హోమ్ /వార్తలు /సినిమా /

Aadavallu Meeku Johaarlu : ఆడవాళ్లు మీకు జోహార్లు క్లోజింగ్ కలెక్షన్స్.. మొత్తంగా ఎంత లాస్ అంటే..

Aadavallu Meeku Johaarlu : ఆడవాళ్లు మీకు జోహార్లు క్లోజింగ్ కలెక్షన్స్.. మొత్తంగా ఎంత లాస్ అంటే..

Aadavallu Meeku Johaarlu Closing Collections :  టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్  (Sharwanand) ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. హిట్టు ఫ్లాపులతో పని లేకుండా వరుస సినిమాలు చేస్తూనే ఉన్నారు శర్వానంద్. ఎంచుకున్న సినిమాల కథలు బాగున్నా విజయాలు అందుకోలేకపోతున్నారు.

ఇంకా చదవండి ...

  Aadavallu Meeku Johaarlu Closing Collections :  టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్  (Sharwanand) ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. హిట్టు ఫ్లాపులతో పని లేకుండా వరుస సినిమాలు చేస్తూనే ఉన్నారు శర్వానంద్. ఎంచుకున్న సినిమాల కథలు బాగున్నా విజయాలు అందుకోలేకపోతున్నారు. గతేడాది శర్వానంద్  ‘శ్రీకారం’ సినిమాతో పలకరించారు. ఈ సినిమా థియేటర్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా, ఓటీటీలో విడుదలై మంచి ఆదరణ పొందింది.  ఆ తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ‘మహా సముద్రం’ సినిమాతో పలకరించినా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఇక ఆ తర్వాత శర్వానంద్ నటించిన లేటెస్ట్ సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం మార్చి 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఓకే అనిపించుకుంది. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ చిత్రంలో శర్వానంద్‌కు జోడిగా రష్మిక మందన్న (Rashmika Mandanna) నటించారు.

  ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. మార్చి 4న విడుదలైన ఈ చిత్రానికి యావరేజ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ విషయంలో కొద్దిగా ఓకె అనిపించినప్పటికీ ఆ తర్వాత పెద్దగా కలెక్షన్స్ రాలేదు.

  ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్‌ ఇలా ఉన్నాయి..

  నైజాం.. 2.61 cr

  సీడెడ్.. 0.77 cr

  ఉత్తరాంధ్ర.. 0.86 cr

  ఈస్ట్.. 0.51 cr

  వెస్ట్.. 0.39 cr

  గుంటూరు.. 0.49 cr

  కృష్ణా.. 0.47 cr

  నెల్లూరు.. 0.30 cr

  ఏపీ + తెలంగాణ.. 6.40 cr

  రెస్ట్ ఆఫ్ ఇండియా.. 0.40 cr

  ఓవర్సీస్.. 0.92 cr

  వరల్డ్ వైడ్ మొత్తంగా.. 7.72 cr కలెక్ట్ చేసింది.

  ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ దాదాపు16 కోట్ల వరకు అవ్వగా... బ్రేక్ ఈవెన్ కు రూ.16.5 కోట్ల వరకు షేర్‌ను రాబట్టాల్సి ఉంది. అయితే థియేట్రికల్ ఫుల్ రన్ ముగిసేసరికి కేవలం 7.72 కోట్ల షేర్‌ను మాత్రమే వసూలు చేసింది. దీంతో ఈ సినిమాను కొన్న బయ్యర్లకి దాదాపు 8 కోట్ల వరకు నష్టాలు వచ్చాయని సమాచారం. ఇక ఈ సినిమాలో సీనియర్ నటీమణులు రాధిక, కుష్బూ, ఊర్వశి నటించారు.

  Vijay | Beast : విజయ్-పూజా హెగ్డే బీస్ట్ అరబిక్ కుతు పాట మరో సంచలనం..

  ఇక శ‌ర్వానంద్ నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే..‘ఒకే ఒక జీవితం’ అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో అక్కినేని అమల మరో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఇది శర్వాకు 30వ సినిమా కావడం గమనార్హం. నూత‌న ద‌ర్శ‌కుడు శ్రీ కార్తిక్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఎస్ ఆర్ ప్ర‌కాశ్ బాబు, ఎస్ ఆర్ ప్ర‌భు నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి త‌రుణ్ భాస్క‌ర్ డైలాగ్స్ అందిస్తున్నారు. సైన్స్‌ ఫిక్ష‌న్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతుంది. రీతు వ‌ర్మ‌ హీరోయిన్‌గా న‌టిస్తుండగా వెన్నెల కిషోర్‌, ప్రియ‌ద‌ర్శి స‌పోర్టింగ్ రోల్స్‌లో న‌టిస్తున్నారు. జేక్స్ బీజోయ్ సంగీతం స‌మ‌కూరుస్తుండగా డియ‌ర్ కామ్రెడ్ ఫేమ్ సినిమాటోగ్రాఫ‌ర్‌, ఎడిట‌ర్ సుజీత్ సారంగ్, శ్రీ జిత్ సారంగ్ ఈ చిత్రంలో భాగ‌మ‌య్యారు. ఇప్ప‌టికే ఒకే ఒక జీవితం మూవీ షూటింగ్ పూర్త‌య్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని గీతాలు మంచి టాక్ సంపాదించుకున్నాయి.

  First published:

  Tags: Aadavallu meeku johaarlu, Rashmika mandanna, Sharwanand, Tollywood news

  ఉత్తమ కథలు