Shershaah Trailer Talk: సిద్దార్ధ్ మల్హోత్ర, కియారా అద్వానీ ‘షేర్షా’ ట్రైలర్ విడుదల.. వెండితెరపై మరో కార్గిల్ యుద్ధ వీరుని కథ..

సిద్ధార్ధ్ మల్హోత్ర ‘షేర్షా’ ట్రైలర్ టాక్ (Twitter/Photo)

Shershaah Trailer Talk: ప్రస్తుతం బాలీవుడ్‌లో నిజ జీవిత ఘటనల ఆధారంగా పలు చిత్రాలు తెరకెక్కుతున్నాయి. తాజాగా కార్గిల్ యుద్ధ వీరుడు విక్రమ్ బాత్రా జీవిత కథ ఆధారంగా ‘షేర్షా’ సినిమా తెరకెక్కింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.

  • Share this:
    Shershaah Trailer Talk: ప్రస్తుతం బాలీవుడ్‌లో నిజ జీవిత ఘటనల ఆధారంగా పలు చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే 1962 భారత్, చైనా యుద్ధ నేపథ్యంతో పాటు 1971 భారత్, పాకిస్థాన్ యుద్ధ నేపథ్యంలో పలు చిత్రాలు తెరకెక్కాయి. ఇప్పటికే బంగ్లాదేశ్ విముక్తి పోరాట నేపథ్యంలో అజయ్ దేవ్‌గణ్ హీరోగా ‘భుజ్’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను హాట్ స్టార్‌లో ఆగష్టు 13న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదల చేయనున్నారు. మరోవైపు 1999లో జరిగిన కార్గిల్ యుద్దంలో శౌర్య పరాక్రమాలు చూపించి ఆర్మీ కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవిత కథ ఆధారంగా ‘షేర్షా’ సినిమా తెరకెక్కింది. గతంలో కార్గిల్ యుద్ధ నేపథ్యంలో ‘LOC’ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే కదా. రీసెంట్‌గా ‘గుంజన్ సక్సేనా’ కూడా 1999 కార్గిల్ యుద్ధ నేపథ్యంలో తెరకెక్కింది. తాజాగా 1999 భారత్, పాకిస్థాన్ యుద్ధంలో మన దేశం విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ విక్రమ్ బాత్రా ఎలాంటి పోరాటం చేసారనేది ఈ సినిమాలో చూపించనున్నారు. పాకిస్థాన్ ముష్కర మూకలపై శౌర్య ప్రతాపాలు చూపించిన విక్రమ్ బాత్రాకు ప్రభుత్వం పరమవీర చక్రతో గౌరవించింది.

    తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విజయ్ దివస్‌ సందర్భంగా విడుదల చేశారు.  ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఆనాటి యుద్ధ సన్నివేశాలను కళ్లకు కట్టినట్టు చూపించారు.  సన్నివేశాలు రియలిస్టిక్‌గా ఉన్నాయి. ఈ సినిమాను ఆగష్టు 12న స్వాతంత్య్ర దినోత్సవ కానుగా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.

    ఈ సినిమాలో సిద్ధార్ధ్ మల్హోత్ర విక్రమ్ బాత్రా తన కోడ్ నేమ్ ‘షేర్షా’ పేరుతో పిలుస్తుంటారు. కార్గిల్ యుద్ధంలో తోటి సైనికుల్లో స్పూర్తి రగిలించే విక్రమ్ బాత్రాగా సిద్ధార్థ్ నటన బాగుంది. ఈ సినిమాలో సిద్ధార్ధ్ మల్హోత్ర .. విక్రమ్ బాత్రాగా, విశాల్ బాత్రాగా రెండు పాత్రల్లో అలరించనున్నారు. ఈయన కాబోయే భార్య డింపుల్ చీమా పాత్రలో కియారా అద్వానీ నటించింది. ఈ సినిమాను పవన్ కళ్యాణ్‌తో ‘పంజా’ సినిమాను తెరకెక్కించిన విష్ణువర్ధన్ తెరకెక్కించారు. ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్‌తో పాటు క్యాష్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా తెరకెక్కించారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: