Shivathmika Rajashekar : రాజశేఖర్ ఆరోగ్యంపై శివాత్మిక ట్వీట్.. కొంత కష్టంగా ఉంది..

Rajashekar : నటుడు రాజశేఖర్‌తో పాటు ఆయన భార్యాపిల్లలు ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.

news18-telugu
Updated: October 22, 2020, 10:12 AM IST
Shivathmika Rajashekar : రాజశేఖర్ ఆరోగ్యంపై శివాత్మిక ట్వీట్.. కొంత కష్టంగా ఉంది..
రాజశేఖర్ ఫ్యామిలీ Photo : Twitter
  • Share this:
Shivathmika Rajashekar : శివాత్మిక రాజశేఖర్.. ఆ మధ్య విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన దొరసాని సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తొలి సినిమా అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయినా.. నటిగా మాత్రం ఈ భామకు మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా శివాత్మిక ఎక్స్‌ప్రెషన్స్ చాలా బాగున్నాయంటూ విమర్శకుల ప్రశంసలు కూడా వచ్చాయి. అది అలా ఉంటే శివాత్మిక తండ్రి నటుడు రాజశేఖర్‌ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. రాజశేఖర్‌తో పాటు ఆయన భార్యాపిల్లలు కరోనా బారిన పడ్డారు. అయితే ప్రస్తుతం తాము కరోనాకు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నామని, ఇప్పటికే కరోనా నుంచి తమ ఇద్దరు కూతుళ్లు బయటపడ్డారని రాజశేఖర్ ఇటీవల తెలపగా.. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై రాజశేఖర్ కూతురు శివాత్మిక ఓ ట్వీట్ చేసింది. ఆమె తన ట్వీట్‌లో రాస్తూ ‘కరోనాను ఎదుర్కోనడానికి నాన్న గట్టిగానే పోరాటం చేస్తున్నారు. అయితే పరిస్థితి కొంత క్లిష్టంగా ఉంది.. అయినప్పటికీ ఆయన బాగానే పోరాడుతున్నారు. ఈ సమయంలో మీ ప్రార్థనలు, మీ ప్రేమే ఆయన్ని కాపాడుతాయి. నాన్న త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఆయన పూర్తిగా కోలుకుని తిరిగి వస్తారు.. అంటూ ఆమె ట్వీట్ చేసింది.




ఆ తర్వాత మరో ట్వీట్‌లో శివాత్మిక తండ్రి ఆరోగ్యంపై మరింత స్పష్టతనిస్తూ.. తన తండ్రి ఆరోగ్యంగానే ఉన్నాడని తెలిపింది. ‘మీ ప్రేమ ప్రార్థనల పట్ల కేవలం కృతజ్ఞతలు చెబితే సరిపోదు. అయితే.. ఇక్కడ విషయం ఏమంటే.. ఆయన పరిస్థితి విషమంగా లేదు. ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది.. అంతేకాదు కోలుకుంటున్నారు కూడా. ఈ సమయంలో మీ ప్రార్థనలు కావాలి. మీకు మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అయితే నాన్న ఆరోగ్యం బాగానే ఉంది భయపడకండి. ఆరోగ్య పరిస్థితిపై అసత్యవార్తలను ప్రచారం చేయకండి.. అంటూ పేర్కోంది. ఇక శివాత్మిక సినిమాల విషయానికి వస్తే.. ఆమె ప్రస్తుతం కృష్ణ వంశీ దర్శకత్వంలో వస్తున్న రంగ మార్తండలో నటిస్తోంది. ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. కరోనా కారణంగా రంగ మార్తండ ఓటీటీలో విడుదలకానుందని సమాచారం.
Published by: Suresh Rachamalla
First published: October 22, 2020, 10:12 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading