నితిన్ సినిమాకు నో చెప్పిన బాలయ్య భామ.. పరేషాన్‌లో చిత్రబృందం..

ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో హిందీలో సూపర్ హిట్ అయిన అంధాధున్ సినిమాని తెలుగులో నితిన్ హీరోగా రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: June 29, 2020, 10:02 AM IST
నితిన్ సినిమాకు నో చెప్పిన బాలయ్య భామ.. పరేషాన్‌లో చిత్రబృందం..
నితిన్, శిల్పా శెట్టి Photo : Twitter
  • Share this:
ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో హిందీలో సూపర్ హిట్ అయిన అంధాధున్ సినిమాని తెలుగులో నితిన్ హీరోగా రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోతో పాటు సమానంగా ఉండే టబు పాత్రను తెలుగులో ఎవరితో చేయిస్తే బాగుంటదని ఆలోచిస్తోన్న చిత్రబృందం ఈ పాత్ర కోసం చాలా మందినే పరిశీలించింది. కొంత నెగెటివ్ టచ్ ఉన్న ఈ పాత్రను తెలుగులో కూడా ఆమె చేయనుందని కొన్ని రోజులు టాక్ నడిచింది. ఆ తరువాత ఆ పాత్ర అనసూయకు దక్కిందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొన్ని రోజులు రమ్యకృష్ణ అని టాక్ నడిచింది. అయితే ఈ పాత్ర చేయాలంటే రమ్య కృష్ణ భారీ మొత్తంలో డిమాండ్ చేస్తోందట. దీంతో ఈ నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర కోసం ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇలియానాని కూడా పరిశీలించిందట చిత్రబృందం. అయితే ఆ పాత్రకి ఆమె సింపుల్‌గా నో చెప్పేసిందట. దీనికి కారణం లేకపోలేదు. ఇలియానా గతంలో నితిన్‌తో రెచ్చిపో అనే సినిమా చేసింది. అందుకే మళ్ళీ ఇప్పుడు నితిన్ తో నెగటివ్ క్యారెక్టర్ చేస్తే ఆమె కెరీర్ గ్రాఫ్ పూర్తిగా డౌన్ అయిపోతుందని భావించిఉండవచ్చని అంటున్నారు. అయితే ప్రస్తుతానికి ఇలియానకు తెలుగులో ఎలాంటీ ఆఫర్స్ లేవు.

ఇక ఆ పాత్రకోసం మరో హిందీ నటి శిల్పాశెట్టిని సంప్రదించగా.. ఆమె కూడా బిజీ అని చెప్పి..‘నో’ చెప్పినట్లుగా టాక్. ఈ భామ వెంటేష్, బాలయ్యలతో తెలుగులో రెండు మూడు సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఏం చేయాలో తెలియని చిత్రయూనిట్ కొంతకాలం పాటు ఈ చిత్రాన్ని వాయిదా వేయడమే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లుగా టాక్ నడుస్తుంది. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై నిర్మితమవుతోన్న ఈ సినిమాకు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ఫేమ్ మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో నితిన్ సరసన ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్‌గా నటించనుందని తెలుస్తోంది.
First published: June 29, 2020, 10:02 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading