Home /News /movies /

SHILPA SHETTY BEATEN HER HUSBAND RAJ KUNDRA VIDEO GO VIRAL ON SOCIAL MEDIA TA

భర్తను చితకబాదిన శిల్పాశెట్టి.. వైరల్ అవుతున్న సాగరకన్య వీడియో..

శిల్పాశెట్టి (Instagram/Photo)

శిల్పాశెట్టి (Instagram/Photo)

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి గురించి సెపెరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. చేతిలో సినిమాలు లేకున్నా.. ఈ మంగళూరు భామ.. తనదైన యోగాసనలతో ఎపుడు అభిమానులతో టచ్‌లో ఉంటుంది. తాజాగా ఈమె తన భర్తను కొడుతున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.



    బాలీవుడ్ నటి శిల్పాశెట్టి గురించి సెపెరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. చేతిలో సినిమాలు లేకున్నా.. ఈ మంగళూరు భామ.. తనదైన యోగాసనలతో ఎపుడు అభిమానులతో టచ్‌లో ఉంటుంది. శిల్పాశెట్టికి కేవలం హిందీ ఇండస్ట్రీతోనే కాదు.. తెలుగులోనూ ఈ భామ పలు చిత్రాల్లో నటించి ఇక్కడ ప్రేక్షకులను కూడా పలకరించింది. రీసెంట్‌గా ఈమె ఒక ఆడబిడ్డకు సరోగసి ద్వారా జన్మించింది. అలా ఎందుకు చేయించిందో చెప్పుకొచ్చింది. ఎప్పటి కపుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకునే శిల్పాశెట్టి.. ఇప్పటికే ఇండస్ట్రీకి వచ్చినపుడు ఎలా వచ్చిందో ఇప్పటికీ అదే ఫిజిక్ మెయింటేన్స్ చేస్తోంది. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రస్తుతానికి అందరిలాగే ఈమె కూడా ఇంటికే పరిమితమైంది. తాజాగా అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠపురములో సినిమాలోని బుట్టబొమ్మ సాంగ్‌కు డాన్స్ చేసి అందరినీ ఆశ్యర్యపరిచింది. తాజాగా ఈమె తన భర్తను చితకబాదే వీడియోను పోస్ట్ చేసి నెటిజన్లను మరోసారి ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేసింది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన వీడియోలో శిల్పాశెట్టికి ఆమె భర్త ముద్దు పెడుతుంటే.. పని చేసేటపుడు ఇలాంటి పనులు చేస్తే తనకు కోసం అంటూ.. మరో వేషంలో వచ్చి చితకబాదింది. ఇపుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.




    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Bollywood, Shilpa Shetty, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు