Home /News /movies /

SHIVA NIRVANA RESPONSE ON SAMANTHA VIJAY DEVARAKONDA INJURED IN KUSHI MOVIE SHOOTING SB

Samantha: సమంత,విజయ్ దేవరకొండపై రూమర్స్... ఖండించిన దర్శకుడు

Samantha and Vijay Photo : Twitter

Samantha and Vijay Photo : Twitter

సమంత విజయ్‌పై వస్తున్న వార్తలన్నీ ఫేక్ అంటూ.. దర్శకుడు క్లారిటీ ఇచ్చారు. దీంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

    సమంత(Samantha), విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)కలిసి నటిస్తున్న సినిమా ఖుషి. ఈ సినిమాను దర్శకుడు శివ నిర్వాణ(Shiva Niravana) తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కశ్మీర్‌(Kashmir)లో వేగంగా జరుగుతుంది. అయితే ఈ సినిమా కోసం ఓ యాక్షన్ సీన్ తీస్తుండగా.... సమంతా, విజయ్ దేవరకొండ షూటింగ్‌లో గాయపడినట్లు వార్తలు వచ్చాయి.  జాతీయ మీడియా కథనాల ప్గారసారం అయ్యాయి. షూటింగ్ జరుగుతుండగా జరిగిన ప్రమాదంలో సమంత,విజయ్ దేవరకొండ తీవ్రంగా గాయపడినట్లు కథనాలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై డైరెక్టర్ శివ నిర్వాణ స్పందించారు. ఆ వార్తలన్నీ ఫేక్ అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘ఖుషీ షూటింగ్‌లో(Kushi Shooting) గాయపడ్డ  విజయ్, సమంత’ అన్న హెడ్ లైన్ పోస్టు చేస్తూ ఫేక్ న్యూస్ అంటూ పోస్టు పెట్టారు.

    అయితే ఈ సినిమా షూటింగ్ లో ఇద్దరూ హీరో హీరోయిన్ లు గాయపడ్డారని పలు వార్తలు బయటకి వచ్చి వైరల్ అయ్యాయి. యాక్షన్ సీన్ తీస్తుండగా వీరు నడుపుతున్న వెహికల్ నదిలో పడిపోయినట్లు .. వారిద్దరికీ గాయాలు అయినట్లు వార్తలు వచ్చాయి. దీంతో వారికి ఆస్పత్రికి తరలించి  చికిత్స అందించినట్లు తెలిపారు.  అయితే ఈ వార్తలపై దర్శకుడు శివ నిర్వాణ ఒక క్లారిటీ ఇచ్చారు. అదంతా ఫేక్ న్యూస్ అని వారు బాగానే ఉన్నట్టుగా తెలిపారు. దీనితో సమంత దేవరకొండ అభిమానులు ఈ క్లారిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి హీషమ్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.


    విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా ఓ ప్రేమకథా చిత్రాన్ని శివ నిర్వాణ(Shiva Niravana) డైరెక్ట్ చేస్తున్నారు.  ప్రస్తుతం కశ్మీర్‌ లోయలోని పలు అందమైన లొకేషన్లలో షూటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సినిమాకు ‘ఖుషి’ అనే పేరు ఖరారు ఫిక్స్ చేస్తూ.. ఇటీవలే అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. ఈ మేరకు సోషల్ మీడియా(Social Media) ద్వారా టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌(Kushi First Look) ను విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో విజయ్‌ స్టైలిష్‌ లుక్‌లో.. సమంత సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు

    కశ్మీర్‌(Kashmir) నేపథ్యంలో సాగే ప్రేమ కథా చిత్రమిది. దీన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ ఏడాది డిసెంబర్‌ 23న విడుదల చేయనున్నారు. విజయ్‌ దేవరకొండ కెరీర్‌లో 11వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మహానటి తర్వాత సామ్‌, విజయ్‌ కలిసి నటిస్తున్న ప్రాజెక్ట్‌ కావడంతో మరింత ఆసక్తి నెలకొంది.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Samantha Ruth Prabhu, Shiva Nirvana, Vijay Devarakonda

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు