Home /News /movies /

SHIVANI RAJASHEKAR WWW MOVIE TO STREAM ON SONY LIV ON DECEMBER 24 HERE ARE THE DETAILS SR

WWW Movie : సోనిలివ్‌లో శివానీ రాజశేఖర్ డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు.. డిసెంబర్ 24న స్ట్రీమింగ్..

WWW Movie Photo : Twitter

WWW Movie Photo : Twitter

WWW Movie : 'డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు' (ఎవ‌రు, ఎక్క‌డ‌, ఎందుకు), ఫస్ట్‌ టైమ్ కంప్యూటర్‌ స్క్రీన్ బేస్డ్ మూవీగా రూపొందిన ఈ చిత్రంలో అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్‌ హీరో హీరోయిన్లుగా నటించారు. `

  'డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు' (ఎవ‌రు, ఎక్క‌డ‌, ఎందుకు), ఫస్ట్‌ టైమ్ కంప్యూటర్‌ స్క్రీన్ బేస్డ్ మూవీగా రూపొందిన ఈ చిత్రంలో అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్‌  (Shivani Rajashekar )హీరో హీరోయిన్లుగా నటించారు.  సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ‌ సినిమాటోగ్రాఫ‌ర్ కేవి గుహన్ ద‌ర్శ‌కత్వంలో రామంత్ర క్రియేష‌న్స్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా డా. రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మించారు. `సోనిలివ్`లో ఈ చిత్రం డిసెంబర్ 24న రాబోతోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎంపీ రఘురామకృష్ణ రాజు, హీరో రాజ‌శేఖ‌ర్‌, జీవిత ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు. ఎంపీ రఘురామకృష్ణ రాజు మాట్లాడుతూ.. ‘ఈ సినిమా నిర్మాత రవి గారు ఓ ఇంజనీర్. కానీ ఆయనకు సినిమా పట్ల, సాహిత్యం పట్ల ఎంతో ప్రేమ ఉంది. నాక్కూడా సినిమాలు, సాహిత్యం అంటే ఇష్టం. కానీ నేను సినిమాలు తీయలేకపోయాను. ఆయన తీశారు. బ్యాన‌ర్‌లోగో అద్బుతంగా ఉంది. సినిమా కూడా అలానే ఉండబోతోంది. శివానీ రాజశేఖర్ గారు అద్బుతం సినిమాలో ఎంతో బాగా నటించారని అన్నారు.

  హీరో రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘గుహన్ గారు వండర్ ఫుల్ టెక్నీషియన్. ఆయనతో శివానీ సినిమా చేస్తుందని తెలియడంతో ఆనందమేసింది. సినిమా ఫాస్ట్‌గా వస్తుందని చెప్పారు. ఇప్పుడు కరెక్ట్ సమయానికి వస్తోంది. నేను ఇంకా సినిమా చూడలేదు. త్వరలోనే చూస్తాను. గుహన్ గారితో పని చేయాలని అనుకుంటున్నాను. ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో అదిత్‌కు తెలుస్తుంది. గరుడ వేగలో మా పరిచయం జరిగింది. ఏజ్ డిఫరెన్స్ లేకుండా ఫ్రెండ్స్‌లా తిరిగాం. ఆయన మా ఫ్యామిలీ మెంబర్. చాలా కష్టపడి ఈ సినిమాను చేశాడు. www అంటే నాకు జీవితంలో కొన్ని గుర్తుకువస్తాయి. కోవిడ్‌ను చూసి నేను భయపడలేదు. ఈ టీం నుంచే శివానికి కరోనా వచ్చింది. అక్కడి నుంచి నాకు వచ్చింది. నా వల్ల డాడీకి వచ్చిందని శివానీ బాగా ఏడ్చేసింది. ఈ జీవితాన్ని నేను ఎప్పుడూ మరిచిపోను. ఈ చిత్రం మా జీవితంలో ముఖ్య పాత్రను పోషిస్తుంది. మరిచిపోలేని ఈ సినిమా డిసెంబర్ 24న వస్తోంది. అద్భుతం సినిమాకు ఎంత మంచి పేరు వచ్చిందో.. ఈసినిమాకు కూడా అంత మంచి పేరు వస్తుందని అంటున్నారు. నాకు ఎంతో గర్వంగా ఉంది. నా పేరు నిలబెట్టిందని అందరూ అంటుంటే సంతోషంగా ఉందన్నారు.


  జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘చిన్నప్పుడు మా పిల్లలు ఎప్పుడూ షూటింగ్‌లకు వచ్చేవారు. రాజశేఖర్ గారు అవుట్ డోర్‌కు వెళ్తే తీసుకెళ్లేవారు. అప్పుడు కెమెరా వెనక ఉండేవారు. ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చారు. ఊహ వచ్చాక సినిమాల్లోకి వస్తామని మాతో నేరుగా చెప్పేశారు. సినిమాల్లో సక్సెస్ కాకపోతే డిప్రెషన్‌లోకి వెళ్లొద్దు.. వేరే కెరీర్ ఎంచుకోవాలని అన్నాం. శివానీ నటించిన అద్భుతం సినిమా మంచి విజయం సాధించింది. నైలు నది అనే పాట నాకు చాలా ఇష్టం. ఒక సినిమా ఒక హీరో లేదా ఇద్దరు హీరోలుంటారు. కానీ ఈ సినిమాకు నలుగురు హీరోలు. అదిత్, గుహన్, సైమన్, నిర్మాత గారు. ముందుగా నిర్మాత గురించి మాట్లాడాలి. ఒక్క మాట, ఒక్క షాట్ కూడా అసభ్యంగా, అశ్లీలంగా ఉండొద్దని అన్నారు. ఎన్నో కష్టాలు పడి ఈ సినిమాను నిర్మించారన్నారు.


