Aadavallu Meeku Johaarlu | Sharwanand | Rashmika Mandanna : టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ (Sharwanand ), రష్మిక మందన్న హీరోయిన్లుగా.. రాధిక, కుష్పూ, ఊర్వశి వంటి సీనియర్ హీరోయిన్స్ ముఖ్యపాత్రలో కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసిన మూవీ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌తో ఈ సినిమాపై మహిళ ప్రేక్షకుల్లో పాజిటివ్ బజ్ ఏర్పడింది. మరికొన్ని గంటల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన శర్వానంద్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఇతను కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నాడు. హిట్టు ఫ్లాపులతో పని లేకుండా వరుస సినిమాలు చేస్తూనే ఉన్నారు శర్వానంద్. అయితే కొన్నేళ్లుగా శర్వానంద్‌కు (Sharwanand) సరైన విజయం లేదు. ఎంచుకున్న సినిమాల కథలు బాగున్నా విజయాలు అందుకోలేకపోతున్నారు.
గతేడాది శర్వానంద్ ‘శ్రీకారం’ సినిమాతో పలకరించారు. ఈ సినిమా థియేటర్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన, ఓటీటీలో విడుదలై మంచి ఆదరణ పొందింది. ఆ తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ‘మహా సముద్రం’ సినిమాతో పలకరించినా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఇక ఆ తర్వాత శర్వానంద్ నటించిన లేటెస్ట్ సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా వస్తోన్న ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల ట్రైలర్ విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. (Aadavallu Meeku Johaarlu Teaser) . యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతూ మంచి వ్యూస్‌ను పొందింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేసారు.
The fun behind the Making of #AadavalluMeekuJohaarlu
IN CINEMAS MARCH 4th ▶️ https://t.co/UXAh830lh2#AMJOnMarch4th@ImSharwanand @iamRashmika @DirKishoreOffl @ThisIsDSP @SLVCinemasOffl @LahariMusic pic.twitter.com/ytZeznNnXR — BA Raju's Team (@baraju_SuperHit) March 2, 2022
మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన యూఎస్ ప్రీమియర్స్ మరికొన్ని గంటల్లో థియేటర్స్‌లో ప్రదర్శించనున్నారు. అక్కడ 315 పైగా లోకేషన్స్‌లో ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు. శర్వానంద్ కెరీర్‌లో ఇది అతి పెద్ద రిలీజ్ అని చెబుతున్నారు.
#AadavalluMeekuJohaarlu USA premiers bookings opened now at @Cinemark @RegalMovies @AmcTheatres @Marcus_Theatres & others. 315+ Locations Huge Release.
Overseas release by @Radhakrishnaen9 @ImSharwanand @iamRashmika @SLVCinemasOffl@DirKishoreOffl @ThisIsDSP @sujithsarang pic.twitter.com/pXRFbwKDdH — BA Raju's Team (@baraju_SuperHit) March 2, 2022
ఇక ఈ సినిమాకు సుకుమార్ వాయిస్ ఓవర్ అందించారు. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 24న విడుదలకావాల్సి ఉంది. అయితే భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న విడుదలవుతుండడంతో ఈ సినిమాను మార్చి 4కు పోస్ట్‌పోన్ చేశారు. ఈ చిత్రాన్ని కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ చిత్రంలో శర్వానంద్‌కు జోడిగా రష్మిక మందన్న (Rashmika Mandanna) నటించింది.
‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ (Aadavallu Meeku Johaarlu) సినిమాతో పాటు శర్వానంద్, ‘ఒకే ఒక జీవితం’ అనే సినిమా కూడా చేస్తున్నారు. ఈ చిత్రంలో అక్కినేని అమల మరో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఇది శర్వాకు 30వ సినిమా కావడం గమనార్హం. నూతన దర్శకుడు శ్రీ కార్తిక్ దర్శకత్వంలో చేయనున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తున్నారు. ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ చిత్రానికి ‘ఒకే ఒక జీవితం’ అనే టైటిల్‌ను కన్ఫర్మ్ చేశారు మేకర్స్. సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతుంది.
శర్వానంద్ సరసన తెలుగమ్మాయి రీతు వర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా వెన్నెల కిషోర్, ప్రియదర్శి సపోర్టింగ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాలో అక్కినేని అమల ఒక కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం. జేక్స్ బీజోయ్ సంగీతం సమకూరుస్తుండగా డియర్ కామ్రెడ్ ఫేమ్ సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ సుజీత్ సారంగ్, శ్రీ జిత్ సారంగ్ ఈ చిత్రంలో భాగమయ్యారు. ఫ్యామిలీ ఆడియన్స్‌లో శర్వానంద్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. సై - ఫై ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్‌కి నచ్చే విధంగా ఉండబోతుందంటున్నారు మేకర్స్. నిజానికి తల్లి-కొడుకుల బంధంతో ఉన్న సినిమాలు అన్ని వర్గాల వారికి నచ్చుతాయి. ఇప్పటికే ఒకే ఒక జీవితం మూవీ షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని గీతాలు మంచి టాక్ సంపాదించుకున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.