Butta Bomma : బుట్ట బొమ్మ పాటకు డాన్స్ ఇరదీసిన హిందీ స్టార్ హీరోయిన్..

Butta Bomma : అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సంక్రాంతి పండుగ సందర్బంగా విడుదలైన అల వైకుంఠపురములో ఓ రేంజ్‌లో విజయం సాధించింది.

news18-telugu
Updated: February 9, 2020, 11:45 AM IST
Butta Bomma : బుట్ట బొమ్మ పాటకు డాన్స్ ఇరదీసిన హిందీ స్టార్ హీరోయిన్..
Twitter
  • Share this:
Butta Bomma : అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సంక్రాంతి పండుగ సందర్బంగా విడుదలైన అల వైకుంఠపురములో ఓ రేంజ్‌లో విజయం సాధించింది. అల వైకుంఠపురములో దెబ్బకు ఇంతకు ముందు ఉన్న నమోదైన నాన్ బాహుబలి రికార్డులన్నీ బద్దలైయాయి. తెలుగులో బాహుబలి సినిమాల తర్వాత హైయేస్ట్ గ్రాసర్‌గా బన్నీ సినిమా నిలిచింది. పండుగ సందర్భంగా విడుదలైన ఈ ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను ఓ రేంజ్‌లో ఆకట్టుకుంది. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటించగా.. మిగితా ప్రధాన పాత్రల్లో టబు, నివేదా పేతురాజ్, సుశాంత్, జయ రామ్, మురళీ శర్మ నటించారు. ఈ సినిమా మరో పెద్ద ఎస్సెట్ థమన్ సంగీతం. సినిమా విడుదల కాక మునుపే ఈ సినిమా పాటలు తెలుగు ప్రజల్నీ విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందుకు తగ్గట్టుగానే సినిమా కామెడీ సీన్స్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఆకట్టుకుంది. సినిమా కథ పాతదే అయిన ట్రీట్ మెంట్ సరిగా ఉండడంతో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. బన్నీ తన నటనతో ఇరగదీశాడు. ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. అది అలా ఉంటే ఈ అల వైకుంఠపురంలో మేనియా హిందీ సినిమా ఇండస్ట్రీ సోకింది. ఈ సినిమాలో ఓ రేంజ్‌లో ఆకట్టుకున్న మాస్ సాంగ్ రాములో.. రాములా. ఈ సాంగ్ యూట్యూబ్‌లో సంచనాలు సృష్టించింది. ఆ సాంగ్‌లో బన్నీ వేసిన దోశ స్టెప్ ఎంత పాపులర్ తెలిసిందే.

Butta Bomma,Ala Vaikunthapurramuloo,Shilpa Shetty dances for allu arjun ala vaikunthapuramloo, butta bomma,బుట్ట బొమ్మ,అల్లు అర్జున్, త్రివిక్రమ్,శిల్పా శెట్టి,Shilpa Shetty,
Twitter


ఆ సినిమాలో అలాంటి మరో హిట్ సాంగ్ బుట్ట బొమ్మ. ఈ సాంగ్ అటు టిక్ టాక్‌లో ఇటూ ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ సందడి చేసింది. ఈ పాటకు స్టెప్ వేసి అలరించింది హిందీ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి. ప్రస్తుతం ఆమె వేసిన బుట్ట బొమ్మ స్టెప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శిల్పా శెట్టి గతంలో తెలుగులో వెంకటేష్‌తో 'సాహాస వీరుడు సాగర కన్య'లో బాలయ్య సరసన 'భలేవాడివి బాసూ'లో నటించిన సంగతి తెలిసిందే.


First published: February 9, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు