హోమ్ /వార్తలు /సినిమా /

Ghost: కరుణడ చక్రవర్తి శివరాజ్ కుమార్ పాన్ ఇండియా మూవీ ఘోస్ట్.. కొత్త పోస్టర్ రిలీజ్

Ghost: కరుణడ చక్రవర్తి శివరాజ్ కుమార్ పాన్ ఇండియా మూవీ ఘోస్ట్.. కొత్త పోస్టర్ రిలీజ్

ghost New Poster (Photo News 18)

ghost New Poster (Photo News 18)

Shiva Rajkumar: కరుణడ చక్రవర్తి డాక్టర్ శివరాజ్ కుమార్ పాన్ ఇండియా ఫిలిం ‘ఘోస్ట్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో  తెరకెక్కుతున్న ఈ యాక్షన్ హైస్ట్ థ్రిల్లర్ కి కన్నడ బ్లాక్ బస్టర్ ‘బీర్బల్’ చిత్ర దర్శకుడు శ్రీని దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

కరుణడ చక్రవర్తి డాక్టర్ శివరాజ్ కుమార్ (Shiva Rajkumar) పాన్ ఇండియా ఫిలిం ‘ఘోస్ట్’ (Ghost) శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో  తెరకెక్కుతున్న ఈ యాక్షన్ హైస్ట్ థ్రిల్లర్ కి కన్నడ బ్లాక్ బస్టర్ ‘బీర్బల్’ చిత్ర దర్శకుడు శ్రీని (Srini) దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ రాజకీయనాయకులు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఘోస్ట్ 28 రోజుల పాటూ సాగిన మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్ లో రూ 6 కోట్ల వ్యయంతో భారీగా వేసిన జైల్ ఇంటీరియర్ సెట్ లో చిత్రీకరణ జరుపుకుంది.

మొదటి షెడ్యూల్ కి సంబందించిన మేకింగ్ స్టిల్స్, వీడియో విడుదల చేశారు మేకర్స్. అర్జున్ జన్య అద్భుతమైన బిజీఎమ్ తో ఉన్న మేకింగ్ వీడియో చిత్రం ఎంత భారీ స్థాయిలో తెరకెక్కుతోందో తెలియజేస్తోంది. డిసెంబర్ రెండో వారం నుండి రెండో షెడ్యుల్ చిత్రీకరణ ప్రారంభమవుతుంది. ఈ షెడ్యుల్ కోసం ప్రిజన్ బయటి లుక్ సెట్ భారీ వ్యయం తో నిర్మిస్తున్నారు. కాగా, టీం శివ రాజ్ కుమార్ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. గన్ తన అధికారం అన్నట్టుగా పట్టుకుని తీక్షణంగా చూస్తున్న శివన్నతో ఉన్న ఘోస్ట్ న్యూ పోస్టర్ అంచనాలు పెంచుతోంది.

ఈ సినిమాలో ప్రముఖ మలయాళ నటుడు జయరామ్ కీలక పాత్ర పోషిస్తుండగా.. ప్రశాంత్ నారాయణ్, అచ్యుత్ కుమార్, దత్తన్న, అవినాష్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. ‘ఘోస్ట్’ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. మస్తీ, ప్రసన్న వి ఎం డైలాగ్స్ రాస్తున్నారు. కె జి ఎఫ్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆర్ట్ డైరెక్టర్ శివ కుమార్ ఈ సినిమాకి పని చేస్తున్నారు.

ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య సంగీతాన్ని అందిస్తున్నారు. కన్నడ లో టాప్ స్టార్స్, టెక్నిషన్స్ తో చిత్రాలు తీసే సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత సందేశ్ నాగరాజ్ ‘ఘోస్ట్’ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు మేకర్స్.

First published:

Tags: Cinema, Tollywood, Tollywood actor

ఉత్తమ కథలు