బాలీవుడ్‌లో మారుమోగుతున్న శోభన్ బాబు సూపర్ హిట్ సాంగ్..

శోభన్‌బాబు (ఫేస్‌బుక్ ఫోటో)

అవును బాలీవుడ్‌లో శోభన్ బాబు పాత సూపర్ హిట్ పాట మారు మోగుతోంది. తాజాగా అదే సినిమాలో శోభన్ బాబు, శ్రీదేవిలపై పిక్చరైజ్ చేసిన కుడికన్ను కొట్టగానే సాంగ్‌ను హిందీలో రీమిక్స్ చేసారు.

 • Share this:
  అవును బాలీవుడ్‌లో శోభన్ బాబు పాత సూపర్ హిట్ పాట మారు మోగుతోంది. రీసెంట్‌గా శోభన్ బాబు, శ్రీదేవి  హీరోగా నటించిన దేవత సినిమాలోని ‘వెల్లువొచ్చే గోదారమ్మ’ పాటను హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గద్దలకొండ గణేష్’లో వరుణ్ తేజ్, పూజా హెగ్డేలపై రీమిక్స్ చేస్తే సూపర్ హిట్టైయింది. తాజాగా అదే సినిమాలో శోభన్ బాబు, శ్రీదేవిలపై పిక్చరైజ్ చేసిన కుడికన్ను కొట్టగానే సాంగ్‌ను హిందీలో రీమిక్స్ చేసారు. అది కూడా టైగర్ ష్రాఫ్, శ్రద్ధా కపూర్‌లపై చిత్రీకరించారు. ఇపుడు పాట బాలీవుడ్‌లో హంగామా చేస్తోంది. శోభన్ బాబు హీరోగా నటించిన ‘దేవత’ చిత్రాన్ని హిందీలో జితేంద్ర, జయప్రద, శ్రీదేవి హీరో, హీరోయిన్లుగా ‘తోఫా’ పేరుతో రాఘవేంద్రరావు రీమేక్ చేసాడు. అందులో కుడికన్ను కొట్టగానే పాటను హిందీలో ‘ఏక్ ఆంఖ్ మారో’ పాటగా చిత్రీకరించారు.  ఇపుడు అదే పాటను సాజిద్ నడియావాలా నిర్మాణంలో అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో టైగర్ ష్రాఫ్, శ్రద్ధ కపూర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కించిన ‘బాఘీ 3’లో రీమిక్స్ చేసారు. ఇపుడీ పాట బాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోంది.  మొత్తానికి శోభన్ బాబు మేనియా తెలుగు వాళ్లనే ఇపుడు హిందీ వాళ్లను కూడా మాయ చేస్తుందనే చెప్పాలి.

  Published by:Kiran Kumar Thanjavur
  First published: