SHARWANAND RASHMIKA MANDANNA AADAVALLU MEEKU JOHAARLU TRAILER OUT AND HERE THE REVIEW PK
Aadavallu Meeku Johaarlu trailer review: ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ట్రైలర్ టాక్.. ఎక్కడ దొరికావురా సామి నువ్వు నాకు..!
ఆడవాళ్లు మీకు జోహార్లు ట్రైలర్ రివ్యూ (adavallu meeku joharlu)
Aadavallu Meeku Johaarlu trailer review: తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ హీరోలలో శర్వానంద్ (Sharwanand) కూడా ఒకడు. అయితే ఈ మధ్య ఈయన అదృష్టం మాత్రం వెక్కిరిస్తుంది. వరస సినిమాలు చేస్తున్నాడు కానీ విజయాలు మాత్రం రావడం లేదు.
తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ హీరోలలో శర్వానంద్ (Sharwanand) కూడా ఒకడు. అయితే ఈ మధ్య ఈయన అదృష్టం మాత్రం వెక్కిరిస్తుంది. వరస సినిమాలు చేస్తున్నాడు కానీ విజయాలు మాత్రం రావడం లేదు. మరీ ముఖ్యంగా భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు కూడా దారుణంగా నిరాశ పరుస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఈయన ఆశలన్నీ ఇప్పుడు ఆడవాళ్లు మీకు జోహార్లు (Aadavallu Meeku Johaarlu trailer) సినిమాపైనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. కిషోర్ తిరుమల (Kishore Tirumala) తెరకెక్కించిన ఈ చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి. పైగా వరస విజయాలతో ఈ దర్శకుడు జోరు మీదున్నాడు. నేను శైలజ (Nenu Sailaja), చిత్రలహరి (Chitralahari), రెడ్ (RED) లాంటి సినిమాలతో మంచి విజయాలు అందుకున్నాడు కిషోర్. మధ్యలో రామ్‌తో (Ram Pothineni) చేసిన ఉన్నది ఒకటే జిందగీ సినిమా కూడా మంచి టాక్ తెచ్చుకుంది.
అదే సమయంలో వెంకటేష్‌తో ఈయన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ప్లాన్ చేసాడు కానీ అది శర్వానంద్ చేతుల్లోకి వచ్చింది. మార్చ్ 4న ఈ సినిమా విడుదల కానుంది. శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ చిత్రం ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఇందులో డైలాగులు అదిరిపోయాయి. పెళ్లి కోసం తంటాలు పడే యువకుడిగా శర్వానంద్ నటించాడు. మరోవైపు ఆయన పెళ్లికి అడ్డుపడే ఆడ గ్యాంగ్ ఒకటి ఉంటుంది. వాళ్లను తప్పించుకుని.. తను ప్రేమించిన అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నాడు అనేది ఈ సినిమా కథ. ట్రైలర్లోనే కథ అంతా చెప్పేసాడు దర్శకుడు కిషోర్. శర్వానంద్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.
ఇక రష్మిక మందన్న (Rashmika Mandanna) కూడా అదరగొట్టింది. తనదైన డైలాగ్ డెలవరితో పిచ్చెక్కించింది. ఎక్కడ దొరికావురా సామి నువ్వు నాకు అంటూ రష్మిక చెప్పిన డైలాగ్ సూపర్‌గా పేలింది. అలాగే ట్రైలర్లో మరికొన్ని షాట్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే సినిమా కచ్చితంగా విజయం వైపు అడుగులు వేసేలా కనిపిస్తుంది. కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు కిషోర్ తిరుమల. పైగా ఇందులో రాధిక, ఖుష్బూ, ఊర్వశి సహా చాలా మంది మాజీ హీరోయిన్లు నటించారు. వాళ్ల చుట్టూనే తిరిగే కథ ఇది. మార్చ్ 4 నుంచి కచ్చితంగా థియేటర్స్‌లో నవ్వులు పూయడం ఖాయం అంటున్నారు మేకర్స్. మరి వాళ్ల నమ్మకం నిజమై.. శర్వానంద్ ఈ సినిమాతో విజయం అందుకుంటాడో లేదో చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.