మరో వారసురాలు వచ్చేస్తుంది.. శివానీ రాజశేఖర్ ఫస్ట్ లుక్..

Shivani Rajasekhar: తెలుగు ఇండస్ట్రీలో వారసులు ఎక్కువగా ఉన్నారు కానీ వారసురాళ్లు తక్కువే. మంచు లక్ష్మి లాంటి వాళ్లు వచ్చినా కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. అప్పట్లో కృష్ణ కూతురు వచ్చినా..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 1, 2020, 2:33 PM IST
మరో వారసురాలు వచ్చేస్తుంది.. శివానీ రాజశేఖర్ ఫస్ట్ లుక్..
శివానీ రాజశేఖర్ (shivani rajasekhar)
  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో వారసులు ఎక్కువగా ఉన్నారు కానీ వారసురాళ్లు తక్కువే. మంచు లక్ష్మి లాంటి వాళ్లు వచ్చినా కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. అప్పట్లో కృష్ణ కూతురు వచ్చినా కూడా అభిమానులు గోల చేసారు. నిహారిక ఉన్నంతలో కాస్త బెటర్. ఆమె కూడా హిట్ ఇప్పటి వరకు సాధించలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఇక ఇప్పుడు రాజశేఖర్ కూతుళ్లు ఇండస్ట్రీలో తమ సత్తా నిరూపించుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక దొరసాని సినిమాతో పరిచయం అయింది. ఈ చిత్రం డిజాస్టర్ కావడంతో అమ్మడు ఎవరికీ గుర్తు లేదు.

శివానీ రాజశేఖర్ (shivani rajasekhar)
శివానీ రాజశేఖర్ (shivani rajasekhar)


ప్రస్తుతం మరో అవకాశం కోసం చూస్తుంది ఈమె. ఇదిలా ఉంటే ఇప్పుడు రాజశేఖర్ పెద్ద కూతురు శివానీ కూడా వచ్చేస్తుంది. నిజానికి ఈమె 2 స్టేట్స్ రీమేక్‌తోనే తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయం కావాల్సి ఉంది. అడవి శేష్ హీరోగా మొదలైన ఈ సినిమా అనుకోకుండా ఆగిపోయింది. దాంతో ఇప్పుడు మరో సినిమాతో వస్తుంది శివానీ. తాజాగా ఈమె నటిస్తున్న తొలి సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసారు.

శివానీ రాజశేఖర్ (Source: Twitter)


జులై 1న శివానీ పుట్టిన రోజు సందర్భంగా ఈమె లుక్ విడుదల చేసింది టీం. ఇందులో వెన్నెల అనే పాత్రతో నటిస్తుంది శివానీ. మల్లిక్ రామ్ దర్శకుడు. తేజ సజ్జా హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంతో కచ్చితంగా తన మార్క్ చూపిస్తానంటుంది శివానీ. ఇండస్ట్రీలోనే పుట్టి పెరిగింది కాబట్టి అందాల ఆరబోతకు కూడా పెద్దగా అడ్డు చెప్పడం లేదు ఈ ముద్దుగుమ్మ. మరి చూడాలిక.. రాజశేఖర్ కూతురు తెలుగులో ఎంత వరకు సక్సెస్ అవుతుందో..?
First published: July 1, 2020, 2:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading