Home /News /movies /

SHEKAR PRE RELEASE EVENT DIRECTOR SUKUMAR EMOTIONAL SPEECH AND GODD WORDS ABOUT RAJASHEKHAR AND SAYS HIS FAVORATE HERO TA

Shekar Pre Release Event : రాజశేఖర్ నా ఫేవరేట్ హీరో.. ఆయన ఇన్‌స్ప్రేషన్‌తోనే ఇండస్ట్రీకి వచ్చాను సుకుమార్..

రాజశేఖర్, సుకుమార్ (Twitter/Photo)

రాజశేఖర్, సుకుమార్ (Twitter/Photo)

Shekar Pre Release Event : రాజశేఖర్ నా ఫేవరేట్ హీరో.. ఆయన ఇన్‌స్ప్రేషన్‌తోనే ఇండస్ట్రీకి వచ్చానన్నారు సుకుమార్. తాజాగా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో సుకుమార్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

  Shekar Pre Release Event :  యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘శేఖర్’. జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఈ మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు దర్శకుడు సుకుమార్‌తో పాటు ప్రశాంత్ వర్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో దర్శకుడిగా నేను అడుగు పెట్టడానికి కారణం రాజశేఖర్. ఆయనకు నేను వీరాభిమానిని. ఆయన చేసిన ఆహుతి, అంకుశం, మగాడు, అక్క మొగుడు, ఆగ్రహం, తలంబ్రాలు  వంటి చిత్రాలు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయన్నారు. చదువుకునే రోజుల్లో నేను ఆయనలా ఇమిటేట్ చేసేవాణ్ణి. నా పెర్ఫామెన్స్ మెచ్చి అందరూ వన్స్‌మోర్ అనేవారు. అలా నేను ఫేమస్ అయిపోయానన్నారు. నేను సినిమాల్లోకి వెళ్లి ఏదైనా చేయగలిగే నమ్మకం కలిగిందేకు అపుడు రాజశేఖరే కారణమయ్యారు.

  చాలా మంది పిల్లలు ఇండస్ట్రీకి దూరంగా ఉంచాలనుకుంటారు. కానీ రాజశేఖర్ తన ఇద్దరి కూతుళ్లను హీరోయిన్స్‌గా పరిచయడం మాములు విషయం కాదన్నారు. ఈ విషయంలో ఆయనకు చేతులెత్తి నమస్కారం చేస్తునన్నారు. దర్శకత్వంలో అనేది అంత ఈజీ కాదు. అలాంటి టాస్క్‌ను జీవిత పూర్తిచేయడం  కూడా అంత ఈజీ కాదు. జీవిత గారి కోసమైనా ఈ సినిమా విజయం సాధించాలని కోరకుంటున్నారు. ఈ సినిమాకు రామజోగయ్య శాస్త్రి అందించిన సంగీతం అద్భుతంగా ఉందన్నారు.

  Balakrishna - Dil Raju : ఫ్లాప్ డైరెక్టర్‌తో దిల్ రాజు నిర్మాణంలో బాలకృష్ణ క్రేజీ ప్రాజెక్ట్..


  రాజశేఖర్.. కెరీర్‌లో ఎన్నో ఎత్తు పల్లాలు ఎన్నున్నా...హిట్ లు ,ప్లాప్ లు లెక్కచేయకుండా తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తున్న హీరో రాజశేఖర్. ఇక హీరోగా వరుస ఫ్లాపుల్లో ఉన్నపుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేసిన ‘PSV గరుడవేగ’ (PSV Garudavega) సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కారు ఈ యాంగ్రీమ్యాన్. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘కల్కి’ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చి పర్వాలేదనిపించారు. అంతేకాదు ఆ మధ్య కరోనా బారినపడి.. చాలా రోజుల తర్వాత కోలుకున్నారు. ఆ తర్వాత ‘శేఖర్’ అనే కొత్త సినిమాను ఈ నెల 20న విడుదల చేయనున్నారు. ఈ సినిమాను లలిత్ అనే కొత్త దర్శకుడుతో ప్రారంభమైన జీవితా రాజశేఖర్ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఈ సినిమాను వేరే నిర్మాతలతో కలిసి రాజశేఖర్ కూతుళ్లైన శివానీ, శివాత్మిక నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాజశేఖర్ పెద్ద తనయ శివానీ రాజశేఖర్ .. ఆయన కూతురు పాత్రలో నటించడం విశేషం.

  హీరోగా రాజశేఖర్‌కు 91వ సినిమా. ‘శేఖర్’ (Shekar) మూవీ మలయాళంలో హిట్టైన ఓ క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆధారంగా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రాజశేఖర్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో అదరగొట్టారు.  ఈ సినిమాలో రాజశేఖర్ సరసన ముస్కాన్ కూబ్‌చాందిని హీరోయిన్‌గా నటించింది. తాజాగా ఈ సినిమాను థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే.. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఒక కేసు ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్‌గా  తెరకెక్కించారు. ఇందులో రాజశేఖర్ లుక్‌తో పాటు నటన బాగుంది. ఆమె కూతురుగా శివానీ యాక్ట్ చేయడం విశేషం.

  NBK 107 సెట్స్‌లో దర్శకుడు గోపీచంద్ మలినేని, తమన్‌తో బాలకృష్ణ లేటెస్ట్ పిక్.. సోషల్ మీడియాలో వైరల్..

  ఈ  సినిమాలో రాజశేఖర్ పోలీస్  ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా నటించారు. ఈ చిత్రంలో రాజశేఖర్  సిగరెట్ వెలిగించి బుల్లెట్ బండిపై వచ్చే సీన్ హైలెట్‌గా ఉంది. ఈ సినిమాతో  ఈయన  మరో హిట్టు కొట్టేలా కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో రాజశేఖర్ సరసన ముస్కాన్, అను సితార కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజశేఖర్‌కు హిట్ అనేది కంపల్సరీ. ఈ సినిమా కోసం రాజశేఖర్ 60 యేళ్ల వయసులో కొన్ని రిస్కీ షాట్స్ చేసినట్టు సమాచారం. ఇక ఈ సినిమా ఔట్ పుట్ పై రాజశేఖర్ కాన్ఫిడెన్స్‌గా ఉన్నాడట. నిజానికి ‘గరుడవేగ’తో రాజశేఖర్‌కి ఫుల్ క్రేజ్ వచ్చింది. రాజశేఖర్.. వెంకటేష్ మహా దర్శకత్వంలో ‘మర్మాణువు’ అనే టైటిల్‌తో కొత్త సినిమాను ప్రకటించడమే కాకుండా.. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌‌ను విడుదల చేసారు. ఈ పోస్టర్‌లో ఒక పుర్రెకు తలపాగా చుట్టారు. ఈ  లుక్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగేలా చేసారు. ఈ సినిమాను కూడా రాజశేఖర్ వేరే నిర్మాతలతో కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.
  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Dr Rajashekar, Shekar Movie, Sukumar, Tollywood

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు