Home /News /movies /

SHARWANAND SIDDHARTH MAHA SAMUDRAM STREAMING ON NETFILX SR

Maha Samudram : ప్రముఖ ఓటీటీలో మహా సముద్రం.. ఈరోజు నుంచే స్ట్రీమింగ్..

Maha Samudram Photo : Twitter

Maha Samudram Photo : Twitter

Maha Samudram :ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా మిగిలింది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.

ఇంకా చదవండి ...
    ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి (Ajay bhupathi) దర్శకత్వంలో ప్రతిష్టాతక్మంగా తెరకెక్కిన తాజా చిత్రం ‘మహా సముద్రం’  (Maha Samudram). లవ్ అండ్ యాక్షన్ జానర్‌లో వచ్చిన ఈ చిత్రంలో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా (Sharwanand) (Siddharth) నటించారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా మిగిలింది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. మహా సముద్రం ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఫ్లాట్ ఫామ్‌లో ఈరోజు నుంచి స్ట్రీమ్ అవుతోంది. నెట్ ఫిక్ల్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను దాదాపు పదకొండు కోట్లకు కొన్నట్లు సమాచారం.

    ట్రైలర్స్‌తో ఆకట్టుకున్న ఈ సినిమా ఎందుకో థియేటర్‌లో అంచనాలను అందుకోలేకపోయింది. చూడాలి మరి ఓటీటీలో ఎలా ఆకట్టుకోనుందో.. మహా సముద్రంలో హీరో శర్వానంద్.. సిద్ధార్థ్ కలిసి నటించారు. వీరికి జంటగా అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించారు.


    ఈ సినిమాతో తమిళ నటుడు సిద్ధార్థ్ టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చారు. ఒకప్పుడు తెలుగులో మంచి పాపులారిటీ దక్కించుకున్న సిద్ధార్థ్ ప్రస్తుతం తెలుగులో సినిమాలు ఏవీ చేయడం లేదు. దాదాపు ఏడేళ్ళ గ్యాప్ తరువాత మళ్లీ ‘మహా సముద్రం’ అంటూ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆయన తెలుగులో నటించిన బొమ్మరిల్లు, ఆట, నువ్వొస్తానంటే నేనొద్దంటానా మొదలగు చిత్రాలతో సూపర్ క్రేజీ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఏడేళ్ల తర్వాత టాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చిన సిద్ధార్థ్‌కు సరైన హిట్ పడలేదని కొంత అప్ సెట్ అయ్యారట. అయితే ఆయనకు ఓ తెలుగు సినిమాలో మరో మంచి అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.

    Nithiin | Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌తో పోటీకి రెడీ అంటోన్న నితిన్.. చివరి వరకు ఉంటారా...

    ఇక మహా సముద్రం విషయానికి వస్తే.. ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చగా.. జగపతిబాబు, రావు రమేష్, గరుడ రామ్ కీలకమైన పాత్రల్లో కనిపించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర నిర్మించారు.

    శర్వానంద్ సినిమాల విషయానికి వస్తే.. మహా సముద్రం కంటే ముందు "శ్రీకారం" అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన శ్రీకారం సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. థియేటర్ లో విడుదలైన ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయినప్పటికీ ఓటీటీ విడుదలై మంచి ఆదరణ పొందింది. ఇక మహా సముద్ర తర్వాత శర్వానంద్ ప్రస్తుతం "ఒకే ఒక జీవితం", "ఆడాళ్లు మీకు జోహార్లు" వంటి సినిమాలలో నటిస్తున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Maha Samudram, Netflix, Sharwanand, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు