Vidya Vasula Aham : రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ (Shivani Rajashekar) హీరో హీరోయిన్లుగా ఏటర్నిటీ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ నెంబర్ 2 గా తెరకెక్కబోతున్న సినిమా 'విద్య వాసుల అహం'(Vidya Vasula Aham షూటింగ్ దశలలో ఉన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ , యానిమేషన్ కాన్సెప్ట్ వీడియో వినాయక చవితి సందర్భంగా విడుదల చేశారు. టైటిల్ మరియు లుక్ ఫ్రెష్ గా ఉన్నాయని ముఖ్యంగా యూత్ ను బాగా అట్రాక్ట్ చేస్తోంది. కాన్సెప్ట్ వీడియోకు అన్ని వర్గాల ఆడియన్స్ నుండి మంచి స్పందన లభిస్తోంది.తెల్లవారితే గురువారం సినిమా తరువాత మణికాంత్ గెల్లి ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు.ఈ సినిమా కోసం ఒక ఇల్లు సెట్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వెయ్యడం జరిగింది. పెళ్ళైన ఒక జంట మధ్య ఉన్న ఇగో లతో ఈ సినిమా కథాంశం ఉండబోతోంది. కల్యాణి మాలిక్ ఈ మూవీకి స్వరాలు సమకూరుస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విద్య వాసుల అహం త్వరలో థియేటర్స్ లో విడుదల కానుంది.
శివానీ రాజశేఖర్ విషయానికొస్తే.. టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ కూతుళ్లు శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్స్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అందులో జీవితా రాజశేఖర్ దంపతుల పెద్ద కూతురు శివానీ. ప్రస్తుతం సినిమాలతో పాటు డాక్టర్ చదువుతోంది. తెలుగు ఇండస్ట్రీలో వారసులు ఎక్కువగా ఉన్నారు కానీ వారసురాళ్లు తక్కువే. హీరో ఫ్యామిలీ నుంచి వచ్చినా ఎవరు పెద్దగా సక్సెస్ కాలేదు. తాజాగా రాజశేఖర్ పెద్ద కూతురు శివానీ రాజశేఖర్ ‘అద్భుతం’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా థియేట్రికల్ కాకుండా.. నేరుగా డిస్నీ హాట్ స్టార్‌లో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. కొంత మంది డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని చెబుతుంటారు. ఈమె కూడా తండ్రి బాటలో డాక్టర్ చదువుతూ మరోవైపు యాక్టింగ్ వైపు ఫోకస్ పెడుతోంది.
శివానీ రాజశేఖర్ ఫస్ట్ మూవీ ‘అద్భుతం’ సినిమా విషయానికొస్తే.. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు విమర్శకులు ప్రశంసలు దక్కాయి. తొలి సినిమాలో మంచి నటిగా ప్రూవ్ చేసుకుంది. అంతేకాదు తల్లి, తండ్రికి తగ్గ తనయగా ప్రూవ్ చేసుకుంది శివానీ రాజశేఖర్. రీసెంట్ గా ఈమె ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనబోతున్నట్టు ప్రకటించింది. తాజాగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అదే రోజు ఆమె డాక్టర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉండటంతో తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. తన జీవితంలో ఫెమినా మిస్ ఇండియా కంటే .. ఒక డాక్టర్ కావాలనదే తన కోరిక అంటూ తన మనసులో మాటను బయట పెట్టింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Shivani Rajashekar, Tollywood