  చిత్ర ద‌ర్శ‌కుడు గుహన్ (Guhan) మాట్లాడుతూ.. ‘జీవిత, రాజశేఖర్ గారు నన్ను ఫ్యామిలీ మెంబర్‌లా చూసుకున్నారు. పూర్తిగా వెబ్ క్యామ్‌లో సినిమా తీశాం. కరోనా, లాక్డౌన్ సమయంలో తీశాం. బతుకుతామో లేదో అనే స్థితిలో ఉండేవాళ్లం. అప్పుడు పుట్టిన భయంలోంచే ఈ కథ వచ్చింది. ఎక్కడో దూరంలో ఉన్న నా కూతురు కష్టాల్లో ఉంటే ఎలా అని అనుకున్నా. అక్కడి నుంచి కథ ముందుకు వచ్చింది. తక్కువ మందితోనే షూటింగ్ చేశాం. ఆన్ లైన్‌లోనే నిర్మాత రవి గారు కథ విన్నారు. ఈ కథను నమ్మి మా మీద ఖర్చుపెట్టారు. కథ విన్న వెంటనే ఆదిత్ సినిమాను ఓకే చేశాడు. షూటింగ్ స్టార్ట్ అయ్యాక.. అతని పర్పామెన్స్ చూసి షాక్ అయ్యాను. హీరోయిన్ శివానీ రాజశేఖర్‌ను మొదటి సారి కలిశాను. ఆమె అమాయకత్వం నాకు చాలా నచ్చింది. ఈ సినిమా చేయాలనే కసిని ఆమెలో చూశాను. ఓ మంచి సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో ఉంది. ఆమెకు అన్ని క్రాఫ్ట్‌ల మీద పట్టుందన్నారు.

  Malavika Mohanan: మాళవిక సోకుల విందు.. రెండు కళ్లు చాలవ్..

  నిర్మాత డా. రవి ప్రసాద్ రాజు ధాట్ల‌ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాను ముందుండి నడిపించిన జీవిత, రాజశేఖర్ గారికి థ్యాంక్స్. కేవీ గుహన్ గారి వల్లే ఈ చిత్రం ఇంత బాగా వచ్చింది. నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. ఇండస్ట్రీ కష్టకాలంలో ఉంది. ఇలాంటి సమయంలో మనం ఏదైనా ఒకటి చేయాలని అనుకున్నాం. మంచి టీం ఉందనే ధైర్యంతో మొదలుపెట్టాను. ఇండస్ట్రీ గురించి బయట ఎన్నో రకాలుగా మాట్లాడుతుంటారు. కానీ ఇండస్ట్రీలో చాలా మంచి వారున్నారు. మా సినిమాను చూసి దిల్ రాజు గారు మెచ్చుకున్నారు. సురేష్ బాబు గారు మా సినిమాను చూసి ఎంతో ప్రోత్సహించారన్నారు. హీరో అదిత్ మాట్లాడుతూ.. ‘మా సినిమాను నాలుగు భాషల్లో నిర్మించి, విడుదల చేస్తున్నారు. ఇది నా పదిహేడో సినిమా. ఇది మొట్టమొదటి కంప్యూటర్ స్క్రీన్ థ్రిల్లర్. అద్భుతమైన సంగీతాన్ని అందించిన సైమన్ గారికి థ్యాంక్స్. ఆదిత్య మ్యూజిక్ వాళ్లు రైట్స్ కొన్న సమయంలో మాకు ఈ సినిమా మీద నమ్మకం వచ్చింది. సురేష్ బాబు గారి వల్లే సినిమా ఇక్కడి వరకు వచ్చింది. అందరూ చూసి ఆదరించండి’ అని కోరారు.

  హీరోయిన్ శివానీ రాజశేఖర్ (Shivani Rajashekar ) మాట్లాడుతూ.. డిసెంబర్ 24న సోనీ లివ్‌తో మా సినిమా రాబోతోంది. మా అందరినీ ఆదరించాలి’ అని కోరుకున్నారు. సంగీత ద‌ర్శ‌కుడు సైమన్ కింగ్ మాట్లాడుతూ.. లిరిక్స్ కూడా అద్భుతంగా వచ్చాయి. ప్రతీ రోజూ నిర్మాత రవి గారు నాకు ఫోన్ చేసేవారు. ఆ పాట బాగుంది.. ఈ పాట బాగుందని రోజూ మెచ్చుకునేవారు. ఆయన ఎంతో ప్యాషన్ ఉన్న నిర్మాత. సోనీ లివ్‌లో ఈ చిత్రం డిసెంబర్ 24న రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు. అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్, ప్రియదర్శి, వైవా హర్ష, దివ్య, రియాజ్ ఖాన్, సత్యం రాజేష్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి... కథ, స్క్రీన్‌ ప్లే, సినిమాటోగ్రఫి, దర్శకత్వం కె వి గుహన్, నిర్మాత డా. రవి ప్రసాద్ రాజు దాట్ల, సంగీతం సైమన్‌ కె. కింగ్. ఈ థ్రిల్లర్ సోనీ లివ్‌లో డిసెంబర్ 24న స్ట్రీమ్ అవుతోంది.
  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Shivani rajasekhar, Tollywood news

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు