుకోవ‌చ్చని చెప్పాడు నిర్మాత‌. కేసీఆర్ లాంటి గొప్ప నాయ‌కుడి జీవితం ఆధారంగా తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని తెలంగాణ‌లో ప్రతి ఒక్క ప్రేక్ష‌కుడు చూడాల‌న్న స‌దుద్దేశ్యంతోనే ఈ చిత్రాన్ని ఇలా విడుద‌ల చేస్తున్న‌ట్లు చెప్పాడు ఈయ‌న‌. అయితే తెలంగాణ‌లో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నా.. త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్ సినిమాటోగ్ర‌ఫీ మంత్రిగా ఉన్నా కూడా ఈ విష‌యంలో ఏం చేయ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌మే. ఏదేమైనా ఉద్య‌మ సింహం సినిమా యూ ట్యూబ్లో విడుద‌లై ఇప్పుడు సంచ‌ల‌నాలు సృష్టిస్తుంది. కేసీఆర్ అభిమానుల‌తో పాటు మిగిలిన వాళ్లు కూడా ఈ చిత్రాన్ని చూస్తున్నారు.

First published: April 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...