ఆ పనిచేయలేక 8 నెలలు ఖాళీ.. మీటూ అంటున్న హీరోయిన్

2006లో మమ్ముట్టి సరసన, మలయాళ చిత్రం ప్రజాపతితో అదితిరావ్ వెండితెరకు పరిచయం మైంది.

news18-telugu
Updated: January 7, 2019, 11:09 AM IST
ఆ పనిచేయలేక 8 నెలలు ఖాళీ.. మీటూ అంటున్న హీరోయిన్
అదితి రావ్ హైదరీ
  • Share this:
సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై చాలామంది నోరువిప్పారు. క్యాస్టింగ్ కౌచ్‌పై మీటూ గళం వినిపించారు. తాజాగా మరో హీరోయిన్తాజాగా మీటూ అంటుంది. అదితీరావ్ హైదరీ.. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్. 2006లో మమ్ముట్టి సరసన, మలయాళ చిత్రం ప్రజాపతితో వెండితెరకు పరిచయం మైంది.

అదితి రావ్ హైదరీ


ఈ సినిమాలో దేవదాసీ పాత్రలో ఆమె నటనకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఎక్కువగా తమిళ్, హిందీ సినిమాల్లో అదితి నటించింది. 2011లో సుధీర్ మిశ్రా దర్శకత్వంలో ఆమె నటించిన యే సాలీ జిందగీ సినిమాతో ఆమె మరింత ప్రజాదరణ సంపాదించింది.

అదితి రావ్ హైదరీ


టాలీవుడ్‌లో సమ్మోహనం సినిమా ద్వారా అందర్నీ సమ్మోహన పరిచిన అదితీరావ్‌ హైదరి కూడా గతంలో క్యాస్టింగ్ కౌచ్ బారిన పడిందని చెబుతోంది. సినిమా ఇండస్ట్రీలో ఇలా ఉంటుందని కూడా తాను అప్పట్లో ఊహించలేదని చెబుతుందీ ముద్దుగుమ్మ. ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో ఓ ప్రాజెక్టు విషయంలో తనను కమిట్‌మెంట్‌ అడిగారట .

Rewind 2018: New Actress in Tollywood 2018.. అప్పుడే 2018 చివ‌రికి వ‌చ్చేసింది. మ‌రో ప‌ది రోజుల్లో కొత్త ఏడాదికి స్వాగ‌తం ప‌లుకుతాం. దాంతో ఈ ఏడాది ఏమేం జ‌రిగిందో ఒక్క‌సారి మ‌ళ్లీ రివైండ్ చేసుకుందాం. ఎప్పుడూ కొర‌త ఉండే హీరోయిన్ల క‌ష్టాలు మాత్రం కాస్త 2018లో తీరాయ‌ని చెప్పొచ్చు. కైరా అద్వాని, రష్మిక మందన్న, పాయల్ రాజ్‌పుత్ లాంటి ముద్దుగుమ్మలు ఇదే ఏడాది వచ్చారు. New Actress in Tollywood 2018,telugu new actress 2018,rashmika mandanna ,rashmika mandanna 2018 movies,kiara advani,kiara advani movies,nidhi agarwal ,nidhi agarwal movies,payal rajput,payal rajput movies,aditi rao hydari,aditi rao hydari movies,sobhita dhulipala,sobhita dhulipala goodachari movie,telugu cinema,రష్మిక మందన్న,కైరా అద్వానీ,అదితి రావ్ హైదరీ,పాయల్ రాజ్‌పుత్,శోభితా ధూళిపాల,నిధి అగర్వాల్,తెలుగు సినిమా,టాలీవుడ్ 2018 కొత్త హీరోయిన్లు
అదితి రావ్ హైదరీ సమ్మోహనం ట్విట్టర్ ఫోటో


ఆ కమిట్‌మెంట్‌ ఆఫర్ విని అదితి ఆశ్చర్యపోయింది. ఆ పనిచేయలేక.. ఆ ప్రాజెక్టుకు బైబై చెప్పేసింది. . ఆ తర్వాత దాదాపు 8 నెలలపాటు అదితి రావు సినిమాలో ఛాన్సులు రాక ఖాళీగా ఉండాల్సి వచ్చిందని చెప్పింది . అన్నాళ్లు ఖాళీగా ఉన్నందుకు ఇబ్బంది లేకపోయనా ఇండస్ట్రీలో ఇలాంటి కమిట్‌మెంట్స్ అడిగినందుకు అదితీరావ్ చాలా ఫీల్ అయిపోయింది.అయితే ఆ సంఘటన తర్వాత తనకు మళ్లీ ఇండస్ట్రీలో ఎక్కడా ఇబ్బందులు రాలేదని చెబుతోంది. కేరీర్ ప్రారంభంలో మాత్రమే కాస్త సమస్యలు ఎదుర్కొంది.
First published: January 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading