Home /News /movies /

SHANMUKH JASWANTH HOTTEST COMMENTS ON DEEPTHI SUNAINA DANCE PLUS PERFORMANCE NR

Deepthi sunaina - Shanmukh: ఇంతకంటే దారుణాలు తట్టుకున్న అంటూ దీప్తి 'డ్యాన్స్'పై షణ్ముఖ్ కామెంట్స్..!

Deepthi sunaina - Shanmukh

Deepthi sunaina - Shanmukh

Deepthi sunaina - Shanmukh: సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీలు గా మారిన షణ్ముఖ్, దీప్తి సునయన గురించి అందరికీ తెలిసిందే. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తనకంటూ ఓ సొంత క్రేజ్ ను సంపాదించుకున్న నటుడు షణ్ముఖ్.

    Deepthi sunaina - Shanmukh: సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీలు గా మారిన షణ్ముఖ్, దీప్తి సునయన గురించి అందరికీ తెలిసిందే. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తనకంటూ ఓ సొంత క్రేజ్ ను సంపాదించుకున్న నటుడు షణ్ముఖ్. ఇక డబ్ స్మాష్ వీడియోస్ ద్వారా సెలబ్రిటీ గా మారి.. ఆ తర్వాత బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా పాల్గొని మరింత క్రేజ్ సంపాదించుకుంది దీప్తి సునయన. ఇక వీరిద్దరూ కలిసి పలు షార్ట్ ఫిల్మ్ లు కూడా చేయగా.. వీరిద్దరి మధ్య లవ్ నడుస్తుందని కొన్ని వార్తలు కూడా వచ్చాయి.

    పలు ఇంటర్వ్యూలలో వీరిని తమ ప్రేమ గురించి ప్రశ్నించినప్పుడు.. అందరికీ తెలిసిందే కదా అంటూ అర్థం కాని మాటలతో తప్పించుకుంటారు. ఇక తాజాగా బుల్లితెర లో ప్రసారం అవుతున్న డాన్స్ ప్లస్ షో లో దీప్తి సునయన డాన్స్ చేస్తూ తెగ రెచ్చిపోయింది. కో డాన్సర్ తో కలిసి ఏకంగా నడుముపై ముద్దులు పెట్టించుకుంటూ.. వేదికపైనే తెగ రచ్చ చేసింది. ఇక ఇది చూసిన ప్రేక్షకులు షాక్ అవ్వగా.. సోషల్ మీడియా లో దీప్తి సునయన డాన్స్ గురించి తెగ కామెంట్స్ వస్తున్నాయి.

    అంతే కాకుండా కొందరు.. తన బాయ్ ఫ్రెండ్ షణ్ముఖ్ ను ఏంట్రా ఇది అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇక ఈ విషయానికి స్పందించిన షణ్ముఖ్ తన ఫాలోవర్స్ తో ముచ్చటించాడు. ఓ నెటిజన్ దీప్తి సునైనా చేష్టల గురించి, డాన్స్ పర్ఫార్మెన్స్ గురించి ప్రశ్నించాడు. అంతేకాకుండా తనను మీమర్స్ ట్రోల్స్ చేస్తుంటే ఏం అనిపించడం లేదా అంటూ ప్రశ్నించగా.. వెంటనే షణ్ముఖ్.. కొత్తగా ఏమి అనిపించలేదు.. ఇంతకన్నా దారుణాలు తట్టుకున్న గుండె ఇది అంటూ.. ఇవన్నీ ఎంత అంటూ సమాధానం ఇచ్చాడు.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Dance Plus, Deepthi Sunaina, Shanmukh, Shanmukh jaswanth, దీప్తి సునయన, షణ్ముఖ్

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు