Home /News /movies /

SHARWANAND RASHMIKA MANDANNA AADAVALLU MEEKU JOHAARLU RELEASING IN THEATRES IN FEBRUARY 25 TA

Sharwanand - Rashmika : ‘భీమ్లా నాయక్’ డేట్‌ ఫిక్స్ చేసుకున్న శర్వానంద్, రష్మికల ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’..

శర్వానంద్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ రిలీజ్ డేట్ (Twitter/Photo)

శర్వానంద్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ రిలీజ్ డేట్ (Twitter/Photo)

Sharwanand - Rashmika - Aadavallu Meeku Johaarlu :  టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారని చెప్పవచ్చు. తాజాగా ఈయన హీరోగా నటించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు.

  Sharwanand - Rashmika - Aadavallu Meeku Johaarlu :  టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారని చెప్పవచ్చు. హిట్టు ఫ్లాపులతో పని లేకుండా వరస సినిమాలు చేస్తూనే ఉన్నాడు శర్వానంద్. కొన్నేళ్లుగా ఈయనకు సరైన విజయం లేదు. కానీ సినిమాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ ఏడాది శ్రీకారం సినిమాతో ఆకట్టుకున్నాడు. సినిమా ఫ్లాప్ అయినా కూడా మంచి పేరు వచ్చింది.  ఆ తర్వాత ‘మహా సముద్రం’ సినిమాతో పలకరించినా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఇక ‘శ్రీకారం’ మాత్రం ఓటీటీ వేదికగా మంచి టాక్ సొంతం చేసుకుంది. మరోవైపు ‘మహా సముద్రం’ మాత్రం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టిందనే చెప్పాలి. తాజాగా ఇతను తనకు సేఫ్ జోన్ అయిన ఫ్యామిలీ చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’  సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్నాడు.

  దాంతో పాటు ‘ఒకే ఒక జీవితం’ అనే సినిమా కూడా చేస్తున్నారు. ఈ చిత్రంలో అక్కినేని అమల మరో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది. . ఇది శర్వాకు 30వ సినిమా కావడం గమనార్హం. నూత‌న ద‌ర్శ‌కుడు శ్రీ కార్తిక్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్నారు. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఎస్ ఆర్ ప్ర‌కాశ్ బాబు, ఎస్ ఆర్ ప్ర‌భు నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి త‌రుణ్ భాస్క‌ర్ డైలాగ్స్ అందిస్తున్నారు. ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల‌ చేసింది చిత్ర యూనిట్‌. ఈ చిత్రానికి ఒకే ఒక జీవితం అనే టైటిల్‌ను క‌న్ఫ‌ర్మ్ చేశారు మేకర్స్‌. సైన్స్‌ ఫిక్ష‌న్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతుంది.

  Ram Charan : అలా జరిగితే రామ్ చరణ్ కెరీర్‌లో అంతకంటే అద్భుతం మరోకటి ఉండదు..

  ఈ పోస్టర్ ప్రపంచీకరణ ప్రభావాన్ని వివరించేలా ఉంది. శ‌ర్వానంద్ స‌ర‌స‌న తెలుగ‌మ్మాయి రీతు వ‌ర్మ‌ హీరోయిన్‌గా న‌టిస్తుండగా వెన్నెల కిషోర్‌, ప్రియ‌ద‌ర్శి స‌పోర్టింగ్ రోల్స్‌లో న‌టిస్తున్నారు. ఈ సినిమాలో అక్కినేని అమ‌ల ఒక కీల‌క పాత్ర‌లో న‌టిస్తుండ‌డం విశేషం. జేక్స్ బీజోయ్ సంగీతం స‌మ‌కూరుస్తుండగా డియ‌ర్ కామ్రెడ్ ఫేమ్ సినిమాటోగ్రాఫ‌ర్‌, ఎడిట‌ర్ సుజీత్ సారంగ్, శ్రీ జిత్ సారంగ్ ఈ చిత్రంలో భాగ‌మ‌య్యారు. ఫ్యామిలీ ఆడియ‌న్స్‌లో శ‌ర్వానంద్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది.

  Prabhas - Adipurush : ప్రభాస్ ‘ఆదిపురుష్’ ప్రపంచ రికార్డు.. ఇది కదా రెబల్ స్టార్ రేంజ్..

  సై - ఫై ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియ‌న్స్‌తో పాటు యూత్‌కి న‌చ్చే విధంగా ఉండ‌బోతుందంటున్నారు మేకర్స్. నిజానికి త‌ల్లి-కొడుకుల బంధంతో ఉన్న సినిమాలు అన్ని వ‌ర్గాల వారికి న‌చ్చుతాయి. ఇప్ప‌టికే ఒకే ఒక జీవితం మూవీ షూటింగ్ పూర్త‌య్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని గీతాలు మంచి టాక్ సంపాదించుకున్నాయి.

  ‘పుష్ప’ 6 వారాల కలెక్షన్స్.. బాక్సాఫీస్ దగ్గర తగ్గేదేలే అంటున్న అల్లు అర్జున్..

  శర్వానంద్, రష్మికతో నటించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమా కూడా షూటింగ్ కంప్లీటై ఫస్ట కాపీ కూడా రెడీ అయింది. ఇక ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 25న పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ విడుదల తేదినే ఈ మూవీని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.


  అంటే ఫిబ్రవరి 25న పవన్ కళ్యాణ్,రానాల ‘భీమ్లా నాయక్’ రావడం లేదనే ధైర్యంతో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు తెలుస్తోంది. లేకపోతే.. పవర్ స్టార్ సినిమాకు ఎదురెళ్లే సాహసం శర్వానంద్‌తో పాటు చిత్ర నిర్మాతలు చేస్తారా అని అందరు చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో సీనియర్ నటీమణులు రాధిక, కుష్బూ, ఊర్వశి నటిస్తున్నారు. మొత్తంగా ఫిబ్రవరి 25న శర్వానంద్ రావడం పక్కా అని తేలడంతో ‘భీమ్లా నాయక్’ కొత్త రిలీజ్ డేట్ ఎపుడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Aadavallu meeku johaarlu, Bheemla Nayak, Rashmika mandanna, Sharwanand, Tollywood

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు