Home /News /movies /

SHARWANAND STARRER OKE OKA JEEVITHAM RELEASE DATE ANNOUNCED SB

Sharwanand: శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే.. !

శర్వానంద్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ కలెక్షన్స్ (Twitter/Photo)

శర్వానంద్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ కలెక్షన్స్ (Twitter/Photo)

శాస్త్రవేత్త అయిన నాజర్ టైమ్ మెషీన్‌ను కనిపెట్టడానికి ప్రయోగాలు చేస్తాడు. మీ అమ్మను చూస్తావా అంటూ.. వచ్చిన టీజర్ ఆకట్టుకుంటుంది. శర్వానంద్ తల్లిగా అమల అక్కినేని నటించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ (Aadavallu Meeku Johaarlu) సినిమాతో పాటు శర్వానంద్ ఇటీవలే కనిపించాడు. అయితే ఈ సినిమా శర్వానంద్‌కు సక్సెస్ ఇవ్వలేకపోయింది. దీంతో ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా  ‘ఒకే ఒక జీవితం’ అనే సినిమా కూడా చేస్తున్నారు. ఈ చిత్రంలో అక్కినేని అమల మరో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఇది శర్వాకు 30వ సినిమా కావడం గమనార్హం. నూత‌న ద‌ర్శ‌కుడు శ్రీ కార్తిక్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఎస్ ఆర్ ప్ర‌కాశ్ బాబు, ఎస్ ఆర్ ప్ర‌భు నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి త‌రుణ్ భాస్క‌ర్ డైలాగ్స్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల‌ చేసింది చిత్ర యూనిట్‌.

    ఈ చిత్రానికి ‘ఒకే ఒక జీవితం’ అనే టైటిల్‌ను క‌న్ఫ‌ర్మ్ చేశారు మేకర్స్‌.సైన్స్‌ ఫిక్ష‌న్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, అమ్మ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు చిత్ర యూనిట్. సెప్టెంబర్ 9న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ఈరోజు అధికారికంగా ప్రకటించింది. రిలీజ్ గ్లింప్స్ శర్వానంద్‌ని నిరాశలో ఉన్న ఓ సంగీతకారుడిగా చూపించారు.

    శాస్త్రవేత్త అయిన నాజర్ టైమ్ మెషీన్‌ను కనిపెట్టడానికి ప్రయోగాలు చేస్తాడు. చివరి విజువల్స్‌లో శర్వానంద్ తన స్కూల్ డేస్‌లో తన తల్లితో ఫోటో తీయడం మరియు నేపథ్యంలో అమ్మ పాట సీక్వెన్స్‌కు ఎమోషనల్ టచ్ ఇస్తుంది. ఈ చిత్రంలో శర్వానంద్ తల్లిగా అమల అక్కినేని నటిస్తుండగా, ఇక హీరోయిన్ గా రీతూ వర్మ నటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రం ద్వారా తెలుగు లోకి అడుగుపెడుతోంది, దీనికి జేక్స్ బిజోయ్ సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు. తమిళంలో కణం పేరుతో ఏకకాలంలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Amala Akkineni, Sharwanand

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు