Home /News /movies /

SHEKAR RAJASEKHARS FILM WILL BE RELEASE ON MAY 20TH SB

Sekhar: వచ్చేనెలలోనే రాజ‘శేఖర్’ కొత్త సినిమా విడుదల

రాజశేఖర్ ‘శేఖర్’ మూవీలో శివానీ రాజశేఖర్ (Instagram/Photo)

రాజశేఖర్ ‘శేఖర్’ మూవీలో శివానీ రాజశేఖర్ (Instagram/Photo)

జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పిస్తున్నారు. వచ్చేనెలలో ఈ సినిమా విడుదల అయ్యేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

    టాలీవుడ్‌లో సినిమా పండగ నెలకొంది. వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. తాజాగా సీనియర్ హీరో రాజశేఖర్ సినిమా ఒకటి విడుదలకు సిద్ధమవుతోంది. రాజశేఖర్ నటిస్తున్న తాజా చిత్రం శేఖర్(Sekhar). మలయాళంలో సూపర్ హిట్టైన క్రైం అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోసెఫ్‌ కు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది. ఇక తాజాగా ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. మే 20వ తేదిన శేఖర్(Sekhar) సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, పోస్టర్స్ ఈ సినిమాపై భారీ అంచనాలను రేకెత్తించాయి. దీంతో సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    జీవితా రాజశేఖర్(Jeevitha Rajasekhar) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో, పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఆత్మీయ రాజన్, కన్నడ కిశోర్, ముస్కాన్, భరణి, రవి శర్మ, సమీర్ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్(Anup Rubens) సంగీతం అందించారు. ఈ చిత్రం నుంచి వచ్చిన 'లవ్ గంటే...' పాట శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది. రాజశేఖర్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ తో కొత్తగా కనిపిస్తుండడం పట్ల అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

    శేఖర్(Sekhar) చిత్రాన్ని సంక్రాంతి సీజన్ లో రిలీజ్ చేయాలని భావించినా,అది కాస్త కుదరలేదు. ఇన్నాళ్లకు రిలీజ్ డేట్ ను చిత్రబృందం కన్ఫర్మ్ చేసింది. ఇది రాజశేఖర్ కెరీర్ లో 91వ చిత్రం. "వాడెప్పుడైనా మనం చెప్పింది చేశాడా... వాడు చేసేది ఎప్పుడైనా మనకు చెప్పాడా" అంటూ సాగే కొన్ని డైలాగులు 'శేఖర్' (Sekhar)పాత్ర స్వభావాన్ని వివరిస్తున్నాయి. కల్కి సినిమాతో హిట్ అందుకున్న యాంగ్రీ యంగ్ మ్యాన్ ఈ సినిమాతో కూడా హిట్ అందుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. మరి మే లో స్టార్ హీరో సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఆ సినిమాల మధ్యలో శేఖర్ ఎలాంటి విజయాన్ని అందుకోనుందో చూడాలి.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Dr Rajashekar, Jeevitha rajasekhar

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు