హోమ్ /వార్తలు /సినిమా /

Aadavallu Meeku Johaarlu Teaser : సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఆడవాళ్లు మీకు జోహార్లు టీజర్..

Aadavallu Meeku Johaarlu Teaser : సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఆడవాళ్లు మీకు జోహార్లు టీజర్..

Aadavallu Meeku Johaarlu Teaser : సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఆడవాళ్లు మీకు జోహార్లు టీజర్..

Aadavallu Meeku Johaarlu Teaser : శర్వానంద్ లేటెస్ట్ సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా వస్తోన్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా టీజర్ (Aadavallu Meeku Johaarlu Teaser) విడుదలై ఆకట్టుకుంటోంది.

Aadavallu Meeku Johaarlu Teaser | Sharwanand | Rashmika Mandanna :  టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్  (Sharwanand )ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నాడు. హిట్టు ఫ్లాపులతో పని లేకుండా వరస సినిమాలు చేస్తూనే ఉన్నారు శర్వానంద్. అయితే కొన్నేళ్లుగా శర్వానంద్‌కు   (Sharwanand ) సరైన విజయం లేదు. ఎంచుకున్న సినిమాల కథలు బాగున్నా విజయాలు అందుకోలేకపోతున్నారు. గతేడాది శర్వానంద్  ‘శ్రీకారం’ సినిమాతో పలకరించారు. ఈ సినిమా థియేటర్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన, ఓటీటీలో విడుదలై మంచి ఆదరణ పొందింది.  ఆ తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ‘మహా సముద్రం’ సినిమాతో పలకరించినా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ‘మహా సముద్రం’ మాత్రం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టిందనే చెప్పాలి. ఇక శర్వానంద్ లేటెస్ట్ సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా వస్తోన్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా టీజర్ (Aadavallu Meeku Johaarlu Teaser) విడుదలై ఆకట్టుకుంటోంది. యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతూ ఇప్పటికే వన్ మిలియన్‌కు పైగా వ్యూస్‌ను దక్కించుకుంది. ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’  సినిమా చేసారు. ఈ చిత్రాన్ని కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో శర్వానంద్ పెళ్లి కానీ యువకుడి పాత్రలో నటించారు. ఈయన ఇంట్లో అమ్మ, పిన్ని, అత్త అంటూ చాలా మంది ఆడవాళ్లు ఉంటారు. ఇతను చూసే అమ్మాయిల్లో లోపాలు వెతుకుతూ ఈ సంబంధం సెట్ కాకుండా చేస్తుంటారు.

ఈ నేపథ్యంలో శర్వానంద్.. రష్మికతో లవ్‌లో పడతారు. కానీ వీరి పెళ్లికి ఓ అడ్డంకి ఉంటోంది. దాన్ని దాటుకుని హీరో పెళ్లి చేసుకుంటాడా లేదా అనేదే  ఈ సినిమా స్టోరీలా ఉంది. ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా నవ్వులు పూయించేలా ఉంది. ప్రతి మగాడి జీవితంలో ఆడవాళ్లు లేనిదే ఏమి లేదు అనే విషయాన్ని ఈ టీజర్‌లో ప్రస్తావించారు. దర్శకుడు తిరుమల కిషోర్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో శర్వానంద్‌కు జోడిగా రష్మిక మందన్న (Rashmika Mandanna) నటిస్తున్నారు. ఇక ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమా కూడా షూటింగ్ కంప్లీటై ఫస్ట్ కాపీ కూడా రెడీ అయింది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 25న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఇదే రోజునా పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ కూడా విడుదల కానుందని ప్రకటించారు. ఈ సినిమాలో సీనియర్ నటీమణులు రాధిక, కుష్బూ, ఊర్వశి నటించారు.

‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ (Aadavallu Meeku Johaarlu) సినిమాతో పాటు శర్వానంద్,  ‘ఒకే ఒక జీవితం’ అనే సినిమా కూడా చేస్తున్నారు. ఈ చిత్రంలో అక్కినేని అమల మరో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఇది శర్వాకు 30వ సినిమా కావడం గమనార్హం. నూత‌న ద‌ర్శ‌కుడు శ్రీ కార్తిక్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్నారు. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఎస్ ఆర్ ప్ర‌కాశ్ బాబు, ఎస్ ఆర్ ప్ర‌భు నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి త‌రుణ్ భాస్క‌ర్ డైలాగ్స్ అందిస్తున్నారు. ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల‌ చేసింది చిత్ర యూనిట్‌. ఈ చిత్రానికి ‘ఒకే ఒక జీవితం’ అనే టైటిల్‌ను క‌న్ఫ‌ర్మ్ చేశారు మేకర్స్‌. సైన్స్‌ ఫిక్ష‌న్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతుంది.

Alia Bhatt : తెల్ల చీరలో ఏంజెల్‌లా మెరిసిపోతున్న ఆర్ ఆర్ ఆర్ భామ అలియా భట్...

శ‌ర్వానంద్ స‌ర‌స‌న తెలుగ‌మ్మాయి రీతు వ‌ర్మ‌ హీరోయిన్‌గా న‌టిస్తుండగా వెన్నెల కిషోర్‌, ప్రియ‌ద‌ర్శి స‌పోర్టింగ్ రోల్స్‌లో న‌టిస్తున్నారు. ఈ సినిమాలో అక్కినేని అమ‌ల ఒక కీల‌క పాత్ర‌లో న‌టిస్తుండ‌డం విశేషం. జేక్స్ బీజోయ్ సంగీతం స‌మ‌కూరుస్తుండగా డియ‌ర్ కామ్రెడ్ ఫేమ్ సినిమాటోగ్రాఫ‌ర్‌, ఎడిట‌ర్ సుజీత్ సారంగ్, శ్రీ జిత్ సారంగ్ ఈ చిత్రంలో భాగ‌మ‌య్యారు. ఫ్యామిలీ ఆడియ‌న్స్‌లో శ‌ర్వానంద్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. సై - ఫై ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియ‌న్స్‌తో పాటు యూత్‌కి న‌చ్చే విధంగా ఉండ‌బోతుందంటున్నారు మేకర్స్. నిజానికి త‌ల్లి-కొడుకుల బంధంతో ఉన్న సినిమాలు అన్ని వ‌ర్గాల వారికి న‌చ్చుతాయి. ఇప్ప‌టికే ఒకే ఒక జీవితం మూవీ షూటింగ్ పూర్త‌య్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని గీతాలు మంచి టాక్ సంపాదించుకున్నాయి.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Rashmika mandanna, Sharwanand, Tollywood news

ఉత్తమ కథలు