సినీ పరిశ్రమ అంటేనే.. గ్లామర్‌తో నిండిపోతుంది. అందం.. అభినయం ఉన్నవాళ్లకే ఇక్కడ అవకాశం.అవి లేకుంటే మనుగడ కష్టమే. అందుకే.. హీరోలు అయినా.. హీరోయిన్లు అయినా.. తాము అందంగా కనిపించడానికి నానా కష్టాలు పడుతుంటారు. వర్క్ అవుట్లు, డైటింగ్లు చేస్తూనే ఉంటారు. కడుపు నిండా తినలేరు... కంటి నిండా నిద్రపోలేరు. అయితే హీరోయిన్లు పడే కష్టం అంతా ఇంతా కాదు. డైటింగ్, వర్క్ అవుట్స్ తో పాటు సర్జరీలు చేయించుకొని మరీ అందాన్ని పెంచుకోవాలనుకుంటారు. అలా చేసిన వాళ్లు కూడా లేకపోలేదు. చాలామంది హీరోయిన్లు.. పెదాలకు, ముక్కుకు, మూతికి ఇలా అనేక రకాల కాస్మోటిక్ సర్జరీలు చేయించుకున్నారు.
అయితే ఇలాంటి సర్జరీలు చేయించుకొని ప్రాణాలు తీసుకున్న వారు కూడా లేకపోలేదు. ఇటీవలే ఒక నటి సర్జరీ వికటించడంతో మృతిచెందిన విషయం విదితమే.. తాజగా మరో నటికి సర్జరీ వికటించి ముఖం మొత్తం మారిపోయింది. ముఖం అంతా వాచిపోయి గుర్తుపట్టలేని స్థితికి మారిపోయింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. స్వాతి సతీష్ కన్నడలో హీరోయిన్ గా పలు చిత్రాల్లో కనిపించింది.
అయితే కెరీర్ కోసం ఆమె తన అందాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో రూట్ కెనాల్ థెరపీ చేయించుకొంది. అయితే ఆ సర్జరీ కాస్తా వికటిచడంతో ఆమె ముఖం అంతా వాచిపోయింది. ఆ ముఖం వాపు రెండు మూడు రోజుల్లో నయమవుతుందని వైద్యులు తెలిపారు. మూడు వారాలు అయినా ముఖం వాపు తగ్గలేదు. దీంతో ఆమె వాపుతో పాటు తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చింది. ఇక ఆమె ముఖం ఉబ్బిన కారణంగా దాదాపుగా ఆమెను ఎవరు గుర్తించలేని పరిస్థితి. ఆ ముఖంతో తన ఇంటి నుండి బయటకు వెళ్లడం కష్టంగా ఉందని, తనకు వచ్చిన అవకాశాలు కూడా వెనక్కి వెళ్లిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తోంది.
అయితే ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఆమెకు సర్జరీలో భాగంగా అనస్థీషియాకు బదులుగా సాలిసిలిక్ యాసిడ్ ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్వాతి చికిత్స నిమిత్తం మరో ఆస్పత్రికి వెళ్లడంతో ఆమెకు ఈ విషయం తెలిసింది. ఈ విషయం తెలియడంతో ఆమె కోలుకున్నాక సదురు హాస్పిటల్ పై మరియు డాక్టర్ పై కేసు వేస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తం మీద లేనిపోని సర్జరీలు చేయించుకుంటే చిక్కులు తప్పవని.. మరోసారి రుజువు అయ్యింది.
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.