SHARWANAND OKE OKA JEEVITHAM TEASER RELEASED AND ITS MIXED OF SCIENCE FICTION AND TIME MACHINE STORY PK
Sharwanand Oke Oka Jeevitham: ‘ఒకే ఒక జీవితం’ టీజర్ రివ్యూ.. టైమ్ మిషన్‌తో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్..
ఒకే ఒక జీవితం సినిమా టీజర్ విడుదల (oke oka jeevitham)
Sharwanand Oke Oka Jeevitham: హిట్టు ఫ్లాపులతో పని లేకుండా వరస సినిమాలు చేస్తూనే ఉన్నాడు శర్వానంద్ (Sharwanand Oke Oka Jeevitham). కొన్నేళ్లుగా ఈయనకు సరైన విజయం లేదు. కానీ సినిమాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ ఏడాది శ్రీకారం సినిమాతో ఆకట్టుకున్నాడు. సినిమా ఫ్లాప్ అయినా కూడా మంచి పేరు వచ్చింది.
హిట్టు ఫ్లాపులతో పని లేకుండా వరస సినిమాలు చేస్తూనే ఉన్నాడు శర్వానంద్. కొన్నేళ్లుగా ఈయనకు సరైన విజయం లేదు. కానీ సినిమాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ ఏడాది శ్రీకారం సినిమాతో ఆకట్టుకున్నాడు. సినిమా ఫ్లాప్ అయినా కూడా మంచి పేరు వచ్చింది. మహాసముద్రం మాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ అయింది. దాంతో 2021 కూడా ఈ హీరోకు కలిసిరాలేదు. ఇదిలా ఉండగానే ఇప్పుడు ఒకే ఒక జీవితం అంటూ వచ్చేస్తున్నాడు శర్వా. ఇది శర్వానంద్ 30వ సినిమా కావడం గమనార్హం. నూతన దర్శకుడు శ్రీ కార్తిక్ దర్శకత్వంలో చేయనున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు టీజర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇది సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో.. టైమ్ మిషన్ కథతో తెరకెక్కుతుంది. చిత్ర కథకు ఒకే ఒక జీవితం పక్కాగా సరిపోతుందని చెప్తున్నారు యూనిట్.
సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతుంది. శర్వానంద్ వెనకాల గిటార్ వేసుకుని ఉండడం పోస్టర్లో మనం చూడొచ్చు. ఇప్పుడు టీజర్ కూడా పూర్తిగా కథ రివీల్ చేస్తూనే సాగింది. అప్పుడు విడుదలైన పోస్టర్లో ఒక వైపు పచ్చదనం, పోస్టాఫీసు, లేఖ, మ్యూజిక్ క్యాసెట్, గాలిపటాలు మొదలైనవి చూపించారు. మరొక వైపు కర్మాగారాలు, సెల్ టవర్, మొబైల్, మ్యూజిక్ సిస్టమ్, ఫ్లైట్‌ని చూపించారు. ఈ పోస్టర్ ప్రపంచీకరణ ప్రభావాన్ని వివరించేలా ఉంది. ఇప్పుడు టీజర్ మొత్తం సైన్స్ డ్రామా చూపించారు. శర్వానంద్ సరసన తెలుగమ్మాయి రీతు వర్మ హీరోయిన్గా నటిస్తుండగా వెన్నెల కిషోర్, ప్రియదర్శి సపోర్టింగ్ రోల్స్‌లో నటిస్తున్నారు. తెలుగు టీజర్ అడవి శేష్ విడుదల చేసాడు.
ఈ సినిమాలో అక్కినేని అమల ఒక కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం. జేక్స్ బీజోయ్ సంగీతం సమకూరుస్తుండగా డియర్ కామ్రెడ్ ఫేమ్ సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ సుజీత్ సారంగ్, శ్రీ జిత్ సారంగ్ ఈ చిత్రంలో భాగమయ్యారు. తెలుగుతో పాటు ఒకేసారి తమిళంలో కూడా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు శ్రీకార్తిక్. తమిళంలో ఈ టీజర్ హీరో సూర్య విడుదల చేసాడు. తమిళంలో కణం పేరుతో ఈ సినిమా వస్తుంది.
ఫ్యామిలీ ఆడియన్స్‌లో శర్వానంద్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. సై - ఫై ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్‌కి నచ్చే విధంగా ఉండబోతుందంటున్నారు మేకర్స్. నిజానికి తల్లి-కొడుకుల బంధంతో ఉన్న సినిమాలు అన్ని వర్గాల వారికి నచ్చుతాయి. ఇప్పటికే ఒకే ఒక జీవితం మూవీ షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సమ్మర్ 2022లో విడుదల కానుంది ఒకే ఒక జీవితం.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.