హోమ్ /వార్తలు /సినిమా /

Vedha Movie Review: శివరాజ్‌కుమార్ ‘వేద’ మూవీ రివ్యూ.. మెసెజ్ ఓరియంటెడ్ రివేంజ్ డ్రామా..

Vedha Movie Review: శివరాజ్‌కుమార్ ‘వేద’ మూవీ రివ్యూ.. మెసెజ్ ఓరియంటెడ్ రివేంజ్ డ్రామా..

శివరాజ్‌కుమార్ ‘వేద’ మూవీ రివ్యూ (Twitter/Photo)

శివరాజ్‌కుమార్ ‘వేద’ మూవీ రివ్యూ (Twitter/Photo)

Vedha Movie Review: కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘వేద’. కన్నడలో గతేడాది చివరల్లో విడుదలైన ఈ మూవీ అక్కడ మంచి విజయం సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని అదే ‘వేద’ టైటిల్‌తో తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసారు. మరి ఈ సినిమా ఎలా ఉంది. మన మూవీ రివ్యూలో చూద్దాం.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

రివ్యూ : వేద (Vedha)

నటీనటులు : శివరాజ్ కుమార్, గనవి లక్ష్మణ్, అదితి సాగర్,  శ్వేతా చెంగప్ప, వీణ పొన్నప్ప,భరత్ సాగర్  తదితరులు..

ఎడిటర్: దీపు ఎస్ కుమార్

సినిమాటోగ్రఫీ: స్వామి జే గౌడ

సంగీతం: అర్జున్ జన్య

నిర్మాత : గీతా శివరాజ్‌కుమార్

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: హర్ష

విడుదల తేది : 9/2/2023

తెలుగులో డబ్బింగ్ సినిమాలు విడుదలనేది కొత్త కాదు. తమిళం, మలయాళం నుంచి ఎన్నో చిత్రాలు  తెలుగులో డబ్బై మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కన్నడ నుంచి ఎపుడో కానీ కొన్ని సినిమాలు తెలుగులో డబ్బైన దాఖలాలు లేవు. ఇక కేజీఎఫ్‌తో కన్నడ ఇండస్ట్రీ రూపురేఖలే మారిపోయాయి. అక్కడి సినిమాలను కూడా తెలుగు, సహా ప్యాన్ ఇండియా సినిమా ప్రేక్షకులు పట్టించుకుంటున్నారు. ఈ కోవలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ముఖ్యపాత్రలో నటించిన ‘వేద’ సినిమాను తెలుగులో అదే టైటిల్‌తో విడుదల చేసారు. మరి తెలుగు ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం.

కథ విషయానికొస్తే..

ఈ సినిమా 2021 మైసూర్‌లో ప్రారంభం అవుతోంది. మైసూర్‌లో నీల అనే అమ్మాయిని బస్సులో ఓ ఆకతాయి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుంటాడు. దీంతో ఉద్యోగం మానేస్తాని తన నాయనమ్మతో చెబుతోంది. దీంతో నాయనమ్మ రిటైర్ట్ ఇన్‌స్పెక్టర్ రమా ( శ్వేతా చెంగప్ప). తన ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా చూసిన వేద (శివరాజ్ కుమార్) ఆమె కూతురు కనక (అదితి సాగర్) తమకు జరిగిన అన్యాయంపై ఎలా ఎదురుతిరిగారు. అందుకు కారకులైన వాళ్లను ఎలా మట్టుపెట్టారు అనేది స్టోరీ. అంతకు 20 ఏళ్ల క్రితం వేద అదే ఊళ్లో పుష్ప (గనవి లక్ష్మణ్)ను అనుకోని పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వస్తోంది. వాళ్లకు ఓ కూతురు కనక ఉంటుంది. ఐతే ఓ సందర్భంలో వేద జైలుకు వెళ్లాల్సి వస్తోంది. అతను జైలు నుంచి తిరిగొచ్చే సమయానికి అతని భార్యను చనిపోతుంది. అతని కూతురు కనకను తల్లిని చంపిన నేరంపై జైలు వెళ్లాల్సి వస్తోంది. అసలు వేద భార్య చావుకు కారకులు ఎవరు ? వారిపై జైలు నుంచి బయటకు వచ్చిన కూతురుతో కలిసి ఎలా పగ తీర్చుకున్నాడనేదే ‘వేద’ మూవీ స్టోరీ.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..

దర్శకుడు హర్ష ప్రస్తుతం సమాజంలో ఆడవాళ్లపై జరుగుతున్న లైంగిక దాడుల నేపథ్యంలో ‘వేద’ సినిమాను తెరకెక్కించాడు. సింపుల్‌గా చెప్పాలంటే తన కుటుంబానికి అన్యాంయ చేసిన ఐదుగురు వ్యక్తులపై ఎలా పగ సాధించాడనేదే ఈ సినిమా స్టోరీ. ఇలాంటి కథలు మనం చాలానే చూసుంటాం కానీ.. దాన్ని సరికొత్తగా తెరపై ఆవిష్కరించాడు.   ఇలాంటి సెన్సిబుల్ సబ్జెక్ట్‌‌తో శివరాజ్‌కుమార్‌తో ఓకే చేయించడం మరో విశేషం. ఈ తరహా కథలతో మనం గతంలో ఎర్ర మందారం, రాఖీ, రంగస్థలం వంటి సినిమాల ఛాయలు మనకు  కనిపిస్తాయి.  సినిమా మొత్తం 1960, మరియు 80 బ్యాక్‌డ్రాప్‌లో నడుస్తూ ఉంటుంది. అప్పటి పల్లె వాతావరణం, అప్పటి మనుషుల ప్రవర్తన అన్నింటినీ ఈ సినిమా చక్కగా తెరకెక్కించాడు. ఈ సినిమాలో సందేశం ఇస్తూనే కమర్షియల్ అంశాలైన యాక్షన్‌తో పాటు ఎమోషన్‌తో సమానంగా క్యారీ చేస్తూఈ సినిమాను ఆద్యంతం నడింపించాడు. సినిమాలో శివరాజ్‌కుమార్‌ను హీరోగా కాకుండా  కథలో పాత్రలా తీసుకున్నారు. అందుకు తగ్గట్టు తన ఏజ్‌కు తగ్గ పాత్రలో శివరాజ్ కుమార్ ఒదిగిపోయారు. మహిళలను ఆట వస్తువులా చూసే వాళ్లకు  మహిళలు ఎలా ఎదురు తిరగాలనేది ఈ సినిమాలో చూపించాడు దర్శకుడు.   టెక్నికల్ విషయానికొస్తే.. సినిమాను ఫోటోగ్రఫీ ప్రాణంలా నిలిచింది. 1960, మరియు 80ల కాలం నాటి పరిస్థితిలను తన కెమెరాలో అద్భుతంగా బంధించాడు. సినిమాకు ఆర్ట్ వర్క్ ప్రధానకర్షణగా నిలిచింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. మనకు అక్కడక్కడ కీరవాణి.. ‘ఛత్రపతి’ గుర్తుకు వచ్చినా.. ఓవరాల్‌గా అర్జున్ జన్య ఆర్ఆర్‌తో పాటు మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. గ్రాఫిక్స్ వర్క్స్, నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల విషయానికొస్తే..

శివరాజ్‌కుమార్ తన స్టార్ ఇమేజ్‌ను పక్కన పెట్టి.. ఓ సాధారణ పాత్రలా తన క్యారెక్టర్‌కు ప్రాణం పోసారు.ఈ విషయంలో శివన్న గట్స్‌ను మెచ్చుకుని తీరాల్సిందిే.   వేద పాత్రకు న్యాయం చేసారు. ఒకవైపు రౌద్ర రసం ఒలికిస్తేనే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో హాస్యం పండించాడు. మరోవైపు భార్య చనిపోయే సీన్స్‌తో పాటు ఇతరత్రా అంశాల్లో అద్భుత, శాంత రసాలను తనదైన శైలిలో పండించాడు. ఇక పుష్ప పాత్రలో నటించిన గనవి తన పాత్రకు 100 శాతం న్యాయం చేసింది. ఇక కూతురు పాత్రలో నటించిన అదితి సాగర్.. నటనతో పాటు తన యాక్షన్‌తో ఆకట్టుకుంది. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు నటించారు.

ప్లస్ పాయింట్స్ 

శివరాజ్‌కుమార్ నటన

అదితి సాగర్, గనవి లక్షణ్ యాక్టింగ్

యాక్షన్ సన్నివేశాలు

స్క్రీన్ ప్లే

మైనస్ పాయింట్స్ 

రొటీన్ రివేంజ్ కథ

నేటివిటి

సినిమా నిడివి

చివరి మాట : మెసెజ్ ఓరియంటెడ్ ఉమెన్ సెంట్రిక్ రివేంజ్ డ్రామా

రేటింగ్ : 2.75/5

First published:

Tags: Shiva Rajkumar, Tollywood, Vedha

ఉత్తమ కథలు