ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి (Ajay bhupathi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మహా సముద్రం’ (Maha Samudram). లవ్ అండ్ యాక్షన్ జానర్‌లో వస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా (Sharwanand) (Siddharth) నటిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఫస్ట్ లుక్, టీజర్‌లతో మంచి అంచనాలను ఏర్పరచుకున్న ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 14వ తేదీన (Maha Samudram release for dussehra) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని చిత్రబృందం ప్రకటించింది. అందులో భాగంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రదర్శక నిర్మాతలు. ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చగా.. జగపతిబాబు, రావు రమేష్, గరుడ రామ్ కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. శర్వానంద్, సిద్ధార్థ్‌ల సరసన అదితీ రావు హైదరీ, అనూ ఇమ్మాన్యుయేల్ (Aditi Rao Hydari), (Anu Emmanuel)నటిస్తున్నారు.
ఇక ఈ సినిమాతో తమిళ నటుడు సిద్ధార్థ్ టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఒకప్పుడు తెలుగులో మంచి పాపులారిటీ దక్కించుకున్న సిద్ధార్థ్ ప్రస్తుతం తెలుగులో సినిమాలు ఏవీ చేయడం లేదు. దాదాపు ఏడేళ్ళ గ్యాప్ తరువాత మళ్లీ ‘మహా సముద్రం’ అంటూ వస్తున్నారు. ఆయన తెలుగులో నటించిన బొమ్మరిల్లు, ఆట, నువ్వొస్తానంటే నేనొద్దంటానా మొదలగు చిత్రాలతో సూపర్ క్రేజీ తెచ్చుకున్నారు.
Our Intense & #ImmeasurableLove ❤️?Tale is ready to hit your Hearts ?#MahaSamudram ? Journey
in Theatres Begins from
??? ???? ??
An @DirAjayBhupathi FILM ?@Actor_Siddharth @aditiraohydari @ItsAnuEmmanuel @AnilSunkara1 @chaitanmusic @AKentsOfficial pic.twitter.com/lQJGYg1yF8
— Sharwanand (@ImSharwanand) August 27, 2021
మహా సముద్రం సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఆగష్టు 19న విడుదల కావాల్సి ఉంది. కరోనా పరిస్థితుల్లో విడుదల వాయిదా పడింది. కాగా ఈ మధ్య కరోనా కేసులు తగ్గడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు సినిమాల విడుదలకు అనుమతి ఇవ్వడంతో ఇప్పటికే పలు సినిమాలు విడుదలైయ్యాయి. ఈ నేపథ్యంలో మహా సముద్రం దసరా కానుకగా అక్టోబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. అయితే ఇప్పటికే దసరా బరిలో బాలయ్య అఖండ బరిలో ఉందని సమాచారం అందుతోంది. ఇక శర్వానంద్ విషయానికి వస్తే.. ఆయన ఇటీవల శ్రీకారం అనే సినిమాతో వచ్చాడు. సినిమా కథ, కథనం బాగున్నా... థియేటర్స్‌లో ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీలో విడుదలై మంచి టాక్‌ను తెచ్చుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hero siddarth, Sharwanand, Tollywood news