Home /News /movies /

SHARANYA SASI MALLUWOOD ACTRESS SHARNYA SASI DIES DUE TO BOTH COVID AND CANSER TA

Sharanya Sasi: చిత్ర సీమలో మరో విషాదం.. యువ మలయాళ నటి శరణ్య శశి కన్నుమూత..

ప్రముఖ నటి కన్నుమూత (File/Photo)

ప్రముఖ నటి కన్నుమూత (File/Photo)

Sharanya Sasi: చిత్ర సీమలో మరో విషాదం.. ఫేమస్ మల్లూవుడ్ యాక్ట్రెస్ శరణ్య శశి కన్నుమూసారు. దీంతో మలయాళ చిత్ర సీమలో విషాదం నెలకొంది.

    Sharanya Sasi: చిత్ర సీమలో మరో విషాదం.. ఫేమస్ మల్లూవుడ్ యాక్ట్రెస్ శరణ్య శశి కన్నుమూసారు. దీంతో మలయాళ చిత్ర సీమలో విషాదం నెలకొంది. శరణ్య శశి విషయానికొస్తే.. గత కొన్నేళ్లుగా బ్రెయిన్ ట్యూమర్‌లో  బాధపడుతోన్న ఆమె ఆగష్టు 9న ఈమె కేరళ రాజధాని తిరువనంతపురంలో ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గత పదేళ్ల నుంచి ఈమె బ్రెయిన్ ట్యూమర్ సమస్యతో బాధపడుతోంది. ఆర్టిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్న ఈమెకు ఇండస్ట్రీలోని పలువరు ప్రముఖులు ఆర్ధికంగా సాయం చేశారు. ఇప్పటికే ఈమెకు 11 మేజర్ ఆపరేషన్స్ జరిగాయి. ఈ సందర్భంగా బ్రెయిన్ ట్యూమర్ నుంచి కోలుకుంటున్న ఈమెకు కరోనా సోకడంతో మరోసారి తీవ్ర అస్వస్థతకు గురైయింది. అంతేకాదు రక్తం ఉప్పు, చక్కర స్థాయిలు పడిపోవడంతో ఆమెను కేరళలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్సతో ఆమె కరోనా నుంచి కోలుకున్నా.. ఇతర అనారోగ్య సమస్యలు వెంటాడటంతో ఆమె కన్నుమూసారు. ఆమె వయసు 33 సంవత్సరాలు. శరణ్య శశి మలయాళంలో ఫేమస్ సీరియల్స్ ‘మంత్రకోడి’, సీత మరియు హరిచరందనం వంటి పలు సీరియల్స్‌తో బాగా పాపులర్ అయ్యారు. సీరియల్స్‌తో వచ్చిన క్రేజ్‌తో శరణ్య పలు సినిమాల్లో సహాయ నటి పాత్రల్లో అలరించడం విశేషం.

    ఇవి కూడా చదవండి.. 

    Shankar - Lingusamy: తెలుగు ఇండస్ట్రీ పై ఫోకస్ పెడుతున్న తమిళ దర్శకులు.. శంకర్ నుంచి లింగుస్వామి వరకు టాలీవుడ్ పై దండయాత్ర...

    Chiranjeevi: తనకు ఫ్లాప్ ఇచ్చిన ఆ స్టార్ దర్శకుడికి మరో ఛాన్స్ ఇస్తోన్న చిరంజీవి.. మెగాస్టార్ లిస్టులో పెరుగుతున్న డైరెక్టర్స్ లిస్ట్..

    HBD Mahesh Babu : తండ్రి సూపర్ స్టార్‌ కృష్ణతో మహేష్ బాబు ఎన్ని చిత్రాల్లో నటించారో తెలుసా..

    Controversial Photoshoots: కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఫోటోషూట్స్ ఇవే..
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Malayala Cinema, Malluwood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు