Sharwanand : ఎన్టీఆర్‌ను ఫాలో అవుతోన్న శర్వానంద్.. విజయం సాధిస్తాడా....

Sharwanand : విలనీ అనేది టాలీవుడ్ లో ఇప్పుడు ట్రెండీగా మారింది. అందుకే హీరోయిజమ్ పక్కన పెడుతున్నారు కథానాయకులు

news18-telugu
Updated: August 4, 2020, 9:01 PM IST
Sharwanand : ఎన్టీఆర్‌ను ఫాలో అవుతోన్న శర్వానంద్.. విజయం సాధిస్తాడా....
Instagram
  • Share this:
విలనీ అనేది టాలీవుడ్ లో ఇప్పుడు ట్రెండీగా మారింది. అందుకే హీరోయిజమ్ పక్కన పెడుతున్నారు కథానాయకులు. జై లవకుశ కోసం తారక్, గద్దలకొండ గణేష్ లో వరుణ్ తేజ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించి సర్ ప్రైజ్ చేసారు. హీరోయిజమ్ కు దూరంగా పూర్తి విలనీ యాంగిల్ చూపించి మెప్పించారు. బాక్సాఫీస్ దగ్గర కూడా భారీ వసూళ్లను కొల్లగొట్టారు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నాని నటించిన 25వ చిత్రం వీలో నేచురల్ స్టార్ కూడా విలన్ రోల్ చేసాడు. సమ్మర్ కానుకగా రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా ఎఫెక్ట్ తో విడుదల వాయిదా పడింది. కమెడియన్ సునీల్ కూడా డిస్కో రాజాలో తనలోని ప్రతినాయకుడిని బయటపెట్టి ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం శర్వా కూడా విలన్ రోల్ లో మెప్పించేందుకు సిద్ధమవుతున్నాడు. ఆర్ ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి ప్రస్తుతం మహాసముద్రం అనే సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ మూవీలో శర్వానంద్, బొమ్మరిల్లు ఫేమ్ సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తున్నారు. పైగా వీరిద్దరు ప్రాణ స్నేహితులుగా కనిపించబోతున్నట్లు సమాచారం. ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించడంతో అనుకోని పరిస్థితులు వల్ల వైరం మొదలవుతుందట. ముఖ్యంగా సెకండాఫ్ తన ప్రేమికురాలి ప్రేమను దక్కించుకునేందుకు ఈ ఇద్దరు హీరో మధ్య నువ్వా నేనా రేంజ్ లో స్కెచ్చులు ఉంటాయట. మహా క్యారెక్టర్ లో శర్వా, సముద్రం పాత్రలో సిద్దార్ధ్ కనిపించబోతున్నారని వినికిడి.

ఇక ఈ మూవీలో నటించే హీరోయిన్ రోల్ చాలా కీలకం దాంతో దర్శకుడు అజయ్ మొదట సమంత డేట్స్ కోసం ట్రై చేసాడు కానీ స్యామ్ ఇతర ప్రాజెక్టుల్లో బిజీగా ఉండటంతో తప్పుకుంది. ప్రస్తుతం సాయి పల్లవి , రాశీ ఖన్నా, అదితీరావ్ హైదరీ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరి పేరు ఖరారు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎప్పటికప్పుడు డిఫరెంట్ రోల్స్ ఎంచుకుంటూ సర్ ప్రైజ్ చేసే శర్వా ఈసారి ఏకంగా విలనీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆశ్చర్యపరుస్తోంది. అజయ్ భూపతి తెరకెక్కించిన మొదటి చిత్రం ఆర్ ఎక్స్ 100లో పాయల్ రాజ్ పుత్ విలన్ రోల్ సూపర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ తాజా కొత్త సినిమాలో హీరోని ప్రతినాయకుడిగా చూపించి ప్రేక్షకులను మెప్పించాలనుకుంటున్నాడు అజయ్.

జాను తర్వాత శర్వానంద్ ప్రస్తుతం శ్రీకారం అనే సినిమాలో నటిస్తున్నాడు. నెక్ట్స్ సంక్రాంతికి రిలీజ్ కు ఈ యూనిట్ రెడీ అవుతంది. ఆ తర్వాత శ్రీకార్తిక్ అనే కొత్త దర్శకుడితోనూ ఒక బైలింగువల్ మూవీ చేస్తున్నాడు శర్వా. ఈ సినిమా తో పాటే కిషోర్ తిరుమలతో ఒక మూవీ చేయాల్సి ఉంది. ఈ లిస్ట్ లో ఇప్పుడు అజయ్ భూపతి వచ్చాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు మహా సముద్రం బ్యాచ్ రెడీ అవుతోంది.
Published by: Suresh Rachamalla
First published: August 4, 2020, 9:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading