HOME »NEWS »MOVIE »shiva nirvana accept green india challenge by naga chaitanya and plant saplings ta

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన శివ నిర్వాణ..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన శివ నిర్వాణ..
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన దర్శకుడు శివ నిర్వాణ (Twitter/Photo)

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్  ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జెట్ స్పీడ్ తో ముందుకు సాగుతుంది. ఇందులో భాగంగా దర్శకుడు శివ నిర్వాణ జూబ్లిహిల్స్‌లోని పార్క్‌లో మొక్కలు నాటాడు.

  • Share this:
    రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్  ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జెట్ స్పీడ్ తో ముందుకు సాగుతుంది. రాజకీయ నాయకులు, సినిమావాళ్లు, క్రీడాకారులు అందురు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వాములవుతున్నారు. తాజాగా  తాజాగా అక్కినేని నాగచైతన్య విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా దర్శకుడు శివ నిర్వాణ ఈ రోజు తన జూబ్లీహిల్స్‌ పార్క్‌లో  మొక్కలు నాటారు. ఈ సందర్భంగా శివ నిర్వాణ మాట్లాడుతూ.. జోగినిపల్లి సంతోష్ గారు ఒక నాయకుడిగా తన ప్రజాసేవను కొనసాగిస్తూనే.. ఒక మంచి ఆశయం కోసం ఒక వినూత్నమైన కార్యక్రమం రూపొందించడం చాలా గొప్ప విషయమ అన్నారు.

    గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన దర్శకుడు శివ నిర్వాణ (Twitter/Photo)




    దేశవ్యాప్తంగా ఇంతమందిని గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వామ్యం చేయడం నిజంగా గర్వించదగ్గ విషయం అన్నారు. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసాడు శివ నిర్వాణ.


    ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా దర్శకులు సందీప్ రెడ్డి వంగా, సుధీర్ వర్మ, హరీష్ పెద్ది, సాహు గారపాటికి గ్రీన్ ఇండియా  ఛాలెంజ్‌లో మొక్కలు నాటాలని దర్శకుడు శివ నిర్వాణ చాలెంజ్ విసిరారు. మొత్తంగా శివ నిర్వాణ తన తోటి దర్శకులను గ్రీన్ ఇండియాలో భాగస్వామ్యం చేయడం నిజంగానే అభినందించదగ్గ విషయమే.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:August 23, 2020, 10:46 IST

    टॉप स्टोरीज