హోమ్ /వార్తలు /సినిమా /

Maha Samudram: షూటింగ్ పూర్తి చేసుకున్న శర్వానంద్, సిద్ధార్థ్‌ల మహా సముద్రం..

Maha Samudram: షూటింగ్ పూర్తి చేసుకున్న శర్వానంద్, సిద్ధార్థ్‌ల మహా సముద్రం..

Mahasamudram Poster Photo : Twitter

Mahasamudram Poster Photo : Twitter

Maha Samudram: అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్ధార్ధ్‌లు హీరోలుగా వస్తున్న మహా సముద్రం.. షూటింగ్ పూర్తి చేసుకుంది.

ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం ‘మహా సముద్రం’. లవ్ అండ్ యాక్షన్ జానర్‌లో వస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్ హీరోగా నటిస్తున్నారు. మరో హీరోగా సిద్ధార్థ్ నటిస్తున్నారు. మంచి అంచనాలతో వస్తున్న ఈ చిత్రం షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. కాగా ఇటీవల కరోనా కేసులు తగ్గడంతో షూటింగ్ రీస్టార్ట్ చేసింది చిత్రబృందం. కాగా ఈ సినిమా ఈరోజుతో షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసుకుందని ప్రకటించింది. ఇక ఈ సినిమాతో తమిళ నటుడు సిద్ధార్థ్ టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఒకప్పుడు తెలుగులో మంచి పాపులారిటీ దక్కించుకున్న సిద్ధార్థ్ ప్రస్తుతం తెలుగులో సినిమాలు ఏవీ చేయడం లేదు. దాదాపు ఏడేళ్ళ గ్యాప్ తరువాత మళ్లీ ‘మహా సముద్రం’ అంటూ వస్తున్నారు. ఆయన తెలుగులో నటించిన బొమ్మరిల్లు, ఆట, నువ్వొస్తానంటే నేనొద్దంటానా మొదలగు చిత్రాలతో సూపర్ క్రేజీ తెచ్చుకున్నారు. అయితే ఆ తర్వాత ఆయన నటించిన సినిమాలు పెద్దగా అలరించకపోవడంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి. ఇక ఇన్నేళ్ల తర్వాత సిద్దార్థ్ మరోసారి తెలుగులో నటిస్తున్నా రు. చూడాలి ఈ సినిమా ఎలా ఉండనుందో..

ఇక మ‌హా స‌ముద్రం విషయానికి వస్తే.. ఈ చిత్రంలో సిద్ధార్థ్‌తో పాటు మరో ప్రధాన పాత్రలో శర్వానంద్ నటిస్తున్నారు. అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఆగష్టు 19న విడుదల కావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో విడుదల వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు. ఈ విషయంలో అధికారిక ప్రకటన విడుదలకావాల్సి ఉంది. ఇక శర్వానంద్ విషయానికి వస్తే.. ఆయన ఇటీవల శ్రీకారం అనే సినిమాతో వచ్చాడు. సినిమా కథ, కథనం బాగున్నా... థియేటర్స్‌లో ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీలో విడుదలై మంచి టాక్‌ను తెచ్చుకుంది.

First published:

Tags: Hero siddarth, Mahasamudram film, Sharwanand

ఉత్తమ కథలు