Raj kundra: రాజ్ కుంద్రా ఖాతాలో మరో కొత్త యాప్.. ఏకంగా ఐబీ అధికారితో చేతులు కలిపి?

Raj kundra

Raj kundra: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా పేరు ప్రస్తుతం వార్తల్లో హాట్ టాపిక్ గా మారింది. నీలి చిత్రీకరణ చేస్తున్నట్లు వాటిని ఆన్ లైన్ లో పబ్లిక్ చేస్తున్నట్లు బయటపడగా..

  • Share this:
    Raj kundra: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా పేరు ప్రస్తుతం వార్తల్లో హాట్ టాపిక్ గా మారింది. నీలి చిత్రీకరణ చేస్తున్నట్లు వాటిని ఆన్ లైన్ లో పబ్లిక్ చేస్తున్నట్లు బయటపడగా.. కొందరిని వెబ్ సిరీస్ లో అవకాశాల పేర్లతో అందులోకి లాగి వాళ్లతో కూడా అలాంటి చిత్రాలను తీస్తున్నాడని బయటపడటంతో అతడిని ఇటీవలే ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఇక అప్పటి నుంచి ఇతని గురించి ఏదో ఒక వార్త బయట పడుతూనే ఉంది. ఇదిలా ఉంటే తాజాగా మరో కొత్త యాప్ గురించి మళ్లీ వార్తలు వినిపిస్తున్నాయి.

    నీలి చిత్రాల కోసం రాజ్ కుంద్రా చేసిన హాట్ షాట్స్ అనే యాప్ ను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి తొలగించగా మరో యాప్ తో ప్లాన్ బీ గా క్రియేట్ చేసినట్లు తెలుస్తుంది. అది కూడా బాలి ఫేమ్ అనే పేరుతో ఏర్పాటు చేసినట్లు బయటపడగా ఈ విషయాన్ని ముంబై పోలీసులు మీడియా ముందు తెలిపారు. ఇక ఇంటెలిజెన్స్ బ్యూరో కి చెందిన ఓ అధికారిని కూడా అతనికి తెలియకుండానే రాజ్ కుంద్రా సన్నిహితుడు అతడిని ఇందులో భాగస్వామిని చేశాడు.

    రాజ్ కుంద్రా సన్నిహితుడు యస్ ఠాకుర్ ముందుగానే ఐబీ కి చెందిన అధికారి తో సన్నిహితంగా పరిచయం చేసుకొని మంచి గుర్తింపు తెచ్చుకున్న లఘు చిత్రాలను ప్రసారం చేసేందుకు ఒక యాప్ ను ఏర్పాటు చేద్దామని కోరాడట. దీంతో ఆ ఐబీ అధికారి ఇందులో ఉన్న మోసాన్ని గమనించకుండా తన భార్య పేరు మీద బాలీ ఫేమ్ అనే యాప్ ను రూపొందించగా అందులో అశ్లీల చిత్రాలు అప్ లోడ్ చేయడాన్ని గమనించి ఆ అధికారి వారితో తెలిపాడట. అలా రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన తర్వాత రోజు బాలీ ఫేమ్ యాప్ నుండి అశ్లీల చిత్రాలను తీసివేయమని తమకు చెప్పినట్లు రాజ్ కుంద్రా సంస్థకు చెందిన నలుగురు ఉద్యోగులు తెలిపారని బయటపడింది.

    దీంతో ఈ విషయం ప్రస్తుతం మరింత హాట్ టాపిక్ గా మారగా మరో నటి షెర్లిన్ చోప్రాను విచారణకు హాజరు కావాలని పోలీసులు తెలిపారని తెలుస్తోంది. ఇక మరోవైపు ఈ కేసు పట్ల విచారణ జరపడంలో మహారాష్ట్ర ప్రభుత్వం బాగా నిర్లక్ష్యం చేస్తుందని మహారాష్ట్ర భాజపా నేత ఆశిష్ షెలార్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరిన్ని ఫిర్యాదులు బయటకి రావడంతో ఈ కేసు పట్ల మరింత శ్రద్ధ తీసుకుంటున్నారు పోలీసులు.
    Published by:Navya Reddy
    First published: