Shilpa Shetty - Raj Kundra: సెక్స్ రాకెట్ కేసులో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా దంపతులకు మరో బిగ్ షాక్..

శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా దంపతులు (Twitter/Photo)

Shilpa Shetty - Raj Kundra: సెక్స్ రాకెట్ కేసులో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా దంపతులకు ముంబై పోలీసులు పెద్ద షాక్ ఇచ్చారు. పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాపై ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు మరిన్ని సాక్ష్యాలతో ఉచ్చు బిగిస్తున్నారు.

  • Share this:
    Shilpa Shetty - Raj Kundra: సెక్స్ రాకెట్ కేసులో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా దంపతులకు ముంబై పోలీసులు పెద్ద షాక్ ఇచ్చారు. పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాపై ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు మరిన్ని సాక్ష్యాలతో ఉచ్చు బిగిస్తున్నారు. ఈ సందర్భంగా ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శిల్పాశెట్టిని పలు కోణాల్లో విచారించారు. ఈ సందర్భంగా పోలీసులకు శిల్పాశెట్టి నుంచి మరింత సమాచారం రాబట్టినట్టు సమాచారం. ఈ సందర్భంగా ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. రాజ్ కుంద్రా కు బిగ్ షాక్ ఇచ్చారు. కాన్పూర్‌ ఎస్‌బీఐలో ఉండే ఆయన రెండు అకౌంట్‌లను సీజ్ చేశారు. ఈ అకౌంట్ల నుంచి కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగినట్టు ముంబై పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా రాజ్ కుంద్రా ప్రొడక్షన్ హౌస్ వ్యవహారాలు చూసే అర్వింద్ శ్రీవాస్తవ నిర్వహించే వాడని గుర్తించారు. అంతేకాదు అతని అకౌంట్ నుంచి ప్రతి నెల ఆమె భార్య హర్షితకు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసేవాడని దర్యాప్తులో తేలింది.

    ఈ సందర్భంగా అర్వింద్ శ్రీవాస్తవ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా అర్వింద్ ఇంటికే రాలేదని షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఐనా.. ప్రతినెల ఠంచనుగా డబ్బులు మాత్రము పంపేవాడని అర్వింద్ శ్రీవాస్తవ తండ్రి వెల్లడించారు. ఇక తన అబ్బాయి అర్వింద్ ఏం పనిచేసేవాడనే విషయం తమకు తెలియదన్నారు. 2021లో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అర్వింద్ శ్రీవాస్తవపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసారు. మరోవైపు హర్షిత బ్యాంకు ఖాతాకు డబ్బు ట్రాన్స్‌ఫర్ అవుతున్న విషయం తమకు తెలియదన్నారు అర్వింద్ శ్రీవాస్తవ తండ్రి. మరోవైపు ఈ కేసులో రాజ్ కుంద్రా దగ్గర పనిచేసే నలుగురు అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేందకు ముందుకు వచ్చిన ఈ తరుణంలో రాజ్ కుంద్రా బ్యాంక్ ఖాతాలు సీజ్ కావడం గమనార్హం. ఈ  కేసులో ఈ నెల 19న రాజ్ కుంద్రాతో 11 మందిని ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ కేసు విచారణలో భాగంగా గెహనా వశిష్ఠ్‌కు పోలీసులు సమన్లు పంపించారు.

    Shilpa Shetty, Raj Kundra
    శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా Shilpa Shetty, Raj Kundra


    రాజ్ కుంద్రా...ఈ పేరు వినగానే మనందరికీ శిల్పా శెట్టి భర్తగా మాత్రమే తెలుసు. రీసెంట్‌గా పోర్న్ రాకెట్ గుట్టు రట్టువడంతో అతని  అశ్లీల చిత్రాల కంపెనీ వ్యవహారం బయటపడింది.  పేరుకు లండన్ వ్యాపారిగా పరిచయం ఉన్న రాజ్ కుంద్రా వ్యవహార శైలి మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉంది. గతంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు అధిపతిగా ఉన్నారు. ఆ తర్వాత మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారంతో అతడి ప్రతిష్ట మసకబారింది.

    raj kundra,raj kundra twitter,raj kundra instagram,raj kundra arrested,shilpa shetty husband raj kundra,shilpa shetty raj kundra arrested,shilpa shetty raj kundra latest news,raj kundra porn movies,shilpa shetty’s husband raj kundra,pornography case,shilpa shetty husband raj kundra business,రాజ్ కుంద్రా,శిల్పా శెట్టి రాజ్ కుంద్రా కేసు,రాజ్ కుంద్రా పోర్న్ వర్సెస్ వ్యభిచారం
    రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి (File/Photo)


    వెస్ట్ ముంబయిలోని ఒక బిల్డింగ్ లో నీలి చిత్రాలు తీసే ఒక ముఠాను ముంబయి ప్రాపర్టీ సెల్ పోలీసులు అరెస్టు చేయగా  ఆ ప్రొడక్షన్ హౌస్ మూలాలు యూకే కంపెనీవి అని గుర్తించారు. దానికి హెడ్ పేరు ఉమేశ్ కామత్ అని ఉంది. అతడు  రాజ్ కుంద్రా బినామీగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. అలా తీగ లాగితే డొంక అంతా కదిలింది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: