హోమ్ /వార్తలు /సినిమా /

Aadavallu Meeku Johaarlu 2 days ww Collections: ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ 2 డేస్ కలెక్షన్స్.. స్లో అండ్ స్టడీ..

Aadavallu Meeku Johaarlu 2 days ww Collections: ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ 2 డేస్ కలెక్షన్స్.. స్లో అండ్ స్టడీ..

Aadavallu Meeku Johaarlu 2 days ww Collections: శర్వానంద్ (Sharwanand) హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు. మంచి అంచనాలతోనే వచ్చిన ఈ చిత్రానికి ఊహించిన కలెక్షన్స్ మాత్రం రావడం లేదు. మార్చ్ 4న విడుదలైన ఈ సినిమా చాలా స్లోగా ఉందనే టాక్ వినిపిస్తుంది.

ఇంకా చదవండి ...

శర్వానంద్ (Sharwanand) హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు. మంచి అంచనాలతోనే వచ్చిన ఈ చిత్రానికి ఊహించిన కలెక్షన్స్ మాత్రం రావడం లేదు. మార్చ్ 4న విడుదలైన ఈ సినిమా చాలా స్లోగా ఉందనే టాక్ వినిపిస్తుంది. అదే సినిమాకు శాపం అయింది కూడా. సీరియల్ మాదిరి సాగే ఎమోషన్స్ మైనస్ అయిందంటున్నారు విశ్లేషకులు. ప్రేక్షకుల ఫీలింగ్ కూడా ఇదే. పైగా ఈ మధ్య శర్వానంద్ అదృష్టం అంతంతమాత్రంగానే ఉంది. వరస సినిమాలు చేస్తున్నాడు కానీ విజయాలు మాత్రం రావడం లేదు. మరీ ముఖ్యంగా భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు కూడా దారుణంగా నిరాశ పరుస్తున్నాయి. ఇలాంటి సమయంలో విడుదలైన సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు (Aadavallu Meeku Johaarlu). నేను శైలజ (Nenu Sailaja), చిత్రలహరి (Chitralahari), రెడ్ (RED) లాంటి సినిమాలతో మంచి విజయాలు అందుకున్నాడు కిషోర్. మధ్యలో రామ్‌తో (Ram Pothineni) చేసిన ఉన్నది ఒకటే జిందగీ సినిమా కూడా మంచి టాక్ తెచ్చుకుంది. కానీ హిట్ అవ్వలేదు. ఇప్పుడు ఆడవాళ్లు మీకు జోహార్లు అంటూ ఎమోషనల్ డ్రామాతో వచ్చాడు ఈయన. ఈ సినిమా 2 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ వచ్చాయి. అవి ఎలా ఉన్నాయో చూద్దాం..

నైజాం: 1.28 కోట్లు

సీడెడ్: 0.35 కోట్లు

ఉత్తరాంధ్ర: 0.39 కోట్లు

ఈస్ట్: 0.18 కోట్లు

వెస్ట్: 0.15 కోట్లు

గుంటూరు: 0.21 కోట్లు

కృష్ణా: 0.20 కోట్లు

నెల్లూరు: 0.13 కోట్లు

ఏపీ, తెలంగాణ 2 డేస్ కలెక్షన్స్: 2.89 కోట్లు

రెస్టాఫ్ ఇండియా  + కర్ణాటక: 0.20 కోట్లు

ఓవర్సీస్: 0.58 కోట్లు

వరల్డ్ వైడ్ 2 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 3.67 కోట్లు (3.60 కోట్లు గ్రాస్)

Bigg Boss OTT anchor Shiva: ఏంట్రా బాబూ ఇది.. ఆంటీతో అనుభవం.. బిగ్ బాస్ ఓటిటిలో యాంకర్ శివ బూతు పురాణం..

శర్వానంద్ గత సినిమా మహా సముద్రం, శ్రీకారం సినిమాలకు తొలిరోజు కనీసం 4 కోట్లకు పైగా షేర్ వచ్చింది. కానీ ఇప్పుడు ఆడవాళ్లు మీకు జోహార్లు మాత్రం కేవలం 1.92 కోట్లతోనే సరిపెట్టుకుంది. కనీసం 2 కోట్ల షేర్ కూడా రాబట్టలేదు. రెండో రోజు మరింత దారుణంగా పడిపోయాయి కలెక్షన్స్. 2 డేస్ కలిపి కేవలం 3.67 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది ఈ చిత్రం. ఇది సేఫ్ అవ్వాలంటే 16 కోట్లు షేర్ రావాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంత వసూలు చేయడం అంటే అసాధ్యంగానే కనిపిస్తుంది. రష్మిక మందన్న అందాలు.. శర్వానంద్ నటన కూడా ఈ సినిమాను కాపాడేలా కనిపించడం లేదు.

First published:

Tags: Box Office Collections, Sharwanand, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు