Home /News /movies /

SHILPA SHETTYS ENTIRE FAMILY TESTS CORONA POSITIVE ACTRESS URGES EVERYONE TO FOLLOW COVID 19 SAFETY PROTOCOLS TA

Shilpa Shetty: శిల్పాశెట్టి కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్.. ట్వీట్ చేసిన సాగరకన్య..

శిల్పా శెట్టి కుటుంబ సభ్యులకు కరోనా (Twitter/Photo)

శిల్పా శెట్టి కుటుంబ సభ్యులకు కరోనా (Twitter/Photo)

Shilpa Shettys Entire Family Tests Corona Positive: ప్రస్తుతం మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ అందరినీ భయ భ్రాంతలలకు గురి చేస్తోంది. గత 15 రోజుల్లో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా బాలీవుడ్ నటి శిల్పాశెట్టి కుటుంబ సభ్యులు కరోనా బారిన పడిన విషయాన్ని చెప్పుకొచ్చారు.

ఇంకా చదవండి ...
    Shilpa Shettys Entire Family Tests Corona Positive: ప్రస్తుతం మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ అందరినీ భయ భ్రాంతలలకు గురి చేస్తోంది. గత 15 రోజుల్లో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రజలు సరైన వైద్య సదుపాయాలు లేక ప్రాణాలు విడుస్తున్నారు. ఈ సందర్భంగా షూటింగ్‌లో పాల్గొంటున్న సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్‌తో పాటు పలు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కోవిడ్ బారిన పడుతున్నారు. ఇప్పటికే అక్షయ్ కుమార్, గోవిందా, పవన్ కళ్యాణ్‌, అల్లు అర్జున్, పూజా హెగ్డే వంటి సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే అందులో చాలా మంది సినీ ప్రముఖులు కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శిల్పాశెట్టి కుటుంబ సభ్యులు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని సాగరకన్య స్వయంగా తన సోసల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసారు.

    శిల్పాశెట్టి కుటుంబంలో ఆమె భర్త రాజ్ కుంద్రాతో పాటు ఆమె ఇద్దరు పిల్లలు, అత్తమామలు, ఆమె తల్లి కరోనా బారిన పడ్డారు. శిల్పాశెట్టి మాత్రం తనకు తప్ప మిగతా కుటుంబ సభ్యులందరికీ పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం శిల్పా శెట్టి ఫ్యామిలీ మెంబర్స్.. డాక్టర్ల సలహా మేరకు హోం ఐసోలేషన్‌లో ఉన్నట్టు తెలిపారు. ప్రస్తుతం వారందరు కోలుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు శిల్పా శెట్టి. గత పది రోజులు మాకు చాలా కష్టంగా గడిచాయని చెప్పుకొచ్చారు.



    బాలీవుడ్ నటి శిల్పాశెట్టి గురించి సెపెరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. చేతిలో సినిమాలు లేకున్నా.. ఈ మంగళూరు భామ.. తనదైన యోగాసనాలతో ఎపుడు అభిమానులతో టచ్‌లో ఉంటుంది.శిల్పాశెట్టికి కేవలం హిందీ ఇండస్ట్రీతోనే కాదు.. తెలుగులోనూ ఈ భామ పలు చిత్రాల్లో నటించి ఇక్కడ ప్రేక్షకులను కూడా పలకరించింది. దాదాపు 7 యేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత  హిందీలో  ‘నికమ్మ’తో పాటు ‘హంగామా 2’  చిత్రంలో నటించడానికి ఓకే చెప్పింది శిల్పాశెట్టి. తెలుగులో ఈమె ‘సాహసవీరుడు సాగరకన్య’, ’వీడెవండీ బాబు’, భలే వాడివి బాసు, ఆజాద్‌ సినిమాల్లో నటించారు. త్వరలో తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Bollywood news, Corona positive, Covid-19, Shilpa Shetty, Tollywood

    తదుపరి వార్తలు