Home /News /movies /

SHILPA SHETTY OPENS ABOUT WHY SHE CHOSE SURROGACY TA

సరోగసిని ఎంచుకోవడానికి కారణాలు వెల్లడించిన శిల్పాశెట్టి..

భర్త పిల్లలతో శిల్పాశెట్టి (Instagram/Photo)

భర్త పిల్లలతో శిల్పాశెట్టి (Instagram/Photo)

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి గురించి సెపెరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. చేతిలో సినిమాలు లేకున్నా.. ఈ మంగళూరు భామ.. తనదైన యోగాసనలతో ఎపుడు అభిమానులతో టచ్‌లో ఉంటుంది.తాజాగా ఈమె రెండో బిడ్డను సరోగసీ ద్వారా కన్నది. ఆమె ఎందుకు సరోగసీ ఎంచుకున్న విషయాన్ని అభిమానులతో పంచుకుంది.

ఇంకా చదవండి ...
    బాలీవుడ్ నటి శిల్పాశెట్టి గురించి సెపెరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. చేతిలో సినిమాలు లేకున్నా.. ఈ మంగళూరు భామ.. తనదైన యోగాసనలతో ఎపుడు అభిమానులతో టచ్‌లో ఉంటుంది. శిల్పాశెట్టికి కేవలం హిందీ ఇండస్ట్రీతోనే కాదు.. తెలుగులోనూ ఈ భామ పలు చిత్రాల్లో నటించి ఇక్కడ ప్రేక్షకులను కూడా పలకరించింది. రీసెంట్‌గా శివరాత్రి పర్వదినాన ఈమె రెండో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ బిడ్డను సరోగసీ ద్వారా ఆడబిడ్డకు జన్మించినట్లు రాజ్‌కుంద్రా, శిల్పా శెట్టి దంపతులు అభిమానులకు తెలియజేసిన విషయం తెలిసిందే కదా. శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా దంపతులకు ఇంతకు ముందు వియాన్ అనే కుమారుడు ఉన్నాడు. తమకు జన్మించిన పాపకు శిల్పాశెట్టి దంపతులు సమీషా అనే  పేరు పెట్టారు.  సమీషాలో స అంటే సంస్కృతంలో కలిగి ఉండటం అని అర్ధం. మిశ అంటే రష్యన్ భాషలో అదృష్ణ దేవత. మా ఇంటి మా లక్ష్మి లా మా ఫ్యామిలీని పరిపూర్ణం చేయడానికి వచ్చిన దేవత అని  శిల్పాశెట్టి తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలియజేసింది. అయితే తాను రెండోసారి సరోగసి ఎందుకు ఎంచుకున్నది అభిమానులతో పంచుకున్నది.

    shilpa shetty, surrogacy, adaptation, surrogacy vs adaptation, shilpa shetty daughter, shilpa shetty daughter name, biological kid, శిల్పా శెట్టి, సరోగసీ, అద్దె గర్భం, శిల్పా శెట్టి కూతురు
    శిల్పా శెట్టి


    మొదటి అబ్బాయి వియాన్ పుట్టిన తర్వాత మాకు ఓ బేబి కావాలని అనిపించింది. నేను గర్భవతిగా ఉన్న సమయంలో అప్లా అనే వ్యాధితో బాధపడ్డాను. దీంతో నాకు రెండు సార్లు గర్భ స్రావం అయింది. అంతేకాదు తన కొడుకుకు ఓ తోబట్టువు ఇవ్వాలని నేను అనుకున్నాను. బిడ్డ కోసం ఎన్నో మార్గాలు వెతికాను. చివరకు సరోగసి ఎంచుకున్నాను. మూడు ప్రయత్నాల తర్వాత ఐదేళ్లకు సమీష పెట్టింది. మొత్తానికి తాను ఎందుకు సరోగసి ఎంచుకున్నది ఎట్టకేలకు అభిమానులకు వెల్లడించింది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Bollywood, Shilpa Shetty, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు